పవన్‌ కళ్యాణ్‌ పిల్లలు ఎందుకు ఏడ్చారు?

డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ పిల్లలు ఏడ్చేంతగా ఏమి జరిగింది? పోలీసులపై పవన్‌కు అంతకోపం ఎందుకొచ్చింది?

Update: 2024-11-07 05:49 GMT

ఏపీ డిప్యూటీ సీఎం పోలీసులపై ఎందుకు అంత కఠువుగా మాట్లాడారు. హోం మంత్రి అనిత పనితీరును కూడా ఎందుకు తప్పు పట్టారనేది ఇప్పుడు రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. తన పిల్లలపై అనుచితమైన పోస్టులు సోషల్‌ మీడియాలో పెట్టి అవమానించారని, వారు ఏడ్చి బయటకు వచ్చేందుకు కూడా అంగీకరించలేదని పవన్‌ కళ్యాణ్‌ బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్‌సీపీ సోషల్‌ మీడియా వారు, పార్టీ అభిమానుల్లో కొందరు సోషల్‌ మీడియాలో పోస్టులు ఇష్టానుసారం పెడుతున్నా పోలీసులు ఎందుకు పట్టించుకోవడం లేదనేది పవన్‌ ప్రశ్న.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును అరెస్ట్‌ చేసినప్పుడు అక్కడికి వచ్చిన ప్రజలపై లాఠీచార్జీ చేసిన పోలీస్‌ అధికారికి మంచి పోస్టు ఇవ్వటాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్‌ తప్పుపట్టారు. ఇటువంటి వారిపై చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. హోం మంత్రి చెప్పినా పోలీసులు వినిపించుకోవడం లేదు. నేను ఫోన్‌ చేసి చెప్పినా పట్టించుకోవడం లేదు. కింది స్థాయి అధికారులపై నెట్టేసి ఎస్పీలు పట్టీపట్టనట్లు ఉన్నారనే దానిపై పెద్ద చర్చ మంత్రివర్గంలో జరిగింది. మంత్రి వర్గ సమావేశం మొదలు పెట్టే ముందు పవన్‌ కళ్యాణ్‌ సమావేశానికి రావడం కాస్త ఆలస్యమైంది. దీంతో ముఖ్యమంత్రి సహచర మంత్రులతో మాట్లాడుతూ సోషల్‌ మీడియాలో వైఎస్సార్‌సీపీ వారు దుప్ప్రచారం చేస్తున్నారని, ఈ విధంగా దుష్ప్రచారానికి పాల్పడుతుంటే మనం చూస్తూ ఊరుకోవడం మంచిది కాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నన్ను, నా కుటుంబాన్ని, లోకేష్‌ను, లోకేష్‌ భార్యా, కుమారుడిపైనా ఇష్టానుసారం పోస్టులు పెట్టి అవమాన పరచడమే కాకుండా పాలనలో సమస్యలు సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారని సీఎం స్వయంగా అనటంతో మిగిలిన మంత్రులు కూడా తమ ఆవేదన వ్యక్తం చేశారు. వారిపై వచ్చిన పోస్టులను కూడా పలువురు మంత్రులు వెల్లడించారు.
Delete Edit
సమావేశంలోకి వచ్చిన పవన్‌ కళ్యాణ్‌ సోషల్‌ మీడియాపై మాట్లాడుతూ తన పిల్లలు బాధపడిన విషయం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయారు. నాపైనా, నా భార్యా పిల్లలపైనా ఇష్టానుసారం పోస్టులు పెడుతుంటే అటువంటి వారిని ఎలా క్షమించాలని అన్నారు. పోలీసులకు ఫిర్యాదులు చేసినా, ఫోన్‌లు చేసి చెప్పినా పట్టించుకోవడం లేదని ఆవేదన చెందారు. దీంతో సీఎం మాట్లాడుతూ నెల రోజుల్లో పోలీసులను గాడిలో పెట్టే చర్యలు తీసుకుంటానని చెప్పారు.
పవన్‌ కళ్యాణ్‌ పిల్లలపై సోషల్‌ మీడియాలో పోస్టులు ఏమని పెట్టారనే విషయంపైనా పలువురు చర్చించుకుంటున్నారు. తల్లి, తండ్రి కులాలు వేరని, మతాలు వేరని, కుల మతాలకు ముడిపెడుతూ పవన్‌ పిల్లలపై సెటైర్లు వేస్తూ సోషల్‌ మీడియాలో వైఎస్సార్‌సీపీ వారు పోస్టులు పెట్టారు. ఇందులో సోషల్‌ మీడియా టీముతో పాటు పార్టీ అభిమానులు కూడా ఉన్నారని, ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారని అటువంటి వారిని ఎలా వదిలి పెట్టాలనే చర్చ కూటమిలో జోరుగా సాగుతోంది. జనసేన పార్టీ నాయకులు, మంత్రులు ఈ విషయంలో చాలా సీరియస్‌గా ఉన్నారు. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకున్న పవన్‌ కళ్యాణ్‌ సోషల్‌ మీడియాపై చట్టం తీసుకు రావాలనే విషయాన్ని కూడా కొన్ని సందర్భాల్లో ప్రస్తావించారు.
Delete Edit
పోలీసులపై చర్యలు ప్రారంభమయ్యాయి. కడప ఎస్పీని బదిలీ చేయడమే కాకుండా అక్కడ ఇద్దరు సీఐలను సస్పెండ్‌ చేస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే బోరుగడ్డ అనిల్‌ కుమార్‌ను రాజమండి సెంట్రల్‌ జైలుకు తీసుకుపోతూ పోలీసులు ఆయనను హోటల్‌ లోపలికి తీసుకుపోయి భోజనం పెట్టించడాన్ని తప్పు పట్టిన డీజీపీ వెంటనే ఆ టీము ఆర్‌ఎస్‌ఐతో పాటు ఆరుగురు ఏఆర్‌ పోలీసులను సస్పెండ్‌ చేశారు. సోషల్‌ మీడియాలో ఇస్టానుసారం పోస్టులు పెట్టిన వారిపై నమోదైన కేసులను పోలీసులు బయటకు తీశారు. వారిని అరెస్ట్‌ చేసే పనిలో పోలీసులు ఉన్నారు.
Tags:    

Similar News