మంగళగిరి శారీలోనే అందంగా ఉన్నారు
విశాఖ సీఐఐ సమ్మిట్ లో సీఎం చంద్రబాబు ఆస్ట్రేలియాకు చెందిన మహిళా వీఐపీలను అభినందించారు.
ఇటీవల విశాఖపట్నంలో జరిగిన సీఐఐ సమ్మిట్ లో సీఎం చంద్రబాబు నాయుడు ఆస్ట్రేలియాకు చెందిన మహిళా ప్రతినిధులపై అభినందనల వర్షం కురిపించారు. ఆస్ట్రేలియాకు చెందిన వీఐపీలు ఇండియన్ శారీస్ ధరించడం చాలా సంతోషంగా ఉంది. నిజంగా చెబుతున్నాను మీరు ఆస్ట్రేలియా డ్రెస్ లో కంటే ఇండియన్ శారీలోనే చాలా నైస్ గాను, అందంగాను ఉన్నారు. ఆస్ట్రేలియా మహిళా వీఐపీలు, కౌన్సిల్ జనరల్ తో సహా ఇండియన్ శారీస్ ను ధరించడం చాలా సంతోషంగా ఉంది. ఆస్ట్రేలియాకు చెందిన వారైనప్పటికీ మా సెంటిమెంట్ ను మీరు గౌరవించినందుకు చాలా సంతోషంగా ఉంది. అది కూడా మంగళగిరి శారీని ధరించినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. మంగళగిరి శారీస్ కు మీరు బ్రాండ్ అంబాసిడర్ అయ్యారు. మంగళగిరి చేనేతన్నలను గౌరవించినందుకు చాలా గర్వంగా ఉంది. ’రియల్లీ ఐ అప్రిసియేట్ యు‘ అంటూ ఆస్ట్రేలియా దేశానికి చెందిన మహిళా ప్రతినిధులను పొగడ్తలతో ముంచెత్తారు సీఎం చంద్రబాబు.
సీఎం చంద్రబాబు మంగళగిరి శారీస్ ఆస్ట్రేలియా వీఐపీలు ధరించిన అంశం గురించి మాట్లాతున్న సమయంలో సీఎం చంద్రబాబుతో సహా ఆస్ట్రేలియా ప్రతినిధులు, సమావేశానికి హాజరైన ప్రతినిధులు అందరి ముఖాల్లో నవ్వుల జల్లు కురిసింది. అందరూ చిరునవ్వులు చిందిస్తూ సీఎం చంద్రబాబు కామెంట్స్ ను స్వాగతించారు. కరతాళ ధ్వనులతో ఆస్ట్రేలియా ప్రతినిధులను అభినందించారు. దీనిని సీఎం చంద్రబాబు ఇంకా కొనసాగిస్తూ ఇలాంటివి చేయడానికే తనెప్పుడూ ఆలోచనలు చేస్తూ ఆరాటపడుతుంటానని చెప్పారు. చిన్న ప్రాంతంలో ఉన్న వస్తువులను గ్లోబెల్ లెవల్లోకి తీసుకెళ్లాలనే దానిపై నిరంతరం పని చేస్తుంటాను అని చెప్పారు.
ప్రతి దేశం ఒక ప్రతక కల్చర్, ఆచార వ్యవహారాలను కలిగి ఉంటుంది. లెగస్సీస్ ను కలిగి ఉంటుంది. సెంటిమెంట్లను కూడా కలిగి ఉంటుంది. ఇలాంటి వాటిని గుర్తించి గౌరవించినప్పుడు అవి బిగ్ వేలో ప్రపంచాలనికి పరిచయం అవుతుంటాయి. ఇవి గ్లోబల్ గుడ్ కి, గ్లోబల్ హార్మోనీకి ఎంతో దోహద పడుతాయని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
అసలేం జరిగిందింటే..
నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖపట్నం ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ మైదానంలో 30వ సదస్సును భారత ఉపరాష్ట్రపతి జి. సీపీ రాధాకృష్ణన్ ప్రారంభించారు. 40 దేశాల నుంచి 3,000 మంది ప్రతినిధులు, దిగ్గజ పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. సదస్సు సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పలు కీలక సమావేశాలు నిర్వహించారు. సింగపూర్, యూరప్, ఆస్ట్రేలియా ప్రతినిధులతో భేటీలు జరిగి, రాష్ట్రంలో పారిశ్రామిక సహకారాలు, యూనివర్సిటీల మధ్య భాగస్వామ్యాలపై చర్చించారు. ఐటీ మంత్రి నారా లోకేశ్ కూడా ఆస్ట్రేలియా కాన్సుల్ జనరల్ సిలాయ్ జాకీ, జేమ్స్ కుక్ యూనివర్సిటీ ప్రతినిధులతో సమావేశమై, కోస్టల్ రీసెర్చ్, ట్రాపికల్ డిసీజెస్, సస్టైనబుల్ టూరిజం, గ్రీన్ ఎనర్జీ వంటి రంగాల్లో భవిష్యత్ సహకారాలు గురించి చర్చించారు. ఒప్పందాలు కుదుర్చుకున్నారు.
అయితే ఈ సదస్సు హైలైట్‌గా మంగళగిరి చేనేత చీరలు నిలిచాయి. ఆస్ట్రేలియా ప్రతినిధులు, ముఖ్యంగా మహిళా డెలిగేట్లు మంగళగిరి నేతన్నలు నేసిన ఈ సాంప్రదాయ చీరలు ధరించి, భారతీయ సంస్కృతిని గౌరవించారు. గాలా డిన్నర్ సందర్భంగా వారు ఈ చీరల్లో హాజరు కావడం గమనార్హం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారిని అభినందించుతూ, "మా మంగళగిరి నేతన్నలు నేసిన చేనేత చీర కట్టుకున్నందుకు మీకు ధన్యవాదాలు. మీరు ఆస్ట్రేలియా డ్రెస్‌లా కంటే ఈ చీరల్లో చాలా అందంగా కనిపిస్తున్నారు" అని ప్రశంసించారు. ఈ చర్య మంగళగిరి చేనేతను ప్రపంచవ్యాప్తంగా ప్రోత్సహిస్తూ, ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయాలకు గుర్తింపు తెచ్చింది. మంగళగిరి చేనేత చీరలు జిఐ ట్యాగ్ పొందినవి. ఈ సమ్మిట్ ద్వారా మన నేతన్నల కష్టాలకు అంతర్జాతీయ మార్కెట్‌లో గుర్తింపు లభించడం సంతోషకరం.