YCP Blood Book |రక్తంతో మీ పేర్లు రాసుకుంటున్నాం వైసీపీ మాజీ ఎమ్మెల్యే

శ్రీకాళహస్తిలో నల్లజెండాలతో నిరసన.;

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-07-24 15:22 GMT
శ్రీకాళహస్తిలో నల్లజెండాలతో ర్యాలీ నిర్వహిస్తున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధు, నేతలు

టిడిపి కూటమి హామీలు అమలు చేయలేక అక్రమ అరెస్టులతో డైవర్షన్ పాలిటిక్స్ నడుపుతోందని వైసిపి శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఆరోపించారు.

"రెడ్ బుక్ అనేది గోలీలాట. మా పార్టీ శ్రేణులు మీ పేర్లు ( TDP ) రక్తంతో రాసి పెట్టుకుంటున్నాయి" అని మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి హెచ్చరించారు.
లిక్కర్ స్కామ్ (Liquor scam) లో రాజంపేట వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డిని అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ శ్రీకాళహస్తిలో గురువారం నల్లజెండాలతో నిరసన వ్యక్తం చేశారు. 

చిత్తూరు జిల్లాలో మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకును ఏపీ లిక్కర్ స్కామ్ లో రాజంపేట వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈయన అరెస్టును నిరసిస్తూ, జిల్లాలో మెల్లమెల్లగా నిరసన కార్యక్రమాలు జోరందుకుంటున్నాయి.
జిల్లాలో పడమటి తాలూకాలోని పుంగనూరు పలమనేరులో రాజుకున్న నిరసన జ్వాలలు తూర్పు తాలూకాలకు విస్తరించాయి.
శ్రీకాళహస్తి ఆలయ ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులతో కలిసి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి నాయకులు బ్యానర్, నల్లజెండాలతో ప్రదర్శన నిర్వహించారు.  పట్టణంలోని కూడలిలోని మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి, నిరసన వ్యక్తం చేశారు.

శ్రీకాళహస్తిలో గాంధీ విగ్రహానికి వినతిపత్రం ఇస్తున్న మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధు, ముక్కంటి ఆలయ మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు

వైసీపీ మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూధనరెడ్డి మీడియాతో మాట్లాడారు. వైసీపీ చీఫ్ ys. జగన్ కు సన్నిహితంగా ఉన్న నాయకులందరినీ అరెస్టు చేసి భయభ్రాంతులకు గురిచేయాలని కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆరోపించారు.
శ్రీకాళహస్తిలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదనరెడ్డి ఏమన్నారో వినండి

Full View


Similar News