ఆంధ్రాలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోవడం బాధాకరం

వెంటనే జోక్యం చేసుకోవాలని ప్రభుత్వానికి తిరుపతి మేయర్ డా. శిరీష విజ్ఞప్తి;

Update: 2025-04-08 17:20 GMT
తిరుపతి నగర మేయర్ డాక్టర్ శిరీష.

సోమవారం  నుంచి పేదల ప్రాణాలకు సంజీవిని లాంటి ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ (ఆశా) ప్రకటించింది. ఈ పరిస్థితి రావడం ఆందోళనకలిగిస్తుంది.

వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకుని ఆరోగ్యశ్రీ సేవలను యదాతదంగా కొనసాగేలా చూడాలి.
ఆరోగ్యశ్రీ పథకం దూరదృష్టి తో తీసుకున్న విప్లవాత్మక నిర్ణయం.
ఆరోగ్యశ్రీ ని మిగిలిన పథకాలులాగా చూడకూడదు. 2004 వరకు ఉమ్మడి రాష్ట్రంలో కరువు పరిస్థితుల నేపధ్యంలో పేదలు ముఖ్యంగా రైతులు ఆత్మహత్యలు ఆందోళన కలిగించే విధంగా ఉండేవి. 2004 లో అధికారంలోకి వచ్చిన వై.యస్.రాజశేఖర్ రెడ్డి  సమస్య మూలాల్లోకి వెళ్లడం కోసం ప్రొఫెసర్ జయతి ఘోష్ కమిషన్ ఏర్పాటు చేశారు. రైతుల ఆత్మహత్యలకు కారణం వ్యవసాయ సమస్యలు మాత్రమే కాదని విద్యా, వైద్యం పేదలు, రైతులు భరించే స్థితిలో లేకపోవడం ఓ ముఖ్యమైన కారణంగా గుర్తించి ఆ ఖర్చులను ప్రభుత్వం భరించే ఏర్పాట్లు చేయాలని సిఫార్సు చేసారు. ప్రజల ఆత్మహత్యల నివారణకు పరిష్కారం గా రూపొందించే క్రమంలో ఏర్పాటు చేసిందే ఆరోగ్యశ్రీ పథకం.

తిరుపతి నగర మేయర్ డాక్టర్ శిరీష

బకాయిల చెల్లింపును రాజకీయ కోణంలో చూడకూడదు.
ప్రభుత్యం అన్నది నిరంతర ప్రక్రియ. నెట్ వర్క్ ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేయాలని నిర్ణయం తీసుకోవడానికి కారణం దాదాపు 3500 కోట్ల బకాయిలు ప్రభుత్వం చెల్లించకపోవడం ఫలితంగా ఆసుపత్రులను నడపలేని విధిలేని పరిస్థితుల్లో సేవలను నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం యాజమాన్యం తో చర్చించి సేవలను పునరుద్ధరించే ప్రయత్నం చేయాలి తప్ప గత ప్రభుత్వం మీద నెట్టి తప్పించుకునే ప్రయత్నం చేయడం సరికాదు.ఆశా సంస్థ చెపుతున్న లెక్కల ప్రకారం గత ప్రభుత్వ బకాయిలు 2 వేల కోట్లు అంటే ప్రస్తుత ప్రభుత్వం 1500 కోట్లు బకాయిలు ఉన్నట్లే కథ మరి ప్రస్తుత ప్రభుత్వం తన హయాంలోని బకాయిలను చెల్లించాలి కథ. 2019 లో జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గా బాధ్యతలు చేపట్టే నాటికి వేల కోట్ల బకాయిలులు ఉన్నాయి. కానీ ఏనాడు గత ప్రభుత్వ బకాయిలు కనుక సమస్యతో మాకు సంబంధం లేదు అని ఏనాడు అనేలేదు ప్రాధాన్యతా క్రమంలో బకాయిలు చెల్లించడం వల్ల ఆసుపత్రుల యాజమాన్యాలకు విశ్వాసం ఏర్పడింది. నేటి ప్రభుత్వం కూడా బకాయిలు చెల్లించడం విషయంలో సానుకూల స్పందన చేయాలి ప్రాదాన్యత క్రమంలో చెల్లించాలి. ప్రభుత్వం ఆ కోణంలో ఆలోచించి ఆరోగ్యశ్రీ సేవలను యదాతదంగా కొనసాగేలా చేసి ప్రజల ప్రాణాలను కాపాడాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను.



Tags:    

Similar News