వస్తోందీ నందికొండ నాగార్జున సాగర్!
రిజర్వాయర్ వద్ద 20 గేట్లు ఎత్తివేయడంతో సాగర్ కనువిందు చేస్తోంది.;
By : The Federal
Update: 2025-07-29 11:36 GMT
నాగార్జున సాగర్ రిజర్వాయర్ చాలా కాలం తర్వాత నిండుకుండలా మారింది. దీంతో సందర్శకుల తాకిడి పెరిగింది. రిజర్వాయర్ వద్ద 20 గేట్లు ఎత్తివేయడంతో సాగర్ కనువిందు చేస్తోంది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 590.00(312.04 టీఎంసీలకు) అడుగులకుగాను ప్రస్తుతం 586.60 (312.04 టీఎంసీలకు) అడుగులకు చేరింది. ఇన్‌ఫ్లో 2,01,743 క్యూసెక్కులుగా ఉంది. ఔట్ ఫ్లో 41,822 క్యూసెక్కులుగా నమోదైంది.
రేడియల్ క్రస్టు గేట్లు ఇవాళ ఉదయం ఎత్తారు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు దిగువ భాగంలో ఉన్న ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ప్రజలెవరూ నదిలోకి వెళ్లవద్దని సూచించారు.
ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు భారీ వరద కొనసాగుతోందని పేర్కొన్నారు. ఎగువ నుంచి వస్తున్న భారీ వరద ప్రవాహంతో నాగార్జునసాగర్ జలాశయం (Nagarjuna sagar) నిండుకుండలా మారింది. దీంతో ప్రాజెక్టు 20 క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టు గేట్లు ఎత్తిన నేపథ్యంలో.. దిగువ భాగంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. 18 ఏళ్ల తర్వాత.. నెల ముందుగానే నాగార్జున సాగర్ నుంచి నీటిని విడుదల చేయడం ఇదే తొలిసారి.