విద్యార్థుల ఆకలి కేకలు ఇలా ఉన్నాయ్..

ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పేద విద్యార్థులు అల్లాడుతున్నారు. మధ్యాహ్న భోజన పథకం పునురుద్ధరించండి అని ఏఐఎస్ఎఫ్ నేతలు కోరారు.

Update: 2024-11-02 09:57 GMT

రాష్ట్రంలో మధ్యాహ్న భోజన పథకాన్ని జూనియర్ కాలేజీల్లో అమలు చేయాలని కోరుతూ, దీర్ఘకాలిక ఆందోళనలకు వామపక్ష విద్యార్థి సంఘం కార్యాచరణ సిద్ధం చేసింది. పేద విద్యార్థుల కోసం టీడీపీ ప్రభుత్వ కాలంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేశారు. వైసీపీ ప్రభుత్వ కాలంలో దీనిని రద్దు చేయడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని పునరుద్ధరించాలని ఏఐఎస్ఎఫ్ నేతలు ప్రభుత్వాన్ని కోరారు. పేద విద్యార్థులను అన్నా క్యాంటీన్లు ఆదుకుంటున్నాయని, ఈ పరిస్థితి నుంచి కాపాడాలని ఆ సంఘం నేతలు వినతి చేశారు.


" రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో మళ్లీ మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తాం" అని యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీని అమలు చేయాలని విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ను అనంతపురం జిల్లా ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు హనుమంతరాయడు, ప్రధాన కార్యదర్శి కుల్లాయిస్వామి కోరారు. గత వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన ఈ పథకాన్ని ఈ సమస్యపై త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యేలు మాట్లాడాలి" అని డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా రాయదుర్గం తహసీల్దార్ కార్యాలయం వద్ద శనివారం విద్యార్థులు భారీ సంఖ్యలో నిరసనకు దిగారు.

అనంతపురం జిల్లా ఏఐఎస్ఎఫ్ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి హనుమంతరాయు,డు కుళ్లాయిస్వామి మాట్లాడుతూ, 2017-18లో టీడీపీ ప్రభుత్వంలో కూడా ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకం కొనసాగిన విషయాన్ని గుర్తు చేశారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన మూడు నెలలకే ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఆ పథకాన్ని తొలగించారని తెలిపారు. ఈ పరిస్థితుల్లో ఎన్నికల ప్రచారంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ పథకాన్ని కొనసాగిస్తాం" అని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇచ్చిన హామీని గుర్తు చేసిన వారు, దానిని అమలు చేయాలని వారు కోరారు.
పల్లెలు, దూరప్రాంతాల నుంచి పేద విద్యార్థులు అన్నా క్యాంటీన్ల వైపు పరుగులు తీస్తున్న పరిస్థితి ఏర్పడిందని వారు ఆదేవన వ్యక్తం చేశారు. ఈ పథకం లేకపోవడం వల్ల కూడా కాలేజీల్లో డ్రాపౌట్స్ పెరగడానికి ఆస్కారం ఏర్పడిదని వారు తెలిపారు. పేద విద్యార్థుల ఇబ్బందులు, వారి తల్లిదండ్రుల కష్టాలు గమనించి, ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని కోరారు. దీనిపై
"త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడాలి" అని జిల్లా ఎమ్మెల్యేలను కోరారు. ఏఐఎస్ఎఫ్ జిల్లా కోశాధికారి ఆంజనేయులు జిల్లా ఉపాధ్యక్షులు వంశీ జిల్లా కార్యవర్గ సభ్యులు పవన్ నియోజకవర్గ అధ్యక్షులు శశి నియోజవర్గ నాయకులు అభిషేక్ రాజేష్ మధు మనోజ్ పాల్గొన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం అమలు చేయాలని వారు కోరారు. "జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఏడు రోజులపాటు ఆందోళనకార్యక్రమాలకు రూపకల్పన చేశాం" అని ఏఐఎస్ఎఫ్ నేతలు వివరించారు.



Tags:    

Similar News