Tiruchanuru| తిరుచానూరుకు పెద్దపండుగ తెచ్చిన అమ్మవారి బ్రహ్మోత్సవాలు
పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు గురువారం వైభవంగా ప్రారంభమయ్యాయి. డిసెంబర్ 6వ తేదీ పంచమి తీర్థానికి టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది.
By : SSV Bhaskar Rao
Update: 2024-11-28 14:19 GMT
టిటిడి ఆధ్వర్యంలో తిరుపతి, అనుబంధ ఆలయాల్లో ఏడాది పొడవున పండుగలు జరుగుతూనే ఉంటాయి. అందులో ప్రధానమైనది తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు గురువారం వైభవంగా ప్రారంభమయ్యాయి. డిసెంబర్ 6వ తేదీ వరకు నిర్వహించే ఈ ఉత్సవాలు తిరుచానూరుకు పెద్ద పండుగ లాంటివి.
ఈ బ్రహ్మోత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పద్మావతి అమ్మవారికి దేవాదాయ శాఖ ( Endowment Department) మంత్రి ఆనం రామనారాయణరెడ్డి లాంఛనంగా పట్టువస్త్రాలు సమర్పించారు. టీటీడీ ఈఓ జే. శ్యామలరావు, అదనపు ఈఓ సీహెచ్. వెంకయ్యచౌదరి తోపాటు వివిధ స్థాయిల అధికారులు మంత్రిని స్వాగతించారు. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన తర్వాత మంత్రి రామనారాయణ రెడ్డికి వేదపండితులు ఆశీర్వచనాలు, తీర్థ ప్రసాదాలను అందించారు.
అంకురార్పణ
తిరుమల శ్రీవారి పట్టపురాని అయిన పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలకు బుధవారం సాయంత్రం పొద్దుపోయిన తర్వాత అంకురార్పణ చేశారు. వేద పండితులు నిర్వహించారు. టిటిడి జేఈవో ( Joint Executive ఆఫీసర్) వీరబ్రహ్మం సారధ్యంలో ఈ కార్యక్రమం శాస్త్రబద్ధంగా నిర్వహించారు. అమ్మవారి ఆలయానికి సమీపంలోనే ఉన్న ఉద్యానవనంలో సేకరించిన పుట్టమన్ను శాస్త్రోక్తంగా ఆలయానికి తీసుకువచ్చారు. అంతకుముందే, కొత్త పాత్ర నీటిలో నానబెట్టిన నవధాన్యాలను పుట్ట నుంచి సేకరించిన మట్టిలో నీళ్ళు పోసి, నీరు పోస్తారు. ఃనవధాన్యాలను పుట్టమన్నులో వేసి అంకురార్పణకు శ్రీకారం చుట్టారు. వైఖానస ఆగమంలో ఈ ఘట్టానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఈ కార్యక్రమానికి ముందే నవధాన్యాలను కొత్త పాత్రలో వేసిన నీటిలో నానబెడతారు. ఈ విత్తనాలు బాగా మొలక వేస్తే ఉత్సవాలు బాగా జరుగుతాయని, పాడి పంటలతో సుభిక్షంగా ఉంటారనేది విశ్వాసం. ఈ కార్యక్రమం పద్మావతి అమ్మవారి ఆలయంలో వేద పండితులు నిర్వహించారు.
ఉత్సవాలకు శ్రీకారం..
ధ్వజారోహణంతో వైభవంగా శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు ప్రారంభ సూచికగా పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల ప్రారంభానికి ముక్కోటి దేవతలను ఆహ్వానిస్తూ పండితులు గురువారం ఉదయం ధ్వజారోహణం చేశారు. మాడవీధుల్లో విహరించే అమ్మవారి సేవలో పాల్గొనేందుకు తిరుపతి, చిత్తూరు జిల్లా వాసులతో పాటు అత్యధికంగా తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికులతో మరింత రద్దీగా మారుతుంది. అందులో ఈనెల ఆరో తేదీ ఆలయం సమీపంలోని పద్మపుష్కరిణి (కోనేరు) లో నిర్వహించే పంచమితీర్థం కార్యక్రమానికి లక్షలాదిగా యాత్రికులు తరలివస్తారు ఇందుకోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా చేసినట్లు టీటీడీ ఈవో జే. శ్యామలరావు తెలిపారు.
