మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వైసీపీ పోరుబాట
రచ్చబండ, ధర్నాల నుంచీ గవర్నర్ కు వినతి పత్రం దాకా...
ఏపీలో మడికల్ కాలేజీలను ప్రభుత్వం ప్రైవేటీకరిస్తోందని ఆరోపిస్తున్న వైసీపీ పెద్ద ఎత్తున నిరసనలకు సిద్దమవుతోంది. ఈ విషయంలో ప్రజలలో చైతన్యం తీసుకురావాలని యోచిస్తోంది.రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనా కార్యక్రమాలకు కార్యాచరణ సిద్దంచేసింది. నిరసనలలో భాగంగా ఈనెల 10 నుంచీ 22 వరకూ రచ్చబండ కార్యక్రమాలకు ప్లాన్ చేసింది.అన్ని నియోజక వర్గాలలో 28న నిరసన ర్యాలీలు చేపట్టాలని పార్టీ నిర్ణయించింది. జిల్లా కేంద్రాలలో నవంబర్ 12న ధర్నాలు నిర్వహిస్తారు. దానితోపాటుగా ప్రతి నియోజకవర్గం నుంచి 50 వేల సంతకాల సేకరణ ఉద్యమాన్ని చేపట్టనున్నారు.మొత్తంగా కోటి సంతకాలతో చివరగా గవర్నర్ కు వినతిపత్రం ఇవ్వాలని కూడా నిర్ణయించారు.నవంబర్ 26 న పార్టీ నేతలు గవర్నర్ ను కలిసేలా వైసీపీ అధినేత జగన్ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ ముఖ్య నేతలతో సమీక్షించిన తరువాత జగన్ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశంలో నిరసన కార్యాచరణను ప్రకటించారు.