తెలుగులో జీవోలతో తెలుగు పరిరక్షణ

ఇటీవల జరిగిన తెలుగు మహాసభల ప్రభావం కూటమి ప్రభుత్వంపై పడింది. తెలుగు పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పవన్‌ కల్యాణ్‌ మాట్లాడారు. తెలుగుజీవోలకు శ్రీకారం.;

By :  Admin
Update: 2025-01-04 05:35 GMT

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం జారీ చేసే అధికారిక ఉత్తర్వులు(గవర్నమెంట్‌ ఆర్డర్లు(జీవోలు)) ఇక నుంచి తెలుగులో విడుదల చేయాలని నిర్ణయించారు. ఇంగ్లీషుతో పాటుగా తెలుగులోను జారీ చేయనున్నారు. అంతేకాకుండా వీటిని ఆంధ్రప్రదేశ్‌ జీవోఐఆర్‌ వెబ్‌ సైట్‌లోను అప్‌లోడ్‌ చేయనున్నారు. ఇంగ్లీషు జీవోలతో పాటు తెలుగు ఉత్తర్వులను కూడా అప్‌లోడ్‌ చేయనున్నారు. ఆ మేరకు ఆంధ్రప్రదేశ్‌ జీఏడీ శాఖ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఇంగ్లీషుతో పాటు తెలుగులో వచ్చిన జీవోలను ఏపీజీవోఐఆర్‌ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేసేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని ఐటీ శాఖను ఆదేశించింది. ఇంగ్లీషు జీవోను అప్‌లోడ్‌ చేసిన ఒకటి, రెండు రోజుల్లో తెలుగు జీవోను అందుబాటులోకి తేవాలని, తొలుత తెలుగు జీవోను అప్‌లోడ్‌ చేస్తే..తర్వాత ఇంగ్లీషు జీవోను అప్‌లోడో చేయాలని ఆదేశించింది. దీంతో పాటుగా రెండు జీవోలను ఒకే సారి అప్‌లోడ్‌ చేసే వెసులుబాటు ఉండే విధంగా చూడాలని సూచించింది. అయితే తెలుగు భాషలో జీవోలను తేనున్నట్లు శుక్రవారం తెలుగులో జారీ చేసిన జీవోను ఇంగ్లీషు, తెలుగు భాషల్లో అప్‌లోడ్‌ చేసి తెలుగు జీవోల అమలుకు శ్రీకారం చుట్టింది.

భారత దేశంలోనే భాషాప్రయుక్త రాష్ట్రాలకు నాంది పలికిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌. భాషాప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌. 90 శాతానికి పైగా రాష్ట్రంలో ప్రజలు తెలుగు మాట్లాడుతారు. మరో వైపు ప్రభుత్వ పాలనలో అధికారిక ఉత్తర్వులు చాలా కీలకమైనవి. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు, విధానాలు, వివిధ గవర్నమెంట్‌ విభాగాలు, అధికారులు, ప్రజలకు చేరవేసే సాధనాలు జీవోలు. ప్రభుత్వం జారీ చేసే అధికారిక జీవోలను ఇంగ్లీషుతో పాటు తెలుగులో కూడా అందుబాటులోకి తీసుకొని రావడం వలల్ల.. అందులోని సమాచారం, ప్రభుత్వ నిర్ణయాలు రాష్ట్రంలోని ఎక్కువ మంది ప్రజలకు చేరేందుకు, పారదర్శకతకు దోహదం చేస్తుందని ప్రభుత్వం ఆ ఉత్తర్వులో పేర్కొంది. దీంతోపాటుగా తెలుగు భాష, సాంస్కృతిక వారసత్వాలకు సముచిత గౌరవం ఇచ్చేందకు కూడా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ ఉత్తర్వులో పేర్కొంది. ఇదిలా ఉంటే.. ఇటీవల విజయవాడలో తెలుగు ప్రపంచ మహాసభలు జరిగాయి. వాటికి, తెలుగులో జీవోలపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి లింక్‌ ఉంది. తెలుగు భాష అమలు గురించి వక్తలు ప్రసంగించారు. దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్‌ కూటమి ప్రభుత్వంపై పడింది. దీంతో తెలుగులో అధికారిక జీవోలు జారీ చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు అధికార వర్గల్లో చర్చ ఉంది. దీనికి తోడు ఇటీవల విజయవాడలో ప్రారంభమైన పుస్తక ప్రదర్శనలో ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతూ.. తెలుగు పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ప్రసంగించారు. ఈ నేపథ్యంలో తెలుగులో జీవోను అందుబాటులోకి తెలుస్తున్న ఉత్తర్వులు జారీ చేసింది.
Tags:    

Similar News