కరూర్‌ తొక్కిసలాట విషాదకరం : చంద్రబాబు

అమాయకుల మృతి బా«ధాకరమని, ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు సీఎం చంద్రబాబు సానుభూతి తెలిపారు.

Update: 2025-09-28 13:16 GMT

తమిళనాడులోని కరూర్‌ జిల్లా జరిగిన తొక్కిసలాట ఘటనపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విషాదకర ఘటనలో అమాయకులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని పేర్కొన్నారు.‘‘కరూర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనలో అమాయకుల ప్రాణనష్టం ఎంతో విషాదకరం. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నా హదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను,’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సోషల్‌ మీడియా వేదికగా పేర్కొన్నారు.

ఈ ఘటనపై దేశవ్యాప్తంగా రాజకీయ, సామాజిక నాయకులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లోనూ ఘటనపై స్పందనలు వెల్లువెత్తుతున్నాయి. పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చిందని, బాధితులకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నామని తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది.


Tags:    

Similar News