'బీహార్‌లో సూరత్ మోడల్‌‌కు బీజేపీ కుట్ర'

‘‘దానాపూర్, బ్రహ్మపూర్, గోపాల్‌గంజ్ స్థానాల నుంచి తమ అభ్యర్థులు తప్పుకోడానికి కాషాయ పార్టీ నేతలే కారణం’’ - జన్ సూరాజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిషోర్..

Update: 2025-10-21 14:03 GMT
Click the Play button to listen to article

జన్ సురాజ్ పార్టీ(Jan suraaj) చీఫ్, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్(Prashanth Kishor) మంగళవారం (అక్టోబర్ 21) భారతీయ జనతా పార్టీ‌(BJP)పై ధ్వజమెత్తారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల (Bihar assembly elections) బరి నుంచి వైదొలగాలని తమ అభ్యర్థులను బీజేపీ బెదిరిస్తోందని తీవ్ర ఆరోపణలు చేశారు.

ఆ కారణంగానే దానాపూర్, బ్రహ్మపూర్, గోపాల్‌గంజ్ స్థానాల తమ అభ్యర్థులు బలవంతంగా నామినేషన్లను ఉపసంహరించుకోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు.


'సూరత్ మోడల్‌ను బీజేపీ ఫాలో అవుతోంది'

‘‘ప్రతిపక్ష అభ్యర్థులందరిని పోటీ నుంచి వైదొలగాలని బీజేపీ బలవంతం చేస్తుంది. ఫలితంగా తమ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యేలా వ్యూహం పన్నుతున్నారు. "సూరత్ మోడల్"ను బీహార్‌లో పునరావృతం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయాలని చేస్తున్నారు. దేశంలో ఇలాంటి ఘటనలు ఎప్పుడూ జరగలేదు. ఈ తరహా ధోరణిని ఓటర్లు గమనిస్తూనే ఉన్నారు. సమయం వచ్చినపుడు ఓటుతో జవాబు ఇస్తారు. గత సంవత్సరం లోక్‌సభ ఎన్నికల్లో 400 కంటే ఎక్కువ సీట్లు గెలుస్తామని గొప్పలు చెప్పుకున్నారు. కాని గెలిచింది కేవలం 240 సీట్లే." అని కిషోర్ అన్నారు. ఎన్నికలు పూర్తయిన తర్వాత కూడా దేశవ్యాప్తంగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలను వేటాడే అలవాటు బీజేపీకి ఉందని, అనేక రాష్ట్రాల్లో ఇలా చేశారని విమర్శించారు.

"బీహార్‌లో కూడా అదే జరుగుతోంది. ప్రస్తుతం బీహార్‌లో నిజమైన కూటమి లేదా ప్రజాస్వామ్యం అమలులో లేదు. జాన్‌సురాజ్ అభ్యర్థులను క్రమపద్ధతిలో అడ్డుకుంటున్నారు. మా అభ్యర్థుల్లో చాలా మంది నామినేషన్లు వేయకుండానే అడ్డుకున్నారు. " అని కిషోర్ అన్నారు .

‘దానాపూర్‌ నుంచి మా అభ్యర్థిగా ముతూర్ షాను ప్రకటించాం. అయితే నామినేషన్ వేయకుండా కిడ్నాప్ చేశారని ఆరోపణలు వచ్చాయి. ఆర్జేడీ అభ్యర్థి రిత్లాల్ యాదవ్ ముతూర్ షాను కిడ్నాప్ చేశారని బీజేపీ అంటోంది. మా అభ్యర్థి చివరిసారిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కనిపించారు. ఇప్పుడు ఎన్నికల సంఘం ఎక్కడ ఉంది? ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?" అని కిషోర్ ప్రశ్నించారు.

గడిచిన రెండు రోజుల్లో జన్ సురాజ్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అమిత్ కుమార్ పాశ్వాన్, మాజీ జిల్లా కౌన్సిలర్ అనితా కుమారి, పార్టీ వ్యవస్థాపక సభ్యుడు కర్మవీర్ పాశ్వాన్ సహా పలువురు బీజేపీలో చేరారు.

Tags:    

Similar News