సింహాచలం గుడిలో విషాదం – గోడ కూలి 8 మంది మృతి

అప్పన్న స్వామి చందనోత్సవంలో విషాదం;

Update: 2025-04-30 01:41 GMT

విశాఖపట్నం జిల్లా సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామి దేవస్థానంలో చందనోత్సవం సందర్భంగా  ప్రమాదం చోటుచేసుకుంది . ఆలయ ప్రాంగణంలో రూ. 300 టికెట్ కౌంటర్ దగ్గిర ఒక సిమెంట్ గోడ కూలిపోవడంతో ఎనిమిది మంది భక్తులు మృతిచెందారు.  బుధవారం తెల్లవారు జామున కురిసిన భారీ వర్షాలకు మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. మరొక పది మందికి గాయాలయ్యాయి. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో మృతి కారణమయింది. దురృష్టమేమిటంటే, ఇరవై అడుగుల పొడవున్న ఈ గోడని కేవలం మూడు వారాల కిందటే నిర్మించారు.

స్వామివారి నిజరూప దర్శనానికి  భక్తులు గోడ దగ్గిర ఉన్నపుడు ఈ ప్రమాదం జరిగింది.  ఇప్పటివరకు ఆరు మృతదేహాలు వెలికి తీశారు. శిథిలాల కింద మరో రెండు మృతదేహాలు ఉన్నట్లు సమాచారం.




ప్రమాద స్థలానికి వెంటనే చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, అధికారులు సహాయక చర్యలు ప్రారంభించాయి. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించారు. మరింత సమాచారం కోసం అధికారులు పరిశీలన కొనసాగిస్తున్నారు

చందనోత్సవం అంటే...

సింహాద్రి అప్పన్నకు అక్షయ తృతీయ రోజున జరిగే చందనోత్సవం చాలా విశిష్టమైనది. సింహాచలంలో ఏడాదిలో కేవలం 12 గంటలు మాత్రమే భక్తులు స్వామిని నిజరూపంలో దర్శనం  చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఈ ఉత్సవంలో భాగంగా స్వామి విగ్రహంపై ఉన్న చందనాన్ని తొలగించి 12 గంటల పాటు భక్తులకు స్వామి నిజరూప దర్శనం  కల్పిస్తారు.

చందనోత్సవంలో స్వామివారికి చందనపు పూతను పూసేందుకు అవసరమయ్యే గంధపు చెక్కలని తమిళనాడు నుంచి తెప్పిస్తారు. జాజిపోకల అనే మేలు రకం గంధాన్నిఉత్సవంలో వినియోగిస్తారు.  ప్రత్యేకమైన పూజలని నిర్వహించి, గంధపు చెక్కల నుంచి ఈ    చెక్కల నుంచి  గంధాన్ని తీస్తారు. అక్షయ తృతీయ ముందు రోజు అర్థరాత్రి నుంచే స్వామివారి మీద ఉన్న చందనాన్ని తొలగిస్తారు. చందనాన్ని పూర్తిగా తొలగించిన తర్వాత అక్షయతృతీయ తెల్లవారుజాము నుంచి స్వామివారి  దర్శనానికి భక్తులను అనుమతిస్తారు. ఇదే నిజరూప దర్శనం. చందనోత్సవాన్ని తిలకించేందుకు వేలాది మంది భక్తులు తరలి వస్తారు. ఈ దర్శనానికి జనం  తరలివస్తున్నపుడు గోడకూలి ప్రమాదం జరిగింది.

అక్షయతృతీయ రాత్రి వరకూ భక్తుల దర్శనం సాగిన తర్వాత స్వామివారి అభిషేకం మొదలవుతుంది. ముందుగా సింహాచలం కొండ మీదున్న గంగధార నుంచి వెయ్యి కలశాలతో ‘సహస్ర ఘటాభిషేకాన్ని’ నిర్వహిస్తారు.


Tags:    

Similar News