ఎట్టకేలకు కూటమి ప్రభుత్వం పదవుల వడ్డనకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ కూటమి 164 స్థానాల్లో విజయం సాధించింది. అందులో టీడీపీ సొంతంగా 135 సీట్లు, జనసేన 21, బీజేపీ నుంచి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు విజయం సాధించారు. ఇదిలావుంటే,
అసెంబ్లీ, శాసనమండలిలో చీఫ్ విప్ (Chief Whip) తో పాటు విప్ (Whip) లను అధికారంలో ఉన్న పార్టీ నియమిస్తుంది. ఇందులో ఎమ్మెల్యేలను సభకు వచ్చేలా చూడడం, బిల్లలు పాస్ చేయిచుకోవడంలో ఓటింగ్ జరిగితే విప్ చేరీ చేయడంలో వారి పాత్ర కీలకం. సాధారణంగా అసెంబ్లీలో గతంలో నలుగురు విప్ లను మాత్రమే నియమించే వారు. కానీ,
టీడీపీ కూటమి ప్రభుత్వం మాత్రం జంబో విప్ లను నియమించింది. 164 మంది సభ్యులను నియంత్రించడానికి ఇద్దరు చీఫ్ విప్ లు, 18 మంది విప్ లను అసెంబ్లీలో నియమించింది. వారిలో ముగ్గురు విప్ లు, ఓ చీఫ్ విప్ ఉన్నారు.
వీరందరిలో సీనియర్లుగా, మంత్రులుగా పనిచేసిన వారితో పాటు, పార్టీ పక్షాన గట్టిగా స్వరం వినిపించిన వారికే సీఎం చంద్రబాబు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారనే విషయం స్పష్టంగా కనిపిస్తోంది. ఇందులో కూడా భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకుని ఎన్నికల్లో పోటీకి కొత్త అభ్యర్థులకే ప్రాధాన్యం ఇచ్చారు. ఆ తరువాత మంత్రిమండలి, తాజాగా విప్ పదవుల వడ్డనలో సీఎం చంద్రబాబు సామాజికవర్గాల సమతూకాన్ని పాటిస్తూ, అదే సూత్రాన్ని అమలు చేశారనే విషయం స్పష్టమైంది.
మంత్రి పదవులు దక్కని ఎమ్మెల్యేలకు సీఎం ఎన్ చంద్రబాబు సాంత్వన ఇచ్చారు. కూటమి ఏర్పడిన ఐదు నెలల తర్వాత అసెంబ్లీ, శాసనమండలి లో చీఫ్ విప్, విప్ లను నియమించారు. టిడిపి కూటమిలో జనసేన తో పాటు బిజెపి కూడా భాగస్వామిగా ఉంది. ఆ పార్టీల ఎమ్మెల్యేలకు కూడా విప్ లుగా నియమించడంలో సీఎం ఎన్ చంద్రబాబు ప్రాధాన్యత ఇచ్చారు. అసెంబ్లీలో చీఫ్ విప్ (Chief whip) గా TDP వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ను నియమించారు. శాసనమండలిలో కృష్ణాజిల్లా నుంచి ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహిస్తున్న పెంచుమర్తి అనురాధాను నియమించారు. వీరితోపాటు
శాసనసభలో విప్‌లు
ఆదినారాయణరెడ్డి- జమ్మలమడుగు
అరవ శ్రీధర్, కోడూరు -ఎస్సీ
బెందాళం అశోక్ - ఇచ్ఛాపురం
బొలిశెట్టి శ్రీనివాస్- తాడేపల్లిగూడెం
బొమ్మిడి నారాయణ నాయకర్- నరసాపురం
బొండా ఉమామహేశ్వరరావు- విజయవాడ సెంట్రల్
దాట్ల సుబ్బరాజు (బుచ్చిబాబు)- ముమ్మిడివరం
దివ్య యనమల- తుని
వి.ఎం.థామస్- గంగాధర నెల్లూరు(ఎస్సీ)
జగదీశ్వరి తోయక - కురుపాం(ఎస్టీ)
కాలవ శ్రీనివాసులు- రాయదుర్గం
మాధవి రెడ్డప్పగారి - కడప
పీజీవీఆర్ నాయుడు(గణబాబు)- విశాఖ వెస్ట్
తంగిరాల సౌమ్య- నందిగామ (ఎస్సీ)
యార్లగడ్డ వెంకట్రావు- గన్నవరం
శాసనమండలిలో విప్ లు
వేపాడ చిరంజీవి రావు
కంచర్ల శ్రీకాంత్
పి.హరిప్రసాద్
జనసేనకు టాప్ ప్రయారిటీ
2024 జూలై 1వ తేదీ జనసేన చీఫ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమ పార్టీ నుంచి గెలిచిన ఇద్దరికీ అవకాశం కల్పించాలని సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. అదనంగా ఇద్దరికీ అవకాశం కల్పించారు వారిలో అసెంబ్లీలో ముగ్గురు, మండలిలో ఒకరిని విప్ గా నియమించారు. బిజెపి నుంచి ఒకరికి అవకాశం కల్పించారు.
పదవుల వడ్డన
టిడిపి కూటమి అధికారంలోకి వస్తుందనే ధీమాతో ముందుగానే చాలామంది మంత్రి పదవులు దక్కుతాయని ఆశించారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చాలామంది సీనియర్ల ఆశలు ఆవిరి అయ్యాయి. వారిలో కొందరికి వీప్ పదవులతో సంతృప్తి కలిగించినట్లు కనిపిస్తోంది. ఆ కోవలో. .
కాలువకు విప్ తోసరి..
