వై.యన్. రెడ్డి మాట్లాడుతూ.. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయి 1953లో ఏర్పడిన ప్రత్యేక ఆంధ్రప్రదేశ్‌లో కర్నూలులో రాజధాని, గుంటూరులో హైకోర్టు ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. కానీ 1956లో తెలంగాణ విలీనంతో రాజధాని హైదరాబాద్‌కు తరలిపోయి రాయలసీమకు తీవ్ర అన్యాయం జరిగిందని తెలిపారు. రాష్ట్ర విభజన చట్టం - 21014 అనంతరం రాయలసీమకు చట్టబద్ధ నీటి కేటాయింపులు కల్పించినప్పటికీ.. తదనంతరం ఏర్పడ్డ ప్రభుత్వాలు సాగునీటి రంగాన్ని నిర్వీర్యం చేశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలనా వికేంద్రీకరణలో భాగంగా రాజధాని లేదా హైకోర్టు రాయలసీమలో ఏర్పాటు చేయాలని సమాజం గళమెత్తినా ఏ ప్రభుత్వం కూడా ప్రజల ఆకాంక్షలను గౌరవించలేదని అన్నారు.
అలాగే, రాయలసీమలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయకపోవడంతో రైతులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనీ.. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ప్రజల ఆశలను నెరవేర్చాలని సమితి డిమాండ్ చేసింది. శ్రీ బాగ్ ఒప్పందంలోని కీలక అంశాల అమలుకు రాయలసీమ ప్రజాప్రతినిధులు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఏర్వ రామచంద్ర రెడ్డి, ఆకుమల్ల రహీం, మహేశ్వర్ రెడ్డి, మెహబూబాష, మాజీ సర్పంచ్ గోపాల్ రెడ్డి, చెరుకూరి వెంకటేశ్వర నాయుడు, భాస్కర్ రెడ్డి, రాఘవేంద్ర, మనోజ్ కుమార్ రెడ్డి, న్యాయవాది అసదుల్లా, కొమ్మా శ్రీహరి, గాయకుడు గౌడ్, శంకర్ రెడ్డి, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.