ఆంధ్రప్రదేశ్‌ను అడుగడుగున ఆదుకుంటున్నారు

బ్యాంకులు, బీమా కంపెనీల శంకుస్థాపన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పాల్గొన్నారు.

Update: 2025-11-28 07:55 GMT

ఆంధ్రప్రదేశ్ ను అడుగడుగున ఆదుకుంటున్నారని, ప్రధాని మోదీ, కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ కి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ధన్యవాదాలు తెలిపారు. అమరావతిలో బ్యాంకుల ప్రధాన కార్యాలయాల భవనాల శంకుస్థాపన కార్యక్రమంలో పవన్ కల్యాణ్ మాట్లాడారు. ఏమన్నారంటే.. రాజధాని అమరావతి, రాష్ట్రంలోనూ జరుగుతున్న అభివృద్ధి ప్రజలందరికీ కనిపించేలా కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది.  ఆర్ధిక లావాదేవీల కేంద్రంగా అమరావతి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో బ్యాంకుల ప్రధాన కార్యాలయాలకు శంకుస్థాపన చేయటం శుభసూచికం.  బ్యాంకులు, బీమా కంపెనీల ప్రధాన కార్యాలయాలు ఒకే చోట ఉండటం అరుదు. అది అమరావతి సాధించింది.  ఈ కేంద్ర కార్యాలయాలన్నీ ఒకే చోట ఉండటం ఆర్ధికంగా అందరికీ ప్రయోజనం కూడా. రూ.1334 కోట్ల వ్యయంతో ఈ ప్రధాన కార్యాలయాలు ఏర్పాటవుతున్నాయి. బ్యాంకులు వేస్తున్న ఈ పునాదులు అమరావతి ఆర్ధిక భవిష్యత్ నిర్మాణానికి కీలకం. సీఎం చంద్రబాబుపై ఉన్న విశ్వాసంతో రైతులు రాజధాని కోసం భూములు ఇచ్చారు. అమరావతి పునర్నిర్మాణం కోసం, పోలవరం కోసం, స్టీల్ ప్లాంట్ కోసం నిధులు ఇచ్చి సహకరించిన కేంద్రానికి ధన్యవాదాలు అంటూ పవన్ కల్యాణ్ ప్రసంగించారు. 

Tags:    

Similar News