ఉద్యోగులకు ప్రభుత్వం న్యాయం చేస్తుందా

ఏపీ సచివాలయంలో ఉద్యోగుల సమస్యలపై ఉద్యోగ సంఘాల నాయకులతో మంత్రుల బృందం సమావేశమైంది.

Update: 2025-10-18 08:21 GMT

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన వివిధ పెండింగ్ అంశాలపై ఎపి సచివాలయం 5వ భవనంలో మంత్రుల బృందం (జిఓఎం)ఆధ్వర్యంలో గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సమావేశం ప్రారంభమైంది. ఈసమావేశంలో ప్రధానంగా ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ డిఏలు సహా ఇతర అంశాలపై మంత్రుల బృందం ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో చర్చిస్తోంది. ఈసమావేశంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, సర్వీసెస్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి పియూష్ కుమార్, పిఆర్ అండ్ ఆర్డి ముఖ్య కార్యదర్శి శశి భూషణ్ కుమార్, ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమల రావు, ఐటి శాఖ కార్యదర్శి కె.భాస్కర్, కార్యదర్శి వినయ్ చంద్, వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ వీరపాండ్యన్ తదితర అధికారులు పాల్గొన్నారు. 

ఉద్యోగుల నుంచి గుర్తింపు పొందిందిన ఉద్యోగ సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు ఎపి జెఎసి,  రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఎపి ఎన్జీవో నాయకుడు ఎ.విద్యాసాగర్, యుటిఎఫ్ నాయకులు శ్రీనివాస్, వెంకటేశ్వరరావు, ఎపి ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నాయకుడు కె.సూర్యనారాయణ, ఉద్యోగ సంఘాల అధ్యక్ష కార్యదర్శులు ఈ సమావేశానికి హాజరయ్యారు. 
Tags:    

Similar News