ఏపీలో కూటమి ప్రభుత్వ అరాచకాలను పార్లమెంట్లో ప్రస్తావిస్తాం
పార్లమెంట్ సమావేశాల్లో ఏ అంశాలపైన ప్రస్తావన చేయాలి, ఏ అంశాలపైన ఆందోళనలు చేపట్టాలనే దానిపై వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీలకు నిర్థేశం చేసిన జగన్.
ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వ అరాచకాలను పార్లమెంట్‌లో ప్రస్తావిస్తామని వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ సుభాష్ చంద్రబోస్ తెలిపారు. సోషల్ మీడియా కార్యకర్తల అక్రమ అరెస్టులు, నిర్భంధాలపైన పార్లమెంట్‌లో ప్రస్తావన చేస్తామని, కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్ని అంశాలను పార్లమెంట్‌లో లేవనెత్తేందుకు ప్రయత్నిస్తామన్నారు. 41–ఏ నోటీసులు ఇవ్వకుండా అరెస్టులు చేయడంపైన కూడా పార్లమెంట్‌లో గట్టిగా నిలదీస్తామన్నారు. ఈ నెల 25 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీలతో ఆ పార్టీ అధ్యక్షులు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి çగురువారం తాడేపల్లిలోని వైఎస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సమావేశం అయ్యారు. పార్లమెంట్ సమావేశాల్లో రాష్ట్ర సమస్యలపై ఎలా వ్యవహరించాలనే దానిపైన చర్చించారు.
అనంతరం ఎంపీ సుభాష్ చంద్రబోస్ మీడియాతో మాట్లాడుతూ పోలవరం ఎత్తును తగ్గించాలనే కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని, దీనిపై పార్లమెంట్‌లో ఆందోళనలు చేపడుతామని అన్నారు. పోలవరం నిర్వాసితులకు ఇవ్వాల్సిన ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ నిధులపైన ఆందోళనలు చేపడుతామని, వెంటనే ఈ నిధులు విడుదల చేయమని డిమాండ్ చేస్తామన్నారు. విశాఖ స్టీల్ ప్రైవేటీకర్‌కు వ్యతిరేకంఆ పోరాటం చేస్తామన్నారు. ప్రభుత్వ ఆధీనంలోనే విశాఖ స్టీల్‌ను నడిపాలనే నినాదంతో పార్లమెంట్‌లోను, ఢిల్లీలోను ధర్నాలు చేస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు రావలసిన ప్రత్యేక హోదా కూడా ఆందోళనలు చేస్తామన్నారు. వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని, ఎట్టి పరిస్థితుల్లో దీనిని ఆమోదించేది లేదని, ఆ బిల్లు రాజ్యాంగ విరుద్దమన్నారు. ఒక వేళ బలముందని ఈ బిల్లును పార్లమెంట్‌లో పాస్ చేస్తే న్యాయ పోరాటం చేస్తామన్నారు.