తిరుమలలో ఏడాది పొడవునా ఉత్సవాలే..

అక్టోబర్ నెలలో నిర్వహించే విశేష ఉత్సవాలు ఇవీ.

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-09-29 10:32 GMT
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయం (షైల్)

తిరుమలలో నిత్యకల్యాణం పచ్చతోరణం. ఏడాది పొడవునా ఉత్సవాలే. యాత్రికులకు ఇక్కడి కార్యక్రమాలు కనువిందు చేస్తుంటాయి. ఆగమశాస్త్రం ప్రకారం విశేష పర్వదినాలు నిర్వహించేందుకు టీటీడీ వేదపండితులు శ్రద్థ తీసుకుంటారు. అందులో భాగంగా ఈ ఏడాది అక్టోబర్ నెలలో నిర్వహించే విశేష పర్వదినాల క్యాలెండర్ టీటీడీ సోమవారం వెల్లడించింది.

అక్టోబ‌ర్ నెల‌లో తిరుమ‌ల‌లో విశేష ప‌ర్వ‌దినాలు
అక్టోబ‌ర్ 1న శ్రీ‌వారి ర‌థోత్స‌వం
అక్టోబ‌ర్ 2న చ‌క్ర‌స్నానం, ధ్వ‌జావ‌రోహ‌ణం
అక్టోబ‌ర్ 3న శ్రీ‌వారి బాగ్ స‌వారి
అక్టోబ‌ర్15న తిరుమ‌ల నంబి ఉత్స‌వారంభం
అక్టోబ‌ర్ 20న శ్రీ‌వారి ఆల‌యంలో దీపావ‌ళి ఆస్థానం
అక్టోబ‌ర్ 23న భ‌గినీహ‌స్త భోజ‌నం
అక్టోబ‌ర్ 24న తిరుమ‌ల‌నంబి శాత్తుమొర‌
అక్టోబ‌ర్ 25న నాగుల చ‌వితి, పెద్ద శేష వాహ‌నం.
అక్టోబ‌ర్ 27న మాన‌వాళ మ‌హామునుల శాత్తుమొర‌.
అక్టోబ‌ర్ 28న సెనైమొద‌లియార్ వ‌ర్ష తిరు న‌క్ష‌త్రం.
అక్టోబ‌ర్ 29న తిరుమ‌ల శ్రీ‌వారి పుష్ప‌యాగ మ‌హోత్స‌వ అంకురార్ప‌ణ‌.
అక్టోబ‌ర్ 30న తిరుమ‌ల శ్రీ‌వారి పుఫ్ప‌యాగం.
అక్టోబ‌ర్ 31న పూద‌త్తాళ్వార్ వ‌ర్ష తిరు న‌క్ష‌త్రం, యాజ్ఞ‌వ‌ల్క్య జ‌యంతి నిర్వహించడానికి టీటీడీ అధికారులు కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
Tags:    

Similar News