వీళ్ల బదిలీలు తప్పని సరి..టీచర్ల ట్రాన్స్‌ఫర్లకు జీవో జారీ
ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించిన ఉత్తర్వులు మంగళవారం అర్థరాత్రి కూటమి ప్రభుత్వం జారీ చేసింది.;
By : The Federal
Update: 2025-05-21 05:57 GMT
ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ బదిలీలకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఆ మేరకు మంగళవారం అర్థరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఐదేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న హెడ్మాస్టర్లు, ఎనిమిదేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులను బదిలీ చేసేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఆ మేరకు ఉత్తర్వుల్లో కూడా పేర్కొంది. ఐదేళ్ల సర్వీసును పూర్తి చేసుకున్న ప్రదాన ఉపాధ్యాయులతో పాటు ఎనిమిదేళ్ల సర్వీసును కంప్లీట్ చేసుకున్న ఉపాధ్యాయులను కూడా తప్పనిసరిగా బదిలీ కావలసి ఉంటుందని జీవోలో కూటమి ప్రభుత్వం పేర్కొంది.
సర్వీసు పాయింట్లతో పాటు కేటగిరీల వారీగా టీచర్లకు పాయింట్లు ఇవ్వనున్నారు. çసర్వీసు పాయింట్లు సంవత్సరానికి 0.5గా పేర్కొన్నారు. మే నెలాఖరు నాటికి అంటే మే 31 నాటికి రాష్ట్రంలో ఉన్న ఉపాధ్యాయ ఖాళీలు, హేతుబద్దీకరణ ఖాళీలు, రిటైర్మెంట్ కానున్న స్థానాలు, కంపల్సరీగా ట్రాన్సఫర్ అయ్యే ప్లేసులు, సంవత్సర కాలంగా పాఠశాలకు వెళ్లకుండా ఆబ్సెంట్ అయిన స్థానాలతో పాటుగా స్టడీ లీవుల మీద ఖాళీ అయిన వివరాలను చూపించనున్నట్లు వెల్లడించారు. కేటగిరీల వారీగా పాయింట్లు ఎలా ఇస్తారంటే.. కేటగిరీ–1కి ఒక పాయింటు, కేటగిరీ–2కి 2 పాయింట్లు, కేటగిరీ–3కి 3 పాయింట్లు, కేటగిరీ–4కి ఐదు పాయింట్లతో పాటు 5 స్టేషన్ పాయింట్లు ఇవ్వనున్నట్లు వెల్లడించారు