బిభవ్ కుమార్‌కు జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు..

ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్ జ్యుడీషియల్ కస్టడీని జూన్ 22 వరకు పొడిగిస్తూ కోర్టు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.

Update: 2024-06-15 09:00 GMT

ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్ జ్యుడీషియల్ కస్టడీని జూన్ 22 వరకు పొడిగిస్తూ కోర్టు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.ఢిల్లీ ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో మే 13న కుమార్ తనపై దాడికి పాల్పడ్డారని ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. 16న ఆయనపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. కుమార్ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌‌ను కోర్టు కొట్టి వేయడంతో మే 18న కుమార్‌ని అరెస్టు చేశారు. కుమార్‌ను శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. కస్టడీని జూన్ 22 వరకు పొడిగిస్తున్నామని న్యాయమూర్తి చెప్పారు.

కుమార్ ను అరెస్టు చేసిన వెంటనే ఐదు రోజుల పోలీసు కస్టడీకి అప్పగించింది కోర్టు. మే 24న మళ్లీ నాలుగు రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీ, ఆ తరువాత మరో మూడు రోజుల పోలీసు కస్టడీకి పంపారు. 

Tags:    

Similar News