టమాటా రైతుల కష్టం దొంగలపాలైందే...

టమాట ధర పడిపోతే రైతుకు కన్నీళ్లు తప్పవు. ధరలు పెరిగితే పాత అప్పులు వెంటాడుతుంటాయి. అంతేనా, దొంగల భయం కూడా వెంటాడుతోంది..

Update: 2024-10-08 10:11 GMT

చోరీలు ఇళ్లలో జరుగుతుంటాయి. నగదు, నగలు అపహరిస్తుంటారు. పెరిగిన టమోటా ధరల నేపథ్యంలో దొంగలు దారి దోపిడీకి కూడా పాల్పడుతున్నారు. తాజాగా ఆ సంఘటన రాయలసీమంలో వెలుగు చూసింది. కిలో టమాట రు. వందకు చేరువలో ఉంది. ఇది రైతులకు ఒక విధంగా ఆదాయం చేకూరుస్తోంది. అని చెప్పడం కంటే, పాత అప్పులు తీర్చుకోడానికి ఉపయోగపడుతుందనడంలో సందేహం లేదు. రూ. లక్షల్లో ఆదాయం వస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో టమాటా రైతులను దారి దోపిడీ దొంగలు వెంటాడుతున్నారు. ఆరుగాలం శ్రమించిన సొమ్ముకు కూడా భద్రత లేని పరిస్థితి.

రాష్ట్రంలోని రాష్ట్రంలోని మదనపల్లె టమాటా మార్కెట్ ఏసియాలోనే పెద్దది. దీనికి సమీపంలోనే.. అంటే పొరుగునే ఉన్నఆ తర్వాత కర్ణాటక రాష్ట్రం కోలార్ టమాటా మార్కెట్ కు ఆ స్థాయి ఉంది. ఈ ప్రాంతంలో టమాటా దిగుబడి దేశీయ మార్కెట్ ను శాసిస్తుంది. ఉత్పత్తి ఆ స్థాయిలో ఉంటుంది. కాగా,
కర్ణాటక రాష్ట్రం కోలార్ జిల్లా ముళబాగిల్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి టమాటా లోడు తీసుకుని హైదరాబాద్ తీసుకువెళ్లాడు. అక్కడి మార్కెట్లో టమోటాలు విక్రయించాడు. టెంపో డ్రైవర్ నయాజ్ ఆదివారం రాత్రి ముల్బాగిల్ కు తిరుగు ప్రయాణం అయ్యాడు. టమాటాలు విక్రయించగా వచ్చిన రూ. ఐదు లక్షలు అతని వద్ద ఉంది. హైదరాబాద్ నుంచి కర్ణాటక రాష్ట్రం ములబాగిల్ కు వస్తూ, టెంపో డ్రైవర్ నయాజ్ కర్నూలు వద్ద టీ కోసం ఆపాడు. అతని వద్ద భారీగా సొమ్ము ఉంటుందని గమనించిన ఓ ముఠా కారులో వెంబడించారు. కర్నూలు నగరం నుంచి బెంగళూరు హైవేలో అనంతపురం జిల్లా పెనుగొండ సమీపంలోని సోమందేపల్లి వద్ద ట్రక్కును అడ్డగించారు కారు అడ్డంగా నిలపడంతో చేసేది లేక డ్రైవర్ నయాజ్ వాహనం ఆపాడు. ఆ తర్వాత ట్రక్కు నిలపగానే డ్రైవర్ నయాజ్ను బెదిరించిన దుండగులు అతని నుంచి సెల్ ఫోన్ లాక్కున్నారు. టమోటాలు విక్రయించగా వచ్చిన సొమ్ము రూ. ఐదు లక్షల నగదు కూడా బలవంతంగా లాక్కుని పారిపోయారు. దీంతో బాధితుడు నయాజ్ సోమందేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సోమందేపల్లి ఎస్సై రమేష్ తెలిపారు.
Tags:    

Similar News