అక్కినేని కుటుంబానికి అభిమానులు పెద్ద షాక్

ఇంతవరకు ఓకేనే కాని అసలైన వాళ్ళు ఎందుకు స్పందించలేదన్న విషయమే ఎవరికీ అర్ధంకావటంలేదు.

Update: 2024-10-05 10:35 GMT

ఇపుడీ విషయమే చాలామందిని ఆశ్చర్యంలోకి నెట్టేస్తోంది. మంత్రి కొండా సురేఖ ఆరోపణలు, వ్యాఖ్యల దెబ్బకు అక్కినేని నాగార్జున, అక్కినేని నాగచైతన్య ఇమేజి దారుణంగా డ్యామేజి అయిపోయిందన్నది వాస్తవం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో రాజకీయ వివాదాన్ని సెటిల్ చేసుకునే క్రమంలో సంబంధంలేని సమంత, నాగార్జున, చైతన్యను వివాదంలోకి లాగారు. సమంత-చైతన్య విడాకులకు కేటీఆరే కారణమని మాత్రమే కొండా ముందు చెప్పారు. వీళ్ళు విడాకులు తీసుకోవటానికి కేటీఆర్ ఏ విధంగా కారణమో మాత్రం మంత్రి చెప్పలేదు. అయితే సాయంత్రానికి ఏమైందో ఏమో మీడియా సమవేశం పెట్టిన మంత్రి రెచ్చిపోయారు.

ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చకుండా ఉండాలంటే సమంతను తన దగ్గరకు పంపమని నాగార్జునను కేటీఆర్ అడిగారని ఆరోపించారు. కేటీఆర్ అడిగిన విషయాన్ని సమంతతో నాగార్జున, చైతన్య చెప్పి కేటీఆర్ దగ్గరకు వెళ్ళమని ఒత్తిడి పెట్టినట్లు మంత్రి చెప్పారు. అందుకు సమంత నిరాకరించటంతోనే కుటుంబంలో గొడవలు మొదలై తమ మాట వినకపోతే బయటకు వెళిపోమని సమంతకు నాగార్జున, చైతన్య చెప్పారని మంత్రన్నారు. దాంతో ఇంట్లోనుండి బయటకు వచ్చేసిన సమంత తర్వాత విడాకులు తీసుకున్నట్లు చెప్పారు.

ఈ మొత్తంమీద తన క్యారెక్టర్ ను కాపాడుకోవటానికి సమంత ఇంట్లో పెద్ద యుద్ధమే చేసిందన్నట్లుగా మంత్రి వ్యాఖ్యలను బట్టి అర్ధమైంది. ఇదే సమయంలో తమ ఆస్తిని కాపాడుకోవటానికి సమంతను కేటీఆర్ దగ్గరకు పంపటానికి నాగార్జున, చైతన్య సిద్ధపడ్డారన్న విషయం కూడా కొండా ఆరోపణల్లో జనాలకు అర్ధమైంది. మంత్రి ఆరోపణలను జాగ్రత్తగా గమనిస్తే బాగా డ్యామేజి అయ్యింది తండ్రి, కొడుకులు నాగార్జున, చైతన్యలు మాత్రమే. అందుకనే నాగార్జున కొండా సురేఖ మీద పరువునష్టం దావా వేయటంతో పాటు క్రిమినల్ కేసు కూడా దాఖలు చేశారు. అలాగే రు. 100 కోట్లకు పరువునష్టం దావా వేయబోతున్నారు.

అక్కినేని ఫ్యామిలీ మీద మంత్రి చేసిన దారుణమైన వ్యాఖ్యలు, ఆరోపణలకు సినీ ఇండస్ట్రీలోని చాలామంది ప్రముఖులు స్పందించారు. ఇంతవరకు ఓకేనే కాని అసలైన వాళ్ళు ఎందుకు స్పందించలేదన్న విషయమే ఎవరికీ అర్ధంకావటంలేదు. అసలైన వాళ్ళంటే వీరాభిమానులని అర్ధం. నాగార్జున, చైతన్య, అఖిల్ సినిమాలు రిలీజ్ అయ్యేటప్పుడు చొక్కలు చింపుకుని సినిమా థియేటర్ల దగ్గర నానా గోల చేసేది అభిమానులే అని అందరికీ తెలుసు. తమ అభిమాన నటులను మంత్రి దారుణంగా అవమానిస్తే అభిమాన సంఘాల నుండి ఒక్కటంటే ఒక్క ఖండన కూడా కనబడలేదు. అభిమానులు కనీసం నిరసన కూడా తెలపకపోవటమే ఆశ్చర్యమేసింది. కుటుంబానికి లక్షల్లో అభిమానులున్నా, వందల్లో అభిమానసంఘాలున్నా తాజా వివాదాన్ని ఎవరూ పట్టించుకోలేదు.

తమ అభిమానమంతా సినిమాలు చూడటం వరకే కాని వ్యక్తిగత, కుటుంబ విషయాలతో తమకు సంబంధంలేదని అభిమానసంఘాలు లేదా అభిమానులు డిసైడ్ అయ్యారా ? నిజంగానే ఇలా డిసైడ్ అయితే సంతోషించాల్సిన విషయమే. ఎందుకంటే విలువైన కాలాన్ని, జీవితాలను అభిమాన నటుల కోసం దారపోయటం వృధా అని, లేదా అభిమాన నటుల కోసం తాము రోడ్డున పడి ఇతరులతో కొట్టుకోవటం అవసరంలేదని భావిస్తే అంతకుమించిన సంతోషం ఏముంటుంది ? అభిమానమంతా 200 రూపాయలు పెట్టి టికెట్ కొని సినిమా చూడటం వరకే పరిమితం చేసుకుంటే చాలా సంతోషించాల్సిన విషయమే. బహుశా ఈ ఆలోచనతోనేనా అక్కినేని కుటుంబంమీద టన్నుల కొద్ది బురదపడినా అబిమాన సంఘాలు, అభిమానులు తమకేమీ పట్టనట్లున్నది ?

Tags:    

Similar News