నాడు టీడీపీకి జరిగిందే.. నేడు వైసీపీకి జరిగింది

ఆంధ్రప్రదేశ్‌లో ఇంకా ఎన్నికల వాతావరణం వీడ లేదు. కొత్త ప్రభుత్వం కొలువు దీరి నెల రోజులు దాటినా ఎన్నికల ఫలితాలపైనే చర్చలు సాగుతున్నాయి.

Update: 2024-07-16 14:11 GMT

రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 2014లో తొలి సారి జరిగిన ఎన్నికల్లో కాకుండా 2019లో రెండో సారి, 2024లో మూడో సారి జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలు ఒకరి మీద ఒకరు పోటీలు పడి ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేసుకున్నాయి. 2019లో నాటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పని చేస్తున్నారని కొంత మంది అధికారులపై వైఎస్‌ఆర్‌సీపీ ఫిర్యాదులు చేయగా, 2024 ఎన్నికల సమయంలో జగన్‌ ప్రభుత్వం అధికారంలో ఉన్నందు వల్ల కొంత మంది అధికారులు వైఎస్‌ఆర్‌సీపీకి అనుకూలంగా పని చేస్తున్నారని టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేశారు. దీంతో 2019 ఎన్నికల సయమంలో నాడు అధికారులను బదిలీ చేసిన ఎలక్షన్‌ కమిషన్, ఇటీవల జరిగిన 2024 ఎన్నికల్లోను కొంత మంది అధికారులపైనా వేటు వేసింది. ఇలా వేటు వేయడం ఆ పార్టీలకు కలిసొచ్చిందనే టాక్‌ ఉంది.

చంద్రబాబు ప్రభుత్వానికి లాయల్‌గా ఉంటూ టీడీపీకి అనుకూలంగా పని చేస్తున్నారని, అవే పదవుల్లో వీరు కొనసాగితే ఎన్నికలు సజావుగా జరిగే అవకాశం లేదని 2019 ఎన్నికల సమయంలో ఎన్నికల సంఘానికి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నేతలు ఫిర్యాదులు చేశారు. నాటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు రాష్ట్ర డీపీజీ, ఇంటిలెజెన్స్‌ చీఫ్‌ను, కొన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలను బదిలీలు చేయాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. ఆ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న అనిల్‌ చంద్ర పునేటను మార్చేందుకు నిర్ణయం తీసుకుంది. ఆయనను తప్పిస్తూ ఎల్వీ సుబ్రహ్మణ్యంను ఆంధ్రప్రదేశ్‌ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరించారని, నాడు ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావును తొలగించాలని ఎన్నికల సంఘం డైరెక్షన్స్‌ ఇచ్చినా నాటి సీఎస్‌ పునేటా మిన్నకుండి పోయారని ఈ నేపథ్యంలోనే ఆయనపై ఎన్నికల సంఘం వేటు వేసిందనే టాక్‌ అప్పట్లో వినిపించాయి. సీఎస్‌గా ఉన్న పునేటాను మార్చడం అప్రజాస్వామికమని అప్పట్లో తెలుగుదేశం పార్టీ గగ్గోలు పెట్టింది. సీఎస్‌ పునేటా, డీజీపీ ఠాకూర్, ఇంటెలిజెన్స్‌ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు, ఇంటెలిజెన్స్‌ ఓఎస్‌డీ యోగానంద్, లా అండ్‌ ఆర్డర్‌ డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్, శ్రీకాకుళం, విజయనగరం, గుంటూరు, ప్రకాశం, చిత్తూరు, వంటి పలు జిల్లాల ఎస్పీలను కూడా మార్చాలని నాడు వైఎస్‌ఆర్‌సీపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేసింది.
ఇదే సీన్‌ 2024 ఎన్నికల్లో రిపీట్‌ అయింది. కూటమిగా ఏర్పడిన టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేశారు. జగన్‌ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని డీజీపీ రాజేంద్రనా«ద్‌రెడ్డితో పాటు ప్రభుత్వ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డిని, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా ఉన్న సీతారామాంజనేయులును, విజయవాడ పోలీసు కమిషనర్‌ కాంతిరాణా టాటాతో పాటు కొన్ని జిల్లాల ఎస్పీలు, కలెక్టర్లను బదిలీ చేయాలని కూటమి నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేశారు. దీంతో అటు ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత నెలకొన్న ఎన్నికల హింస నేపథ్యంలో డీజీపీ నుంచి ఎస్‌ఐ వరకు 29 మంది అధికారులను బదిలీ చేశారు.
2019 ఎన్నికల సమయంలో నాడు ఉన్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వ వ్యతిరేకత, రాజధాని అమరావతిని అభివృద్ది చేయక పోవడం, తాత్కాలిక భవనాలతో కాలం వెల్లబుచ్చడం, పోలవరం నిర్మాణం పూర్తి చేయక పోవడం, విభజన హామీలను నెరవేర్చకోవడంలో వైఫల్యం చెందడం, పసుపు కుంకుమతో నిధులు దుర్వినియోగం చేశారనే ఆరోపణలు రావడం వంటి పలు అంశాలు చంద్రబాబుకు వ్యతిరేకంగా మారడం, జగన్‌కు ఒక అవకాశం ఇద్దామనే ఆలోచనల్లో ఓటర్లు ఉండటంతో పాటు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం సపోర్టు జగన్‌మోహన్‌రెడ్డికి ఇవ్వడంతో ఎన్నికలు సజావుగా నిర్వహించుకునేందుకు వైఎస్‌ఆర్‌సీపీకి అవకాశం కలిసొచ్చిందని, దీంతో వైఎస్‌ఆర్‌సీపీ 2019లో ఘన విజయం సాధించిందే చర్చ అప్పట్లో జరిగింది. 2024లో ఇవే అంశాలు టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి అనుకూలంగా మారాయి. జగన్‌ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత రావడం, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చంద్రబాబు కూటమికి సహకరించడం ఇలా అనేక అంశాలు కలిసి రావడంతో 2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి విజయం సాధించిందనే చర్చ సాగుతోంది.
Tags:    

Similar News