TIRUMALA | ఆర్జిత సేవా టికెట్లు 19న విడుదల
శ్రీవారి దర్శనానికి అక్టోబర్ కోటా టికెట్ల షెడ్యూల్ ప్రకటించిన టీటీడీ.;
Byline : SSV Bhaskar Rao
Update: 2025-07-15 10:17 GMT
శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల ఆన్ లైన్ కోటా టికెట్ల షెడ్యూల్ మంగళవారం టీటీడీ ప్రకటించింది. ఈ నెల 19వ తేదీ ఉదయం పది గంటలకు అక్టోబర్ నెల కోటా విడుదల చేయనున్నారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి ఆర్జిత సేవా టికెట్లను టీటీడీ ఆన్ లైన్ కోటా విడుదల చేస్తుంది. అందులో భాగంగానే..
ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం జూలై 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు.
ఈ టికెట్లు తీసుకున్న వారు జూలై 21 నుంచి 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి లక్కీడిప్‌లో టికెట్లు మంజూరవుతాయి.
22న ఆర్జిత సేవా టికెట్ల విడుదల
కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ, వార్షిక పుష్పయాగం టికెట్లను జూలై 22న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు.
22న వర్చువల్ సేవలు
వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను జూలై 22న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
అంగప్రదక్షిణ టోకెన్లు
23వ తేదీ అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను జూలై 23న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
శ్రీవాణి టికెట్లు
శ్రీవాణి ట్రస్టు టికెట్ల ఆన్ లైన్ కోటాను జూలై 23వ తేదీ ఉదయం 11 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది.
వృద్ధులు, దివ్యాంగుల కోటా
వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను జూలై 23న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
24వ తేదీ ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను జూలై 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
గదుల కోటా : తిరుమల, తిరుపతిలలో గదుల కోటాను జూలై 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.