పార్శిల్‌ల్లో వచ్చిన ఆ శవం ఎవరిదంటే..

ఇంటికి కరెంటు వస్తువులు వస్తాయనుకుంటే మనిషి శవాన్ని పార్శిల్‌ల్లో పంపారు. కలకలం రేపిన ఈ సంఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో చోటు చేసుకుంది.

By :  Admin
Update: 2024-12-23 10:23 GMT

ఆంధ్రప్రదేశ్‌ పశ్చిమ గోదావరి జిల్లాలో శవం పార్శిల్‌ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. పార్శిల్‌ల్లో వచ్చిన శవం ఎవరిదనే దానిపై గత కొన్ని రోజులుగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ కేసును చాలెంజ్‌గా తీసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. నిగ్గు తేల్చేందుకు బృందాలుగా ఏర్పడి కూపీ లాగడంలో నిమగ్నమయ్యారు. ఎట్టకేలకు సోమవారానికి కొంత మేరకు కొలిక్కి తీసుకొచ్చారు. పూర్తి వివరాలు రాబట్టే ప్రయత్నంలో ఉన్న పోలీసులు పార్శిల్‌లో వచ్చిన ఆ శవం ఎవరిదనేది గుర్తించగలిగారు. కాళ్ల మండలంలోని గాంధీనగరానికి చెందిన బర్రె పర్లయ్యదిగా గుర్తించారు. అయితే పూర్తి వివరాల సేకరణ కోసం శవమై తేలిన బర్రె పర్లయ్య స్వగ్రామానికి పోలీసులు వెళ్లారు. విచారణ చేపట్టిన పోలీసులు పూర్తి వివరాలను రాబట్టే పనిలో నిమగ్నమయ్యారు.

పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం యండగండి గ్రామానికి చెందిన తులసి అనే మహిళ ఇంటికి గురువారం రాత్రి శవంతో కూడిన పార్శిల్‌ వచ్చింది. తాను నిర్మించుకుంటున్న ఇంటికి కరెంట్‌ సామాను సహాయం చేయాలని క్షత్రియ పరిషత్‌ను కోరింది. ఇది వరకు కూడా ఇంటి నిర్మాణానికి అవసరమైన వస్తువులను క్షత్రియ పరిషత్‌ సహాయం చేసింది. అదే క్రమంలో మరో సారి సహాయం చేయాలని తులసి అనే మహిళ కోరారు. ఈ నేపథ్యంలో గత గురువారం రాత్రి ఓ పార్శిల్‌ వచ్చింది. కరెంటు సామాను అనుకుని దానిని ఓపెన్‌ చేయగా శవం కనిపించింది. దీంతో తులసి కుటుంబ సభ్యులు ఒక్క సారిగా షాక్‌కు గురయ్యారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే పార్శిల్‌ వచ్చిందని తులసికి మెసేజ్‌ పంపిన వ్యక్తి కోసం ప్రస్తుతం పోలీసులు గాలిస్తున్నారు. ఇదే క్రకమంలో తులసి మరిది శ్రీధర్‌ వర్మపైన పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సంఘటన జరిగిన నాటి నుంచి అదృశ్యం కావడంతో పోలీసులు వ్యక్తం చేసిన అనుమానాలకు బలం చేకూరినటై్టంది. దీంతో అతని ఆచూకి కోసం గాలింపులు చేపట్టారు. హైదరాబాద్‌ వెళ్లిన పోలీసులు అక్కడ విచారణ సాగిస్తున్నారు. అక్రమ సంబంధాల కోణంలో కూడా పోలీసులు విచారణ చేపట్టారు. దీంతో పాటుగా పార్శిల్‌ పంపిన ఎర్రకారులోని మహిళ కోసం కూడా పోలీసులు తీవ్ర గాలింపులు చేపట్టారు.
Tags:    

Similar News