ఏపీలో బలపడుతున్న విశ్వహిందూ పరిషత్

ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత ఎప్పుడూ లేని విధంగా ‘హైందవ శంఖారావం’ భారీ సభ జరిగింది. ఈ సభ సక్సెస్ కావడానికి ఆంధ్ర పాలకులేననే చర్చ తీవ్రంగా జరుగుతోంది.;

Update: 2025-01-06 10:05 GMT

విశ్వహిందూ పరిషత్ శంఖం పూరించింది. తెలుగు రాష్ట్రాల్లో హిందూత్వ నినాదం మారు మ్రోగింది. కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లిలోని ఒక స్కూలు ఆవరణలో ఏర్పాటు చేసిన సభకు సమారు 3లక్షల మంది హిందూత్వ వాదులు హాజరయ్యారు. ఈ సభకు పార్టీలకు సంబంధం లేకుండా వచ్చారు. అన్ని పార్టీల్లో పనిచేస్తున్న కార్యకర్తలు, అభిమానులు ఉన్నారు. శంఖారావ సభకు విశ్వహిందూ పరిషత్ జాతీయ అధ్యక్షుడు అలోక్ కుమార్, ఉపాధ్యక్షుడు గోకరాజు గంగరాజు, కొండవీటి జ్యోతిర్మయి వంటి నేతలు హాజరయ్యారు. వీరితో పాటు పలు పీఠాలకు చెందిన పీఠాధిపతులు, గొప్ప దేవాలయాలుగా భావిస్తున్న కమిటీల నేతలు ‘హైందవ శంఖారావ’ సభలో పాల్గొని మాట్లాడారు. ఆలయాల పరిరక్షణ, హిందూ ధర్మ పరిరక్షణ ప్రధాన ఎజెండాగా సభ జరిగింది.

ఆలయాలపై ప్రభుత్వ అజమాయిషీ ఉండకూడదట..

ఆలయాలపై ప్రభుత్వ అజమాయిషీ ఉండకూడదు. ఆలయాలకు వచ్చే ఆదాయం కొత్త ఆలయాల నిర్మాణం, పూజారుల జీతాలు వంటి వాటికి మాత్రమే ఖర్చు పెట్టాలి. పూజారులకు రిటైర్డ్ మెంట్ అంటూ ఉండకూడదు. బదిలీలు ఉండ కూడదు. జీవిత కాలం అక్కడే పనిచేయాలని వక్తలు సభలో ఉద్ఘాటించారు. అయోద్యలోని రామాలయంపై ప్రభుత్వ అజమాయిషీ లేదు. మందిర నిర్వహణ, పూజా విధానాలు, ఉత్సవాల నిర్వహణ, అర్చకుల ఎంపిక, అన్నీ పారదర్శకంగా జరుగుతున్నాయి. ఎక్కడా ప్రభుత్వ జోక్యం లేదు. అందుకే విశ్వ సాంస్కృతిక కేంద్రంగా అయోధ్య వెలుగొందుతోందని అయోధ్య రామాలయ తీర్థ క్షేత్ర ట్రస్ట్ కోశాధికారి గోవింద దేవగిరి స్వామీజీ అన్నారు.

బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఎందుకు రద్దు చేయలేదు

దేశంలోని బీజేపీ పాలిత రాష్టాల్లో దేవదాయ, ధర్మదాయ శాఖ చట్టాలు అమలులో ఉన్నాయి. ఈ చట్టాల ద్వారానే పాలన సాగుతోంది. కేంద్రంలో హిందూత్వ అనుకూల ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 ఏళ్లు దాటింది. అయినా అవే చట్టాలు అమలు జరుగుతున్నాయి. అంటే లౌకిక రాజ్యాంగాన్ని గౌరవించడం వల్లనేననేది ఎవరికైనా అర్థమవుతుంది. ఏపీలో చీఫ్ సెక్రటరీగా పనిచేసిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎల్వీ సుబ్రమణ్యం మాట్లాడుతూ దేవదాయ, ధర్మదాయ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ లో ఆయన చీఫ్ సెక్రటరీగా పనిచేశారు. ఆయన ఆలోచనను పాలకుల వద్ద ఉంచి రద్దు చేయించ వచ్చు. అందువల్ల సాధ్యా సాధ్యాలను తెలుసుకుని మాట్లాడాలనే విమర్శలు పలువురు హేతు వాదుల నుంచి వ్యక్తమవుతున్నాయి.

