సీఎం సొంతూరు నారావారిపల్లెలో విషాదం

సీఎం తమ్మడు రామ్మూర్తి ఇక లేరు. దీంతో సొంతూరులో విషాదం అలుముకుంది. సీఎం రాక నేపథ్యంలో భద్రతా చర్యలు ఏర్పాటు చేస్తున్నారు.

Update: 2024-11-16 09:02 GMT

సీఎం చంద్రబాబు తమ్ముడు, మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తినాయుడు తుదిశ్వాస విడిచారని సమాచారం అందింది. దీంతో సొంత ఊరు నారావారిపల్లెలో విషాదఛాయలు అలముకున్నాయి. అనారోగ్యంతో చికిత్స పొందుతూ హైదరాబాదులో తుదిశ్వాస విడిచిన మాజీ ఎమ్మెల్యే నారా రామమూర్తి నాయుడు భౌతికకాయాన్ని శనివారం సాయంత్రానికి నారావారిపల్లెకు తీసుకురానున్నారని తెలుస్తోంది. తల్లి అమ్మణమ్మ, తండ్రి ఖర్జూర నాయుడు సమాధుల పక్కనే రామ్మూర్తి నాయుడు భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు నారావారిపల్లె నుంచి అందిన సమాచారం. ఈ పల్లెలో వారికి బంధువులే వారికి ఎక్కువగా ఉన్నారు. సమీప గ్రామాల ప్రజలతో నారా రామమూర్తినాయుడు దగ్గరగా మెలిగే వారిని చెబుతారు. అయన మరణంతో టీడీపీ అభిమానులు, ఆయన సన్నిహితులు విషాదానికి గురయ్యారు.

సాయంత్రం సీఎం రాక

సొంతూరు నారావారిపల్లెకు సీఎం చంద్రబాబు కుటుంబసభ్యులతో కలిసి నారావారిపల్లెకు చేరుకుంటారని అధికారవర్గాల సమాచారం. అనారోగ్యంతో తుదిశ్వాస విడిచిన రామ్మూర్తినాయుడు భౌతిక కాయానికి నారావారిపల్లెలోనే అంత్యక్రియలు నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు తన భార్య నారా భువనేశ్వరి, కొడుకు నారా లోకేష్ కూడా హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సీఎం ఎన్ చంద్రబాబు రాక నేపథ్యంలో జిల్లా అధికారులు భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.
తిరుపతి ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు, అదనపు ఎస్పీ రవిమనోహరాచారి, డీఎస్పీ వెంకటనారాయణ నారావారిపల్లెకు చేరుకున్నారు. చంద్రగిరి పోలీసులతో పాటు, సీఐలు, ఎస్ఐలు భారీగా పోలీసు సిబ్బంది అక్కడ మోహరించారు. ప్రజలు, బంధువుల రామ్మూర్తి భౌతికకాయం సందర్శించి, నివాళులు అర్పించడంతో పాటు, సీఎం చంద్రబాబు నివాసం వద్ద భద్రతా చర్యలను ఎస్పీ సుబ్బారాయుడు పర్యవేక్షిస్తున్నారు. ఇదిలావుండగా టీడీపీ నేతలు, బంధువులు పెద్ద సంఖ్యలో నారావారిపల్లెలోని సీఎం  చంద్రబాబు నివాసానికి చేరుకుంటున్నారు. దీంతో ఇక్కడ ఎలాంటి ఇబ్బందికర పరిస్థితి లేకుండా, పోలీసులు ముందుజాగ్రత్తలు తీసుకుంటున్నారు. 

ఢిల్లీ పర్యటన రద్దు..
నారా రామ్మూర్తి నాయుడుహైదరాబాదులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. తమ్ముడు మరణించారనే సమాచారం అందుకున్న సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన అర్ధంతరంగా రద్దు చేసుకుని హైదరాబాద్ చేరుకున్నారు. బాబాయ్ మరణవార్త తెలియడంతో అమరావతిలో తన కార్యక్రమాలను రద్దు చేసుకున్న మంత్రి నారా లోకేష్ కూడా హైదరాబాద్ వెళ్లారు.
టీడీపీలో క్రియాశీలంగా ఉంటూ...
చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గ నారావారిపల్లెకు చెందిన సీఎం చంద్రబాబు తమ్ముడు నారా రామమూర్తి నాయుడు కూడా కొంతకాలం టీడీపీ రాజకీయాల్లో కొంతకాలం క్రియాశీలకంగా వ్యవహరించారు. ఒకసారి ఎమ్మెల్యేగా కూడా ఆయన గెలిచారు. చంద్రగిరి నియోజకవర్గ నుంచి రామ్మూర్తి నాయుడు 1994లో టీడీపీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1999 వరకు ఆయన ఆ పదవిలో ఉన్నారు. నారా రామ్మూర్తి నాయుడు కొడుకు నారా రోహిత్ తెలుగు చలనచిత్ర రంగంలో ప్రముఖ నటుడుగా గుర్తింపు పొందారు. రాజకీయాలకు దూరంగా ఉంటున్న నారా రోహిత్ సినీపరిశ్రమలో హీరోగా అనేక సినిమాలు చేశారు. మినహా తండ్రి రామ్మూర్తి నాయుడు, పెదనాన్న, సీఎం చంద్రబాబు రాజకీయ ప్రభావం నారా రోహిత్ పై కనిపించలేదని చెప్పవచ్చు. ఈ వ్యవహారాలకు దూరంగా ఉంటూ, తన సినీ రాజకీయ కెరీర్ పైన దృష్టి సారించారు.
Tags:    

Similar News