శ్రీనివాసా.. జనసేనానికి సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించు స్వామీ..

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-09-29 12:32 GMT
పవన్ కల్యాణ్ (షైల్)

జ్వరంతో బాధపడుతున్న డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కల్యాణ్ త్వరగా కోలుకోవాలని జనసైనికులు ఆలయాల్లో పూజలు చేస్తున్నారు. కొబ్బరి కాయలు కూడా కొట్టి ప్రార్ధనలు చేస్తున్నారు. ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌ర‌గా కోలుకోవాలంటూ అలిపిరి శ్రీవారి పాదాల మండ‌పం వ‌ద్ద ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు జ‌న‌సైనికుల‌తో క‌లిసి కొబ్బ‌రి కాయ‌లు సోమ‌వారం మ‌ధ్యాహ్నం కొట్టారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ వైర‌ల్ ఫీవ‌ర్ తో గ‌త ఐదు రోజులుగా బాధ‌ప‌డుతుండ‌టంతో శ్రీవారికి ఎమ్మెల్యే నేతృత్వంలో జ‌న‌సైనికులు మొక్కులు చెల్లించుకున్నారు.

అలిపిరి వద్ద కొబ్బరికాయలు కొడుతున్న తిరుపతి జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, పార్టీ నేతలు

తిరుపతి జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అలిపిరి పాదాలమండపం వద్ద సోమవారం కొబ్బరికాయలు కొట్టి శ్రీవేంకటేశ్వరస్వామి వారిని ప్రార్థించారు. తమ పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా జనంలోకి రావాలని ఎమ్మెల్యే శ్రీనివాసులు వేడుకున్నారు. జనం కోసం, పేదల కోసం అహర్నిశలు ఆలోచన చేయడమే కాదు. పనిచేసే నేతకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించమని ప్రార్థించినట్లు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మీడియాకు చెప్పారు.

త్వరగా కోలుకోవాలి..

వైర‌ల్ ఫీవ‌ర్ తో బాధ‌ప‌డుతున్న జ‌న‌సేన అధ్య‌క్షులు, డిప్యూటీ సిఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ త్వ‌ర‌గా కొలుకుని ప్ర‌భుత్వ‌, పార్టీ కార్య‌క్ర‌మాల్లో య‌ధాత‌థంగా పాల్గొనే శ‌క్తి ఆయ‌న‌కు ఇవ్వాల‌ని శ్రీవేంక‌టేశ్వ‌ర స్వామిని కోరుకున్న‌ట్లు ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు తెలిపారు. ఓజి సినిమా సూప‌ర్ స‌క్సెస్ అయ్యింద‌ని ఆయ‌న హర్షం వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్ అభిమానులు, జనసైనికులకు ఆయన కృతజ్ణతలు తెలిపారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ప‌రామ‌ర్శించి త్వ‌రగా కోలుకోవాల‌ని ఆకాంక్షించార‌ని ఆయ‌న తెలిపారు. శ్రీవారి ఆశీస్సులతో ప‌వ‌న్ క‌ళ్యాణ్ త్వ‌ర‌గా కోలుకుంటార‌ని ఆయ‌న ధీమా వ్య‌క్తం చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో జ‌న‌సేన నాయ‌కులు రాజా రెడ్డి, బండ్ల ల‌క్ష్మీప‌తి, హ‌రిశంక‌ర్, కెఎంకే లోకేష్‌, దినేష్ జైన్, ఆముదాల వెంక‌టేష్, ర‌మేష్ నాయుడు, బాలిశెట్టి కిషోర్, గంగ‌మ్మ‌ గుడి పాల‌క‌మండ‌లి స‌భ్యులు మాధ‌వీల‌త‌, రుద్ర కిషోర్, చందు, కిషోర్, మున‌స్వామి, కొండా రాజ‌మోహ‌న్, సుమ‌న్, శిరీషా, రాధ త‌దిత‌రులు పాల్గొన్నారు.
Tags:    

Similar News