వైసీపీ సూటి ప్రశ్నలు.. తడబడ్డ కూటమి మంత్రులు

ఉచిత గ్యాస్, మెడికల్‌ కళాశాల సీట్లు, మద్యం పాలసీపై మండలిలో గందరగోళం నెలకొంది.

By :  Admin
Update: 2024-11-15 08:15 GMT

ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలి సమావేశాల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ సభ్యులు, కూటమి మంత్రులకు మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. శుక్రవారం ప్రశ్నోత్తరాల సమయంలో వైసీపీ సభ్యులు ప్రశ్నల వర్షం కురిపించారు. ఆంధ్రప్రదేశ్‌లో 17 మెడికల్‌ కళాశాల్లో 5 ప్రారంభించారు. తక్కిన కళాశాలలు ఎప్పుడు ప్రారంభిస్తారని వైసీపీ సభ్యులు మొండితోక అరుణ్‌కుమార్‌ ప్రశ్నించారు. ఏ మోడల్‌లో మెడికల్‌ కళాశాలల్లో అమలుచేస్తున్నారని ప్రశించారు. దీనికి బదులిచ్చిన మంత్రి సత్యకుమార్‌ వ్యాఖ్యలతో మండలిలో దుమారం రేగింది. వైద్య కళాశాలల నిర్మాణం విషయంలో గత ప్రభుత్వం పక్షపాతంగా వ్యవహరించారని, పులివెందుల కళాశాలకు తప్ప తక్కిన వాటికి సరిపడిన విధంగా నిధులివ్వ లేదని అన్నారు. టీచింగ్‌ ఫ్యాకల్టీకి, మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు కేటాయించకపోవడం వల్ల నేషన్‌ మెడికల్‌ కౌన్సిల ఈ ఏడాకి నిధులివ్వలేదని అన్నారు. దీని కారణం గత ప్రభుత్వ తాలూకూ వ్యవహారమే అని మంత్రి అనడంతో వైసీపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలిపారు.

పులివెందుల మెడికల్‌ కళాశాల నిర్మాణం జరిగితే దానిని విమర్శించడం ఏంటని మండలి ఎల్‌ఓపి బొత్స సత్యనారాయణ, మంత్రిపై సీరియస్‌ అయ్యారు. సభను తప్పుదోవ పట్టించేందుకు మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ ప్రయత్నిస్తున్నారని, మెడికల్‌ కళాశాలల నిర్మాణాలను కూటమి ప్రభుత్వం గాలికి వదిలేసినందుకు నిరసనలు తెలుపుతున్నామన్నారు. తాము అడిగిన ప్రశ్నలకు మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ సమాధానాలు చెప్పడం లేదని, ఇది ప్రభుత్వం తాలూకు దాటవేతకు నిదర్శనమని, ప్రభుత్వ నిర్లక్ష్య వ్యవహారానికి నిరసనగా తాము వాక్‌ అవుట్‌ చేస్తున్నట్లు చెప్పిన వైసీపీ సభ్యులు ఆ ప్రకారం మండలి నుంచి వాక్‌అవుట్‌ చేశారు. ఉచిత గ్యాస్, మద్యం పాలసీపైన ఇదే రకమైన వాతావరణం నెలకొంది.

దీపం పథకం కింద లబ్ధిదారుల ఎంత మంది ఉన్నారో చెప్పాలని వైసీపీ సభ్యులు కళ్యాణి అడిగిన ప్రశ్నకు మంత్రి నాదెండ్ల మనోహర్‌ సూటిగా సమాధానం చెప్పలేక పోతున్నారని, ఎంత మందికి ఉచిత గ్యాస్‌ సిలిండర్లు ఇస్తారనే దానిపైన స్పష్టమైన అవగాహన ప్రభుత్వానికి లేదని విమర్శించారు. గత ప్రభుత్వం మద్యం దుకాణాలను తగ్గించి, ప్రభుత్వం ఆధ్వర్యంలో పారదర్శకంగా విక్రయాలు నిర్వహిస్తే, కూటమి ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోందని, మద్యం షాపులను విపరీతంగా పెంచడంతో పాటు కూటమి నేతలకే షాపులను కట్టబెట్టారని వైసీపీ సభ్యులు దువ్వాడ శ్రీనివాస్‌ అనడంతో అధికార పక్షం సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మండలిలో గందగోళ వాతావరణం నెలకొంది.

Tags:    

Similar News