విజయనగరం జిల్లాలో మూడు రోజులు సెలవులు..ఎవరికంటే

జిల్లా వ్యాప్తంగా కంట్రోల్ రూమ్ లను కూడా ఏర్పాటు చేసి హెల్ప్ లైన్ నంబర్లు అందుబాటులోకి తెచ్చారు.

Update: 2025-10-27 04:33 GMT

మొoథా తుఫాన్ నేపథ్యంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున విజయనగరం జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లాలోని లోని అంగన్వాడీ కేంద్రాల తో పాటు ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ విద్యాసంస్థలకు నేటి నుండి అంటే సోమవారం నుండి మూడు రోజులపాటు జిల్లా కలెక్టర్ ఎస్ రామ సుందర్ రెడ్డి సెలవు ప్రకటించారు. జిల్లా వ్యాప్తంగా కంట్రోల్ రూమ్ లను కూడా ఏర్పాటు చేశారు. హెల్ప్ లైన్ నంబర్లు కూడా అందుబాటులోకి తెచ్చారు. 

విజయనగరం తుపాన్ కంట్రోల్ రూముల వివరాలు

కలెక్టర్ ఆఫీస్ : 08922-236947, 8523876706,
రెవెన్యూ డివిజినల్ ఆఫీస్, విజయనగరం 8885893515,
రెవెన్యూ డివిజనల్ ఆఫీస్ చీపురుపల్లి 9704995807.
రెవెన్యూ డివిజనల్ ఆఫీస్ బొబ్బిలి 9989369511.
మున్సిపల్ కార్పొరేషన్ విజయనగరం 9849906486
ఏపీ ఈపీడీసీఎల్ 9490610102
టోల్ ఫ్రీ నెంబర్ 1912.
ఈ నంబర్లుకు ఫోన్ చేసి సమచారంతో పాటు ప్రభుత్వం నుంచి సాయం కూడా పొందొచ్చని కలెక్టర్ సుందర్ రెడ్డి తెలిపారు. 


Tags:    

Similar News