అనంతపురం జిల్లాలో సీనియర్ నాయకుడైన కాలువ శ్రీనివాసులు రాయదుర్గం నుంచి టిడిపి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈయనకు విప్ పదవి మాత్రమే దక్కింది.
2014 లో టిడిపి అధికారంలోకి వచ్చినప్పుడు ఆయన మంత్రిగా పనిచేశారు. అంతకు ముందు పార్లమెంటు సభ్యుడుగా కూడా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి కాలువకు మంత్రి పదవి దక్కుతుందని ఆశించారు. ఆయనతోపాటు మాజీ మంత్రి పరిటాల సునీత కూడా అదే ఆశతో ఉన్నారు. కానీ, మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన సవితమ్మకు ఆ పదవి దక్కింది. బిజెపి కోటాలో ధర్మవరం నుంచి గెలిచిన సత్య కుమార్ కు మంత్రి పదవి దక్కింది. దీంతో సీనియర్లైన కాలువ శ్రీనివాసులు, పరిటాల సునీతకు అవకాశం లేకుండా పోయింది.
కడప జిల్లాకు ముగ్గురు..
తాజాగా సీఎం చంద్రబాబు ప్రకటించిన విప్ పదవుల్లో కడప జిల్లా నుంచి ముగ్గురికి అవకాశం దక్కింది. జమ్మలమడుగు నుంచి బిజెపి ఎమ్మెల్యే సి. ఆదినారాయణ రెడ్డికి ఆ పదవి దక్కింది. సీనియర్ ఎమ్మెల్యే అయిన ఆదినారాయణ రెడ్డి గతంలో మంత్రిగా కూడా పనిచేశారు.
రైల్వే కోడూరు ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం నుంచి జనసేన ఎమ్మెల్యేగా గెలిచిన అరవ శ్రీధర్ కు విప్గా అవకాశం దక్కింది. వైసీపీ ప్రభుత్వంలో కూడా అప్పటి ఎమ్మెల్యే కి ఇదే పదవి దక్కడం గమనార్హం. ఈ నియోజకవర్గ ఏర్పడిన తర్వాత టిడిపి ప్రభుత్వ కాలంలోనే గెలిచిన సరస్వతమ్మకు మొదటిసారి మంత్రి పదవి దక్కింది. ఆ తర్వాత వరుసగా రెండుసార్లు రైల్వే కోడూరు ఎమ్మెల్యేలకు పదవులు వరించాయి. కడప అసెంబ్లీ స్థానం నుంచి మొదటిసారి గెలిచిన రెడ్డప్ప గారి మాధవి రెడ్డికి కూడా వీప్ పదవి దక్కింది.
చిత్తూరులో ఒకరికే..
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సీఎం చంద్రబాబు సారథ్యంలోని మంత్రివర్గంలో ఎవరికి అవకాశం దక్కలేదు. సీనియర్ అయిన పలమనేరు టిడిపి ఎమ్మెల్యే ఎన్. అమర్నాథరెడ్డి ఆ పదవి ఆశించి భంగపడ్డారు. రెండోసారి మదనపల్లి నుంచి గెలిచిన మైనార్టీ నేత షేక్ షాజహాన్ భాష (జహా) కు కూడా మైనార్టీ మంత్రి చివరి క్షణంలో చేజారినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. ఇదిలా ఉండగా..
గంగాధర నెల్లూరు (Gd Nellore) ఎస్సీ రిజర్వుడు అసెంబ్లీ స్థానం నుంచి మొదటిసారి గెలిచిన విఎం. థామస్ ను కూడా వెబ్ గానియమించారు.
వైసిపి కార్నర్..
శాసనసభలో విప్ పదవులు ఇవ్వడంలో సీఎం చంద్రబాబు వైసీపీని కార్నర్ చేసినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. వైసిపి ప్రభుత్వంలో విప్, మంత్రి పదవులు ఎవరికి కేటాయించిందో... అదే నియోజకవర్గాల్లో సీఎం చంద్రబాబు టిడిపి ఎమ్మెల్యేలకు పదవులు ఇవ్వడం ద్వారా బాధ్యతతో కూడిన ప్రాధాన్యత ఇచ్చినట్లే స్పష్టమవుతుంది. ఆ కోవలో ఉమ్మడి కడప జిల్లాలో రైల్వే కోడూరు ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గంలో అరవ శ్రీధర్, కడప ఎమ్మెల్యే ఆర్. మాధవి రెడ్డి, చిత్తూరు జిల్లా జీడి నెల్లూరు థామస్ కు విప్ పదవుల వడ్డనలో ప్రాధానట ఇవ్వడాన్ని గమనించవచ్చు.
అడిగింది రెండు ఇచ్చింది నాలుగు
శాసనమండలిలో మొదటిసారి ఎమ్మెల్సీలుగా గెలిచిన, ఎంపికైన నలుగురికి విప్ పదవులు కేటాయించారు. అందులో పంచుమర్తి అనురాధ చీఫ్ విప్ కాగా, టిడిపి నుంచి వేపాడ చిరంజీవి, గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో గెలుపొందిన కంచర్ల శ్రీకాంత్ కు, జనసేన నుంచి పి. హరి ప్రసాద్ కు ఈ అవకాశం దక్కింది. మండలిలో ఈ పదవిని జనసేన అడగలేదని తెలిసింది.
జనసేన నుంచి మూడు నెలల కిందటే ఇద్దరు ఎమ్మెల్యేలకు విప్ పదవులు కేటాయించాలని ఆ పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. అందులో రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్, నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నారాయణ నాయకర్ పేర్లు మాత్రమే సిఫారసు చేశారు. అయితే, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ , మండలిలో పి హరి ప్రసాద్ కు కూడా సీఎం చంద్రబాబు ప్రాధాన్యత ఇచ్చారు.