TTD- Tirumala | తిరుమల : పది రోజుల వైకుంఠ దర్శనాలపై సమీక్షిస్తాం..

వైకుంఠ దర్శనాలపై పండితుల సూచనలు పాటించాలని టిటిడి నిర్ణయించింది. క్షమాపణలు చెబితే ప్రాణాలు తిరిగి వస్తాయా అని డిప్యూటీ సీఎంకు టిటిడి చైర్మన్ కౌంటర్ ఇచ్చారు.;

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-01-10 14:32 GMT

తిరుమలలో ఈ ఏడాది మాత్రమే పది రోజులు వైకుంఠద్వార దర్శనాలు కొనసాగించడానికి టిటిడి పాలకమండలి అత్యవసర సమావేశం నిర్ణయించింది.

ఇదే ఏడాది డిసెంబర్ 30 వ తేదీ నుంచి మళ్లీ ప్రారంభమయ్యే వైకుంఠ ఏకాదశికి పది రోజులపాటు దర్శనాలు కొనసాగించాలా? గతంలో మాదిరి రెండు రోజులకే పరిమితం చేయాలా? అనే విషయంపై ఆగమశాస్త్ర పండితుల సలహాలు తీసుకోవాలని టిటిడి పాలకమండలి అత్యవసర సమావేశం తీర్మానించింది. తొక్కిసలాటలో మరణించిన ఆరుగురు, గాయపడిన వారికి నష్టపరిహారం చెల్లించాలని సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు నిధులు మంజూరు చేస్తూ ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన తిరుమలలో శుక్రవారం సాయంత్రం నుంచి సుమారు రెండు గంటల పాటు అత్యవసర సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తీసుకున్న రెండు నిర్ణయాలను ఆయన మీడియాకు వెల్లడించారు. టీటీడీ అత్యవసర సమావేశం ప్రారంభానికి ముందు తొక్కిసలాటలో మరణించిన ఆరుగురు యాత్రికులకు నివాళులర్పించింది. వారి ఆత్మశాంతి కోసం పాలక మండలి సభ్యులు, అధికారులు రెండు నిమిషాలు మౌనం పాటించి, శ్రద్ధాంజలి ఘటించారు.

సీఎం మందలింపు నేపథ్యంలో..
తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం కోసం టోకెన్ల జారీకి ఏర్పాటుచేసిన బైరాగి పట్టెడ, శ్రీనివాసం యాత్రికుల వసతి సముదాయం వద్ద జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మరణించిన విషయం తెలిసిందే. ఈ సంఘటనల నేపథ్యంలో గురువారం సీఎం చంద్రబాబు టీటీడీ పరిపాలన భవనంలో అధికారులతో సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు.
"గతంలో అమలు చేసిన కార్యక్రమాలను కొనసాగించాలని ఏముంది? దీనిపై ఎందుకు సమీక్షించలేదు" అని సీఎం చంద్రబాబు టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి తో పాటు అధికారులను మందలించారు. "తిరుమలలో 10 రోజులు వైకుంఠ ద్వార దర్శనాలపై సమీక్షించాలి" అని సీఎం చంద్రబాబు చెప్పకనే చెప్పారు. దీనికి తోడు తొక్కిసలాటలో మరణించిన ఆరుగురు కుటుంబాలకు 25 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి ఐదు లక్షలు, చికిత్స తీసుకుంటున్న వారికి పొందుతున్న వారికి రెండు లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు.
బోర్డు సమావేశంలో..
తిరుమల అన్నమయ్య భవన్ లో శుక్రవారం సాయంత్రం రెండు గంటల పాటు టీటీడీ చైర్మన్ బి.ఆర్ నాయుడు అధ్యక్షతన అందుబాటులోని పాలకమండలి సభ్యులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు, చనిపోయిన వారి కుటుంబాలు, గాయపడిన క్షతగాత్రులకు పరిహారం చెల్లించడానికి వీలుగా పాలకమండలిలో తీర్మానం ఆమోదించారు. దీనిపై టిటిడి చైర్మన్ వి.ఆర్ నాయుడు మాట్లాడుతూ, "మృతుల ఊర్లకు వెళ్లి వారి కుటుంబ సభ్యులకు అధికారులు పరిహారం చెల్లిస్తారు" అని టిటిడి చైర్మన్ బి.ఆర్ నాయుడు బోర్డులో ఆమోదించిన తీర్మానాన్ని వెల్లడించారు. సమావేశంలో టీటీడీ బోర్డు సభ్యులు పనబాక లక్ష్మి, జీ. భానుప్రకాష్ రెడ్డి, ఆనందసాయి, టీటీడీ చైర్మన్ శ్యామలరావు, అదనపు ఈఓ వెంకయ్య చౌదరి, అధికారులు పాల్గొన్నారు.
సభ్యుల ఔదార్యం

మృతుల పిల్లలకు టీటీడీ విద్య సంస్థల్లో ఉచిత విద్య కూడా ఇవ్వడానికి పాలక మండలి నిర్ణయించింది. కాగా, ఈ సమావేశానికి హాజరైన పాలక మండలి సభ్యులు ఔదార్యం ప్రదర్శించారు. బోర్డు సభ్యులు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, సుచిత్ర ఎల్లా చెరో 10 లక్షలు, ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు మూడు లక్షల రూపాయలు మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు వ్యక్తిగతంగా ఆర్థిక సహాయం అందివ్వనున్నట్లు ప్రకటించారు. అనంతరం మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యాలపై టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు స్పందించారు.
క్షమాపణలు చెబితే ప్రాణాలు వస్తాయా?
తిరుపతిలో తొక్కిసిలాట జరగడానికి ఈఓ శ్యామల రావు, అదనపు ఈఓ వెంకయ్య చౌదరి కూడా బాధ్యులే అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘాటుగా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. జరిగిన ఘటనపై టీటీడీ పెద్ద బహిరంగ క్షమాపణ చెప్పాలని కూడా ఆయన డిమాండ్ చేశారు.
దీనిపై టిటిడి చైర్మన్ డియర్ నాయుడు స్పందించారు. "క్షమాపణలు చెప్పినంత మాత్రాన పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా?" అని పవన్ కళ్యాణ్ డిమాండ్కు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు కౌంటర్ ఇచ్చారు.
Tags:    

Similar News