బీహార్: మొదటి దశ ఎన్నికలకు దాఖలైన నామినేషన్లు 1,250..
హ్యట్రిక్ కొట్టాలని రాఘోపూర్ నుంచి పోటీకి దిగిన భారత కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి, RJD నాయకుడు తేజస్వి యాదవ్..
బీహార్(Bihar)లో మొదటి దశ అసెంబ్లీ ఎన్నికలకు(Assembly Polls) నామినేషన్ ప్రక్రియ శుక్రవారం (అక్టోబర్ 17)తో ముగిసింది. నవంబర్ 6న ఎన్నికలు జరగనున్న 121 నియోజకవర్గాలకు 1,250 మందికి పైగా అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారని ఎలక్షన్ కమిషన్ పేర్కొంది. దాదాపు ఆరు నియోజకవర్గాలలో.. ఒకటి కంటే ఎక్కువ ఇండియా బ్లాక్ అభ్యర్థులు నామినేషన్లు వేశారు. అక్టోబర్ 20 ఉపసంహరణకు చివరి తేదీ కావడంతో.. ఆ లోగా కొంతమంది తప్పుకునే అవకాశం ఉంది.
ఇండియా బ్లాక్‌లో గందరగోళం..
భారత కూటమిలో ఆర్జేడీ, కాంగ్రెస్( Congress), మూడు వామపక్ష పార్టీలు, మాజీ రాష్ట్ర మంత్రి ముఖేష్ సహానీ వికాస్‌షీల్ ఇన్సాన్ పార్టీ (VIP) ఉన్నాయి. ప్రతి పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేస్తుందో ఇంకా ప్రకటించలేకపోయాయి. ఆయా పార్టీలు పోటీ చేసే నిర్దిష్ట నియోజకవర్గాలపై కూడా గందరగోళం నెలకొంది.
ఎవరు.. ఎక్కడి నుంచి..
జాలే నుంచి ఆర్జేడీ(RJD) నేత రిషి మిశ్రాను తమ గుర్తుపై పోటీ చేయించేందుకు కాంగ్రెస్ అంగీకరించింది. అయితే లాల్‌గంజ్‌లో ఆర్జేడీ అందుకు అంగీకరించలేదు. కాంగ్రెస్ పార్టీ ఆదిత్య కుమార్ రాజాను పోటీకి నిలిపినా.. డాన్ నుంచి రాజకీయ నాయకుడిగా మారిన మున్నా శుక్లా కుమార్తె శివానీ శుక్లా అదే స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేసింది. వైశాలి, కహల్‌గావ్‌లో కూడా ఈ తరహా పోటీ కనిపించే అవకాశం ఉంది. అదనంగా కాంగ్రెస్ కనీసం మూడు స్థానాల్లో - బచ్వారా, రాజపాకర్, రోసెరా - CPI అభ్యర్థులతో క్లాష్ అయ్యే అవకాశం ఉంది.
హ్యాట్రిక్ కొట్టాలన్న ఆశతో తేజస్వి..
RJD ఇచ్చిన ఆఫర్‌తో వికాస్‌షీల్ ఇన్సాన్ పార్టీ నేత సహానీ సంతోషంగా లేరని సమాచారం. దీంతో తారాపూర్, గౌర బౌరం స్థానాల్లో లాలూ ప్రసాద్ పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేసే అవకాశం ఉంది. 2020లో వీఐపీ కేవలం నాలుగు సీట్లు మాత్రమే గెలుచుకుంది. సహానీ తన నియోజకవర్గంలో ఓటమిపాలు కావడంతో ఈసారి పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఇక భారత కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి, RJD నాయకుడు తేజస్వి యాదవ్ రాఘోపూర్ నుంచి వరుసగా మూడోసారి పోటీకి దిగుతున్నారు.
మొదటి దశ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఇతర ప్రముఖ అభ్యర్థులలో డిప్యూటీ సీఎంలు సామ్రాట్ చౌదరి (తారాపూర్), విజయ్ కుమార్ సిన్హా (లఖిసరై)తో పాటు మంత్రులు మంగళ్ పాండే (బీజేపీ), విజయ్ కుమార్ చౌదరి (జేడీయూ) ఉన్నారు.
ఊరందుకున్న బీజేపీ ప్రచారం..
ఎన్నికల ప్రచారాన్ని బీజేపీ ముమ్మరం చేసింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సరన్ జిల్లాలో జరిగిన ర్యాలీలో ప్రసంగించారు. ఆ తర్వాత పాట్నాలో "బుద్ధిజీవి సమ్మేళన్" (మేధావుల సమావేశం)లో పాల్గొన్నారు. కాంగ్రెస్-RJD కలయిక "నేరస్థులు, విదేశీ చొరబాటుదారులకు మద్దతు ఇస్తుందని ఆరోపించారు. 2005లో అధికారం నుంచి దూరం పెట్టిన లాలూప్రసాద్ తిరిగి రాకుండా చూసుకోవాలని ప్రజలను కోరారు.
నితీష్‌తో షా భేటీ..
మర్యాదపూర్వక భేటీలో భాగంగా ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నివాసానికి హోంమంత్రి వెళ్లారు. సీట్ల పంపకాల్లో JD(U) అధినేత NDAతో ఆగ్రహంతో ఉన్నారనే పుకార్లకు ఊతమిచ్చింది. ఇటీవల ఒక టీవీ ఇంటర్వ్యూలో షా మాట్లాడుతూ.. కుమార్ నాయకత్వంలో ఎన్డీఏ ఎన్నికల్లో పోటీ చేస్తోందని చెప్పారు. అసెంబ్లీలో జేడీ(యూ) కంటే బీజేపీ ఎక్కువ సీట్లు గెలుచుకున్నా పర్వాలేదన్నారు. అది ఇప్పటికే సంఖ్యాపరంగా ఆధిక్యంలో ఉందని చెప్పారు.
జేడీ(యూ) నాయకులు షా ప్రకటనను స్వాగతించగా.. ఎన్‌డీఏ అధికారాన్ని నిలుపుకుంటే రాష్ట్రంలో ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన నితీష్ కుమార్ మరోసారి పదవిలో ఉంటారన్న విషయాన్ని షా స్పష్టంగా చెప్పలేదని ఆర్జేడీ, కాంగ్రెస్ నాయకులు వాదిస్తున్నారు.
243 మంది సభ్యులున్న అసెంబ్లీలో బీజేపీ, జేడీ(యూ) చెరో 101 స్థానాల్లో పోటీ చేయాలని అంగీకరించాయి. మిగిలిన స్థానాలను మిత్రపక్షాలైన లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్), కేంద్ర మంత్రులు చిరాగ్ పాశ్వాన్, జితన్ రామ్ మాంఝీ నేతృత్వంలోని హిందుస్తానీ అవామ్ మోర్చాకు వదిలేశారు.