రాజకీయ పార్టీలలో ఇదే తొలి నామినేషన్
కూటమి తరపున తొలి నామినేషన్ దాఖలైంది. టీడీపీ నేత వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తన నామినేషన్‌ను కోవూరులో దాఖలు చేశారు.
ఆంధ్రలో ఎక్కడ చూసినా ఈరోజు ఎన్నికల నామినేషన్ల హడావుడి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి తరపున వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తొలి నామినేషన్ దాఖలు చేశారు. దీంతో ఆంధ్రలో కూటమి తొలి అడుగు విజయవంతంగా పడినట్లయింది. కోవూరు సీటులో కూటమి అభ్యర్థిగా ఆమె పోటీ చేయనున్నారు. టీడీపీ నేత ప్రశాంతి.. ఈరోజు రెండు సెట్ల నామినేషన్‌లు దాఖలు చేశారు. ఆమె నామినేషన్ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు. నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు.
‘‘నా విజయం.. కొవూరు అభివృద్ధి ఖాయం’’అని స్పష్టం చేశారామే. రానున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు వేసి టీడీపీని గెలిపించాలని ఓటర్లను కోరారు. ‘‘చంద్రబాబు మరోసారి ఆంధ్ర సీఎం అయిపోయారు. రానున్న ఎన్నికల్లో కూటమి అనూహ్య విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయం. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో సైకిల్ హవా కనిపిస్తోంది. ఎన్‌డీఏ కూటమిలో ఉండటం వల్ల రాష్ట్ర అభివృద్ధి సులువు అవుతుంది’’అని ఆమె వ్యాఖ్యానించారు.