Delete Edit

ఆరు నెలలుగా ప్లాన్

ఏపీలో ఎన్డీఏ పాలన రాగానే హిందూత్వ సభ నిర్వహించాలనే ఆలోచనకు విశ్వహిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్ లు వచ్చాయి. ఇందుకు బీజేపీ కూడా తన సహకారాన్ని అందించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో జనాన్ని సమీకరించి ఏపీలో సభ నిర్వహిస్తే ఎటువంటి ఆటంకాలు లేకుండా సభ సాగుతుందని భావించింది. ఇందులో భాగంగా 2024 డిసెంబరులో విజయవాడ నగరంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ మధుకర్ రావ్ భగవత్ (Mohan Madhukar Rao Bhagwat) మూడు ప్రాంతాల్లో ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. ఒక్కో సమావేశానికి సుమారు 3వేల మంది హాజరయ్యారు. ఈ విషయాలన్నీ ఇంటెలిజెన్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉంది. ఇక్కడ సభ నిర్వహించడానికి కూడా పరోక్షంగా ఏపీ ప్రభుత్వం సహకరించింది. దీంతో సభా కార్యక్రమాలు సజావుగా సాగాయి. హిందూత్వ వ్యతిరేకులను టార్గెట్ చేస్తూ శంఖారావం జరిగింది.

సినిమాల కథలు కల్పితాలని తెలియదా?

హిందూత్వానికి కళంకం తెచ్చే విధంగా సినిమాలు తీస్తున్నారని సినీగేయ రచయిత అనంత శ్రీరామ్ వ్యాఖ్యానించడం కూడా చర్చనియాంశమైంది. సినిమాలనేవి కేవలం కల్పిత కథలతో సాగేవి. ప్రజలను ఎంటర్టైన్ చేసేవి కొన్నైతే, ఆలోచింప జేసేవి కొన్ని. అయితే పురాణాల్లో ఉన్న కథలనే సినిమాలుగా తీయాలనే డిమాండ్ కూడా సరైంది కాదనే వాదన ఉంది. కల్కి సినిమా గురించి వ్యాఖ్యానించిన శ్రీరామ్ వ్యాఖ్యానిస్తూ కర్నుడి పాత్రకు గొప్పతనాన్ని ఆపాదించారని, అందుకు సిగ్గుపడుతున్నానన్న వ్యాఖ్యానించడం కూడా చర్చకు దారితీసింది. పురాణ కథలను మార్చకుండా సినిమాలు తీయాలనే డిమాండ్ వచ్చిందంటే కల్పిత కథలు అసలు వద్దనే డిమాండ్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అన్నీ జరిగిన కథలు మాత్రమే సినిమాలుగా రూపొందాలనే ఆలోచన ఇకపై రచయితలు చేయాల్సి ఉంటుంది.

Delete Edit

కార్యాచరణపై డిక్లరేషన్

దేశ వ్యప్తంగా అన్ని వర్గాలను ఏకం చేయాలి. అది హిందూత్వ వాదులుగా మారేందుకు జరిగే ఏకమని గుర్తించాలంటూ హైందవ శంఖారావ సభలో డిక్లరేషన్ ప్రకటించారు. స్థానికంగా ఉండే విహెచ్ పి కార్యకర్తలు హిందూ ధర్మ పరిరక్షణలో భాగస్వాములు కావాలంటే ఇది తప్పదని ప్రకటించారు. ఈ డిక్లరేషన్ స్పూర్తి ప్రతి ఒక్కరిలో నింపాలని చినజీయర్ స్వామి సభకు వచ్చిన వారితో ప్రతిజ్ఞ చేయించారు. ఆలయాల నిర్వహణపై ప్రభుత్వ పెత్తనం ఏమిటని ప్రశ్నిస్తూ మనకు చేత కాదా? అంటూ భక్తులను రెచ్చగొట్టే ఉపన్యాసం చేశారనే విమర్శలు వెల్లువెత్తాయి.

ఎరుపు, కాషాయరంగు

సభా వేదిక ఎరుపు, కాషాయ రంగు వస్త్రాలతో నిండిపోయింది. ఎంతో మంది పీఠాధిపతులు రావడంతో వారితో వచ్చేవారంతా ఈ రకమైన వస్త్రాలు ధరించి వచ్చారు. సభకు హాజరైన బీజేపీ నాయకులు మాత్రం రాజకీయ రంగులు మాత్రమే ధరించారు. హిందూత్వం నా సర్వస్వం అన్న ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ను హైందవ శంఖారావం సభకు ఎందుకు పిలవ లేదనే చర్చ కూడా భారీగా జరిగింది. ఒక వేళ పిలిచినా సభకు వెళ్లలేదా అనే చర్చ కూడా సాగుతోంది. ఇటీవల తిరుపతి లడ్డు వ్యవహారంలో ప్రాయశ్చిత్త దీక్ష బూని హిందూత్వ, సనాతన ధర్మ పరిరక్షణ కోసం దేనికైనా సిద్ధమని ప్రకటించిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News