బాబు విజన్ అంటే అది..100 కోట్లతో వరల్డ్ క్లాస్ లైబ్రరీ

రాజధాని అమరావతిలో పంచస్థాయి గ్రంధాలయానికి శోభా గ్రూప్ 100 కోట్లను విరాళాన్ని ప్రకటించింది.

Update: 2025-10-22 15:36 GMT

దుబాయ్‌లోని ప్రముఖ రియాల్టీ సంస్థ శోభా గ్రూప్ అమరావతిలో ప్రపంచస్థాయి గ్రంథాలయం నిర్మాణానికి రూ.100 కోట్ల విరాళం ప్రకటించింది. ఈ సందర్భంగా శోభా గ్రూప్ చైర్మన్ పీఎన్సీ రవి మీనన్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో భేటీ అయి, రాష్ట్రంలో రియాల్టీ రంగంలో పెట్టుబడుల అవకాశాలు, రాజధాని అభివృద్ధి గురించి చర్చించారు. యూఏఈ పర్యటనలో తొలి రోజు జరిగిన ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు ఈ విరాళాన్ని స్వాగతించారు.

గ్రంథాలయం వివరాలు

శోభా రియాల్టీ సంస్థ అమరావతిలో వరల్డ్ క్లాస్ స్టేట్ లైబ్రరీని నిర్మించేందుకు ముందుకు వచ్చింది. ఈ ప్రాజెక్టుకు రూ.100 కోట్ల విరాళం ప్రకటించిన రవి మీనన్‌తో సమావేశమైన సీఎం చంద్రబాబు, శోభా రియాల్టీ సంస్థకు ధన్యవాదాలు తెలిపారు. "అమరావతిని ప్రపంచంలో అత్యుత్తమ నగరంగా నిర్మిస్తున్నాము. ఈ గ్రంథాలయం ఆ విజన్‌కు భాగస్వామిగా నిలుస్తుంది" అని చంద్రబాబు పేర్కొన్నారు. రాజధాని నిర్మాణంలో భాగస్వామి కావాలని శోభా గ్రూప్‌ను ఆహ్వానించారు.

సీఎం మాట్లాడుతూ, "అమరావతి గ్రీన్‌ఫీల్డ్ క్యాపిటల్‌గా అభివృద్ధి చెందుతోంది. దేశవ్యాప్తంగా ప్రపంచస్థాయి నగరాలతో సమానంగా మౌలిక సదుపాయాలు అందుబాటులోకి తీసుకువస్తున్నాము. గ్రీన్ ఎనర్జీకి రాష్ట్రాన్ని చిరునామాగా మార్చే ప్రణాళికలు రూపొందిస్తున్నాము" అని వివరించారు. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ, విశాఖలో గూగుల్ AI డాటా సెంటర్ ఏర్పాటు జరుగుతున్నట్లు చెప్పారు. తిరుపతి, విశాఖ వంటి నగరాల్లో మౌలిక సదుపాయాలపై భారీగా ఖర్చు చేస్తున్నామని తెలిపారు.

రియాల్టీ రంగంలో పెట్టుబడుల అవకాశాలు

ఆంధ్రప్రదేశ్‌లో రియల్ ఎస్టేట్ రంగంలో అపార అవకాశాలు ఉన్నాయని సీఎం చంద్రబాబు రవి మీనన్‌కు వివరించారు. "పోర్టులు, పారిశ్రామిక కారిడార్లు నిర్మితం అవుతున్నాయి. అమరావతి, విశాఖ, తిరుపతి ప్రాంతాల్లో బిజినెస్ & IT పార్కులు, మాల్స్, లగ్జరీ హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్లు, ఉన్నతశ్రేణి హౌసింగ్ ప్రాజెక్టులకు అవకాశాలు ఉన్నాయి" అని చెప్పారు. ఇండస్ట్రియల్ టౌన్‌షిప్‌లు, హౌసింగ్ ప్రాజెక్టులకు పోర్టులు, కారిడార్లతో అనుసంధానం కలిగిన అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. శోభా గ్రూప్ చైర్మన్ రవి మీనన్ మాట్లాడుతూ, "మా సంస్థ దుబాయ్, ఓమాన్, బహ్రెయిన్, ఖతార్, బ్రూనైలో ప్రాజెక్టులు నిర్వహిస్తోంది. భారత్‌లో 14 రాష్ట్రాల 27 నగరాల్లో రియాల్టీ ప్రాజెక్టులు చేపట్టాము. బెంగళూరు, గుర్గావ్, చెన్నై, కేరళలో హౌసింగ్ ప్రాజెక్టులు ప్రస్తుతం జరుగుతున్నాయి" అని తెలిపారు. వచ్చే నెల నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో జరిగే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కు రావాలని శోభా గ్రూప్‌కు సీఎం చంద్రబాబు ఆహ్వానించారు. 

Tags:    

Similar News