Tirumala || ఏపీ, తెలంగాణ నేతల సిఫార్సు లేఖల పునరుద్ధరణకు తాత్కాలిక నిర్ణయం: టిటిడి
ఈ నెల 15వ తేదీ నుండి సిఫార్సు లేఖలకు టిటిడి అనుమతి;
By : Dinesh Gunakala
Update: 2025-05-13 14:05 GMT
తిరుమల శ్రీవారి దర్శనార్థం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల సిఫార్సు లేఖల పునరుద్ధరణకు మాత్రమే తాత్కాలికంగా టిటిడి నిర్ణయం తీసుకుంది.
ఈ నెల 15వ తేదీ నుండి సదరు నేతల సిఫార్సు లేఖలను మాత్రమే టిటిడి అనుమతించనుంది. అయితే మిగిలిన వారి సిఫార్సు లేఖల పై అంతకు ముందు తీసుకున్న నిర్ణయం కొనసాగుతుంది . నియమావళి ప్రకారం అనుమతి పొందిన భక్తులకు ఈ నెల 16వ తేదీ నుండి శ్రీవారి దర్శనం కల్పించనున్నారు.