బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై రేపు టీటీడీ బోర్డు మీట్..
తిరుమలలో టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు అధ్యక్షతన పాలక మండలి భేటీ.;
Byline : SSV Bhaskar Rao
Update: 2025-09-15 14:35 GMT
శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఈ నెల 23వ తేదీ నుంచి అక్టోబర్ రెండో తేదీ వరకు జరగనున్నాయి. ఉత్సవాల ప్రారంభానికి ఇక వారం రోజులు మాత్రమే గడువు ఉంది. దీంతో తిరుమలలో శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ నెల టీటీడీ పాలక మండలి సమావేశం మంగళవారం మధ్యాహ్నం రెండు గంటలకు తిరుమల అన్నమయ్య భవన్ లో నిర్వహించనున్నారు. టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ప్రధానంగా శ్రీవారి బ్రహ్మెత్సవాలపైనే చర్చించే అవకాశం ఉంది. ఇందులో భద్రతా ఏర్పాట్లతో పాటు యాత్రికుల సదుపాయాలపై సమీక్షించనున్నారు.
టీటీడీ పాలక మండలి సమావేశం ఈ నెల పదో తేదీ నిర్వహించాలి. అనంతపురంలో సూపర్ 6 సూపర్ సక్సెస్ కార్యక్రమం వల్ల వాయిదా పడింది. అంతేకాకుండా, అంతకుముందు రోజే ఈఓగా ఉన్న జే. శ్యామలరావు కూడా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో బాధ్యతలు స్వీకరించిన అనిల్ కుమార్ సింఘాల్ అధికారులు, సిబ్బంది మధ్య సమన్యం సాధించే దిశా బాధ్యతలు చేపట్టిన రోజు నుంచే సమీక్షలు ప్రారంభించారు. తనిఖీలు కూడా సాగిస్తున్నారు. ఇదిలాఉండగా,
రేపటి బోర్డు మీటింగ్ లో...
బ్రహ్మెత్సవాలు సమీపించిన నేపథ్యంలో మంగళవారం నిర్వహించనున్న టీటీడీ పాలక మండలి సమావేశంలో ప్రధానంగా ఏర్పాట్లపై సమీక్షించే అవకాశం ఉంది. తిరుమల అన్నమయ్య భవన్ లో మధ్యాహ్నం రెండు గంటలకు బీఆర్. నాయుడు అధ్యక్షతన సమావేశం జరగనున్నద. ఇందులో బ్రహ్మోత్సవాల ప్రారంభం రోజు ఈ నెల 24వ తేదీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సీఎం నారా చంద్రబాబు శ్రీవారికి పట్టువస్త్రాు సమర్పించనున్నారు. ఈ అంశంలో భద్రతా ఏర్పాట్లతో పాటు యాత్రికులకు కల్పించాల్సిన వసతులు, సదుపాయాలు, అన్నప్రసాదాలు, క్యూల నిర్వహణ, పార్కింగ్ స్థలాలు వంటి అంశాలపై టీటీడీ విజిలెన్స్, పోలీస్ అధికారులు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించే అవకాశం ఉంది.