ఏడు నెలల్లో చంద్రబాబు 1.19లక్షల కోట్లు అప్పు తెచ్చారు

సీఎం చంద్రబాబు మోసానికి మారు పేరు. రాజకీయాల్లో కొనసాగే అర్హత చంద్రబాబుకు లేదని పెద్దిరెడ్డి అన్నారు.;

By :  Admin
Update: 2025-01-30 13:07 GMT

కూటమి అధికారంలోకి వచ్చి నాటి నుంచి ఏడు నెలల కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు రూ. 1.19లక్షల కోట్లు అప్పు తెచ్చారని, ఆ సొమ్మును ఏమి చేశారో సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు చెప్పాలని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి డిమాండ్‌ చేశారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలన మీద ధ్వజమెత్తారు.

ఎన్నికల ముందు సూపర్‌ సిక్స్‌ హామీల్చి.. వాటితో ప్రజలతో ఓట్లు వేయించుకొని, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు పెద్ద గుండు సున్నా పెట్టారని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎన్నికల ముందు సూపర్‌ సిక్స్‌ అన్నారు.. ఇప్పుడు సాధ్యం కాదంటున్నారు.. సూపర్‌ సిక్స్‌ పథకాలపైన, వాటికయ్యే ఖర్చుపైన అంతర్జాతీయ ఆర్థికవేత్తలతో మాట్లాడి హామీ ఇచ్చాను అని చంద్రబాబు చెపుకున్నారని, ఇప్పుడేమో వాటి గురించి చంద్రబాబు మాట్లాడటం లేదని మండిపడ్డారు. హామీలు ఇచ్చే ముందు తెలియదా? అని చంద్రబాబును ప్రశ్నించారు. వైఎస్‌ జగన్‌ చెప్పిందే చేస్తారు.. చేసేదే చెబుతారని.. కోవిడ్‌–19 సమయంలో ఇచ్చిన మాటకు జగన్‌ కట్టుబడ్డారని అన్నారు. హామీలిచ్చిన తేదీల ప్రకారం సంక్షేమ పథకాలను అందించారని అన్నారు. జగన్‌ అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి అధ్యయనం చేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచి నాయకులు, అధికారులు ఆంధ్రప్రదేశ్‌కు వచ్చారని అన్నారు. కానీ సీఎం చంద్రబాబు నాయుడు మోసానికి మారు పేరని, ఆయన రాజకీయాల్లో కొనసాగేందుకు అనర్హులని, సూపర్‌ సిక్స్‌ పేరుతో దుర్మార్గంగా రాష్ట్ర ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు.

Tags:    

Similar News