తిరుమల:కలియుగ వైకుంఠంలో కథలు చెబుతున్న పుష్పాలు..

బ్రహ్మోత్సవాలకు రూ. తొమ్మిది కోట్లతో అలంకరణ. ఫల-పుష్ప ప్రదర్శన భావాల చిత్రమాలిక ఇది.

Update: 2025-09-23 15:19 GMT

కళాకారుడి చేతిలో కుంచె కదిలితే ఎన్నో భావాలు పలికిస్తుంది. ఈ కళాకారులు పువ్వులతో సజీవచిత్రాలకు రూపం ఇచ్చారు. ఆధ్యాత్మిక, జానపద, కళలను కళ్ల ముందు ఆవిష్కరించారు. తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి కొలువైన కలియుగ వైకుంఠంలో బ్రహ్మోత్సవ శోభ సృష్టించారు. పువ్వులు పలికే భావాలు అర్థం చేసుకోవాలంటే తిరుమలకు వెళ్లాల్సిందే.. ఇక్కడి చిత్రాలు చెబుతున్న కథలేమిటో చూద్దామా..

తిరుమల అంటే కలియుగ వైకుంఠంగా యాత్రికులు భావిస్తారు. జీవితంలో ఒకసారైనా శ్రీవేంకటేశ్వరస్వామివారిని కనులారా చూసి తరలించాలని పరితపిస్తారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో విద్యుద్దీపకాంతులు, ఫలపుష్పాలతో ఈ ఆధ్యాత్మిక క్షేత్రం మరింత కళ సంతరించుకుంది.


తిరుమలకే కాదు. తిరుపతికి కూడా పెద్ద పండుగ వచ్చింది. తిరుమల శ్రీవారి క్షేత్రం మరింతగా కాంతులీనుతోంది. తిరుపతి నగరంలోని ప్రధాన రహదారుల వెంట విద్యుద్దీపాలంకరణ కనువిందు చేస్తోంది. ఈ రెండు క్షేత్రాల్లో విద్యుద్దీపాల అలంకరణకు మాత్రమే టీటీడీ 5.50 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది.


ఫలపుష్ప ప్రదర్శనకు 3.50 కోట్ల రూపాయాలు వెచ్చించారు. విద్యుద్దీపాల వెలుగుతో పాటు వివిధ రకాల పువ్వులు, ఫలాలతో ఏర్పాటు చేసిన కళాకృతులు, ప్రదర్శన తిరుమలలో కనువిందు చేస్తోంది.


"శ్రీవారి పండుగ అంటే అందరికీ సంబరమే. ఆ ఆనందం ఈ అలంకరణలతో కొత్త కళ తీసుకువచ్చే ప్రయత్నం చేశాం" అని టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు చెప్పారు.
తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవం అంటే తిరుపతి, పరిసర ప్రాంతాల్లోని గ్రామాలు కళకళలాడుతుంటాయి. గతానికి ఏమాత్రం తక్కువ కాని విధంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని దేదీప్యమానంగా విద్యుద్దీపాలతో అలంకరించారు. రంగురంగుల వెలుగుల్లో ఆలయం కాంతులీనుతోంది.

శ్రీవారి ఆలయం వద్ద దేవతామూర్తుల కటౌట్లు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆలయం వద్ద
నృసింహస్వామివారి కటౌట్ మరింత గంభీరంగా నిలిచింది. శ్రీవారి ఆలయ మహద్వారం గేట్లను పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించారు.
"తిరుమలతో పాటు తిరుపతిలో కూడా ప్రత్యేక అలంకరణలకు శ్రద్ధ తీసుకున్నాం" అని టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. టీటీడీ గార్డెన్ విభాగం, ఎలక్ట్రికల్ విభాగం అధికారులను సమన్వయం చేయడం ద్వారా సిబ్బందితో ఈ అలంకరణలకు ప్రాత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు సింఘాల్ చెప్పారు.

తిరుమల ఆలయంతో పాటు సంపంగి ప్రాకారం, ఆలయ పరిసరాలు కూడా దేశ, విదేశీ పుష్పాలు పత్రాలతో అలంకరించారు.
"అలంకరణ, ప్రదర్శనకు 60 మెట్రిక్ టన్నులు ఫలాలు, పుష్పాలు వినియోగించాం" అని టీటీడీ గార్డెన్ విభాగం డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు వివరించారు.

శ్రీవారి బ్రహ్మెత్సవాలు పూర్తయ్యే వరకు పుష్పాలు వాడిపోకుండా కళకళలాడుతూ కనువిందు చేస్తుంటాయి. దీనికోసం రోజులపాటు నిలువ ఉండే పువ్వులు సేకరించడానికి టీటీడీ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు.

శ్రీవారి దర్శనానికి వచ్చే యాత్రికులు, దర్శనం తరువాత ఫలపుష్ప ప్రదర్శన చూసేందుకు వీలుగా ప్రచారం చేయడం, యాత్రికులను అటు మళ్లించడానికి కూడా శ్రీవారిసేవకులు సహకారం అందించే విధంగా టీటీడీ గార్డెన్ విభాగంతో సేవకులను అనుసంధానం చేశారు.

తిరుమలలో రాజులకోటను తలపించే విధంగా పూలతోటల మధ్య ఏర్పాటు చేసిన ఈ దృశ్యం కనువిందు చేస్తోంది.

ఈ సెట్టింగ్ ఏర్పాటుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న టీటీడీ గార్డెన్ విభాగం డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు తెలిపారు. 

పువ్వుల సమాహారంగా తీర్చిదిద్దిన తోటలో సీతాకోకచిలుకలు యాత్రికులను స్వాగతించే విధంగా తీర్చిదిద్దని విధానంలో పువ్వులే వాడారు. ఆ కళాకారుల నేర్పరితనం ఇక్కడ కనువిందు చేస్తోంది.

శ్రీవారి ఆలయంలో ధ్యాననృసింహస్వామి దర్శనం ఇస్తారు. కానీ ఆస్వామి రౌద్రంలో ఉన్న సహజ స్ధితిని ఇక్కడ పువ్వులతోనే కళాత్మకంగా
Tags:    

Similar News