ఎమ్మెల్యే వంశీ అమెరికాలో స్థిరపడనున్నారా?

ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఈబీ–5 వీసా ద్వారా అమెరికా వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతానికి తన పిల్లల చదువు కోసం వెళ్లారు.

Update: 2024-05-23 09:32 GMT

కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌ అమెరికాలో స్థిరపడేందుకు తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నారా. అందుకోసం ఈబీ–5 వీసా కోసం దరఖాస్తులు చేసుకున్నారా..అనేది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో చర్చగా మారింది.

2024 ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ తరపున గన్నవర్గం నియోజక వర్గం అభ్యర్థిగా వంశీ పోటీ చేశారు. ఇక్కడ టీడీపీ, వైఎస్‌ఆర్‌సీపీకి టఫ్‌ ఫైట్‌ నెలకొంది. జూన్‌ 4న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఈలోపు తన కుమారుడుని
ఇంటర్‌ చదువుకునేందుకు అమెరికాలోని డల్లాస్‌ రాష్ట్రంలో ఒక విద్యా సంస్థలో చేర్పించారు. ఎన్నికల ప్రచారంలో బిజీగా గడిపిన వంశీ తన కుమారుడు వద్దకు వెళ్లారు. ఈ నెల 30న తిరిగి అమెరికా నుంచి ఆంధ్రప్రదేశ్‌కు రానున్నారు. అమెరికాలో గ్రీన్‌ కార్డును పొందేందుకు వంశీ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. గ్రీన్‌ కార్డు పొందాలంటే షరత్తులతో కూడుకున్న అంశం. అంత తేలిగ్గా గ్రీన్‌కార్డు రాదు. సింపుల్‌గా ఈబీ–5 వీసా తీసుకుంటే అమెరికాలో ఉండి పోవచ్చు. ఈ వీసా బిజెనెస్‌ షరత్తులపై ఇస్తారు. అమెరికాలో వ్యాపార సంస్థను ఏర్పాటు చేసి ఆ సంస్థ ద్వారా పది మంది అమెరికన్‌లకు ఫుల్‌టైమ్‌ ఉద్యోగాలు కల్పించాలి. అప్పుడు ఈబీ–5 వీసా వస్తుంది. తర్వాత ఏడాదిలోపు గ్రీన్‌ కార్డును పొందే అవకాశం ఉంటుంది.
వంశీ మే నెల 17న డల్లాస్‌కు వెళ్లారు. తన పిల్లల చదువు కోసం ఆయన అక్కడకు వెళ్లారని, ప్రత్యర్థులు ప్రచారం చేస్తున్నట్లు శాశ్వతంగా అమెరికాకు వెళ్తాడనేది కరెక్టు కాదని ఆయన అనుచరులు చెబుతున్నారు.
2024 ఎన్నికల్లో పోటీ చేయాల్సిందిగా సీఎం వైఎస్‌ జగన్‌ కోరినప్పుడు వంశీ దానిని తిరస్కరించినట్లు తెలిసింది. తన పిల్లల చదువులు ముఖ్యమని, వారిని అమెరికాలో మంచి విద్యా సంస్థల్లో చేర్పించి చదివించాలనుకుంటున్నట్లు నాడు జగన్‌కు వివరించారు. ఈ సారికి తప్పకుండా పోటీ చేయాలని జగన్‌ కోరిన మీదట పోటీ చేయాల్సి వచ్చిందని, ఇప్పటికే తన అనుచరులతో వంశీ పలు మార్లు చెప్పారు.
ఈబీ–5 వీసా అంటే ఏమిటి?
అమెరికాలో గ్రీన్‌ కార్డుకు సమానమైన గుర్తింపు ఉన్నదే ఈబీ–5 వీసా. అంతటి ప్రాధాన్యత ఉన్న ఈ వీసాను పొందాలంటే అమెరికాలో కనీసం రూ.8లక్షల అమెరికన్‌ డాలర్ల(ఇండియన్‌ కరెన్సీలో రూ. 6.57కోట్లు)లు పెట్టుబడిగా పెట్టడంతో పాటు పది మంది అమెరికన్లకు శాశ్వత ఉద్యోగాలు కల్పించాలి. దాంతో వారికి పెట్టుబడుల హోదా కింద ఈబీ–5 వీసాను అక్కడి ప్రభుత్వం జారీ చేస్తుంది.
అమెరికాలో దిగ్గజ ఐటీ కంపెనీలతో పాటు ఇతర కంపెనీలు ఉద్యోగాల్లో భారీగా కోతలు విధిస్తున్నాయి. దీంతో హెచ్‌–1బీ వీసా మీద ఆదేశం వెళ్లిన భారతీయులు వెనక్కి వచ్చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. లేదా అమెరికాలోనే కొనసాగాలంటే మరో సంస్థలోఉద్యోగం దక్కించుకోవాలి. అందుకు అవకాశాలు పెద్దగా లేక పోవడంతో వృత్తి నిపుణులు ఈబీ–5 వీసా కోసం దరఖాస్తులు చేసుకుంటున్నారు. ఎక్కువుగా రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెడుతున్నారు. కనీసం 20 మంది ఒక గ్రూపుగా ఏర్పడి ఒక్కొక్కరి నుంచి రూ. 8లక్షల అమెరికన్‌ డాలర్ల చొప్పున సేకరించి వివిధ రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్స్‌ చేపడుతున్న రెంటల్‌ అపార్ట్‌మెంట్లు, భవనాలు, హోటళ్ల వంటి ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెడుతున్నారు. వంశీ కూడా ఇదే తరహాలో అమెరికాలోని కన్సల్టెన్సీలతో భాగస్వామిగా మారి పెట్టుబడులు పెట్టేందుకు రెడీ అయినట్లు సమాచారం. ఈ విధంగా పెట్టుబడులు పెడితే ఎవరికీ ఉద్యోగాలు కల్పించాల్సిన అవసరం లేదు. పైగా పెట్టిన పెట్టుబడిపై వడ్డీ వస్తుంది. దీంతో పెట్టుబడుదారు హోదా దక్కుతుంది. ఆ హోదాను ఉపయోగించుకొని ఈబీ–5 వీసా పొందుతున్నారు. ఈ వీసాపై అమెరికాలో ఏ ప్రాంతలో అయినా పని చేసేందుకు అవకాశం ఉంటుంది. ఈ వీసా కింద ఐదుగురు కుటుంబ సభ్యులు అమెరికాలో ఉండొచ్చు.
Tags:    

Similar News