గొడుగుల సమర్పణ
బ్రహ్మోత్సవాల వేళ తిరుమల శ్రీవారికే కాదు. పద్మావతి అమ్మవారి ఆలయానికి కూడా తమిళనాడుకు చెందిన భక్తులు వాహన సేవలో వినియోగించే గొడుగులు సమర్పించడం ఆనవాయితీగా పాటిస్తారు. పద్మావతి అమ్మవారి ఆలయానికి చెన్నైకి చెందిన వీర్ వవంత్ కుమార్ ఆరు గొడుగులను కానుకగా సమర్పించారు. తిరుచానూరు ఆలయం వద్ద టిటిడి ఈఓ శ్యామల రావుకు చెన్నై భక్తుడు వేరు వసంత్ ఈ కొడుకులను అందజేశారు. అనంతరం ఆయనకు ఆలయంలో ప్రత్యేక దర్శనం కల్పించారు.
అలంకార శోభితం
బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంతో పాటు, గ్రామం మొత్తాన్ని విద్యుద్దీదీపాల దేవతామూర్తుల కటౌట్లతో అలంకరించారు. దీంతో ఈ ప్రాంతానికి కొత్త పండుగ వాతావరణం వచ్చింది. ఆలయంతో పాటు మాడవీధులు తిరుచానూరు గ్రామాన్ని కూడా దేవతామూర్తుల కటౌట్లతో అలంకరించారు. భక్తుల రద్దీ వల్ల ఆస్కారం లేకుండా అమ్మవారి ఆలయం మాడవీధుల్లో ప్రత్యేకంగా బారికెట్లను కూడా ఏర్పాటు చేశారు. అమ్మవారి వాహన సేవలను అందరికీ కనిపించే విధంగా తిరుచానూరు పరిసర ప్రాంతాలతో పాటు పద్మ పుష్కరానికి నాలుగు వైపులా గతంలో ఎన్నడూ లేనివిధంగా 20 ఎల్ఈడి స్క్రీన్లు కూడా ఏర్పాటు చేశారు. పంచమితీర్థం రోజు యాత్రికులు పుష్కరి నీటిలోకి దిగి పుణ్య స్థానాలు ఆచరించడం, ఆ తర్వాత బయటికి వెళ్లేందుకు ప్రత్యేకంగా గేట్లు కూడా ఏర్పాటు చేశారు.
ప్రత్యేక ఏర్పాట్లు
పంచమీతీర్థం రోజు 120 కౌంటర్ల ద్వారా వేలాది మంది భక్తులకు మంచినీరు బాదంపాలు బిస్మిల్లా బాత్ పెరుగన్నం వెజిటబుల్ ఉప్మా తో పాటు అదనంగా చక్కెర పొంగలి కూడా పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేసినట్లు ఈవో శ్యామలరావు వివరించారు. ఈ బ్రహ్మోత్సవాలకు టీటీడీలోని భద్రతా సిబ్బందితోపాటు పోలీసులు తో కలిపి 460 మందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. కీలకమైన పంచమి తీర్థం రోజు 1500 మంది పోలీసులు 600 మంది విజిలెన్స్ సిబ్బందితో భద్రత ఏర్పాట్లు చేయడానికి ముందస్తు చర్యలు తీసుకున్నట్లు ఆయన వివరించారు. మీరు కాకుండా అదనంగా వెయ్యి మంది శ్రీవారి సేవకులు 200 మంది స్కౌట్స్ అండ్ గైడ్స్ కూడా యాత్రికుల సేవ కోసం వినియోగించుకోనున్నట్లు శ్యామలరావు చెబుతున్నారు.