ఓటరును కొట్టిన తెనాలి ఎమ్మెల్యే.. తిరగబడిన ఓటరు..

తెనాలిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓటరును ఎమ్మెల్యే కొట్టడంతో సదరు ఓటరు తిరగబడ్డారు.

Update: 2024-05-13 05:52 GMT

పోలింగ్ సమయంలో తెనాలిలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్యే అన్నాబతుని శివకుమార్‌ని ఓ ఓటరు కొట్టడంతో అక్కడ హైటెన్షన్ నెలకొంది. సదరు ఓటరును ఎమ్మెల్యే అనుచరులు తిరిగి చితకబాదారు. దీంతో అక్కడ కక్షలు రాజుకున్నాయి. వెంటనే స్పందించిన పోలీసులు వారిని విడదీసి, ఎమ్మెల్యేను సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లారు.

జరిగిందిది..

అయితే ఓటు వేసే క్రమంలో ఓటు వేయడానికి ఎమ్మెల్యేను క్యూలో రమ్మని సదరు ఓటరు చెప్పాడు. దాంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే.. వెళ్లి ఓటరును చెంపదెబ్బ కొట్టాడు. దానికి స్పందనగా సదరు ఓటరు కూడా తిరిగి ఎమ్మెల్యే చెంప చెళ్లుమనిపించాడు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే అనుచరులు ఆ ఓటరుపై దాడికి పాల్పడ్డారు. పిడిగుద్దులు గుద్దుతూ తీవ్రంగా కొట్టారు. దీనిని గమనించిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గొడవను సర్దుమణిగించారు. ఎమ్మెల్యేను పక్కకు తీసుకుని వెళ్లిపోయారు. ఈ ఘటనతో అక్కడ వాతావరణం హీటెక్కింది. కక్ష్యా రాజకీయాలు రాజుకున్నాయని అక్కడి స్థానికులు చెప్తున్నారు.

Tags:    

Similar News