ఆపరేషన్ సింధూర్ పై మహిళా ప్రొఫెసర్ వివాదాస్పద వ్యాఖ్యలు

బిజెపి నేతల అభ్యంతరం;

Update: 2025-05-08 10:36 GMT
Women Professor mocked Operation Sindhur

తెలంగాణ శాతవాహన యూనివర్సిటి(Sathavahana University) లో ప్రొఫెసర్, తెలంగాణ విద్యాకమిషన్ సభ్యురాలు ఎస్ సుజాత ఆపరేషన్ సింధూర్ చేసిన వ్యాఖ్యలు వివాదం సృష్టించాయి. శ్రీనగర్ లో పహల్గాం(Pahalgam Terror Attack)లో ఉగ్రవాదులు జరిపిన దమనకాండకు నిరసనగా భారత త్రివిధ దళాల ఆధ్వర్యంలో బుధవారం తెల్లవారుజామున పాకిస్ధాన్ ఆక్రమిత కాశ్మీర్లోనే కాకుండా పాకిస్ధాన్ భూభాగంలోని ఉగ్రవాదుల స్ధావరాలపై ఒక్కసారిగా దాడులు చేసి సుమారు 100 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టినది. అయితే ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత మాత్రం ఈ ఆపరేషన్ సింధూర్ మీద వ్యంగ్యంగా పొస్టుపెట్టారు. 


ఆ పోస్టులో ఆమె ఏమన్నారంటే ‘సింధూరం అంటే రక్త సింధూరం లాంటిదా ? నేనేదో భక్తి, పూజ, శుభానికి సంకేతం అనుకునేదాన్ని...యుద్ధాలు శవాలను, శకలాలను మిగులుస్తాయి కాని శాంతిని కాదు’. అని కామెంట్ చేశారు. ఆమె భావనలో నిజముంది అనేందుకు సందేహంలేదు. అయితే తన భావనను వ్యక్తంచేయటానికి ఇది తగిన సమయం కాదన్న విషయం కూడా ప్రొఫెసర్(Professor Sujatha Surepally) కు తెలీకపోవటమే విచిత్రం. యుద్ధం శవాలను, శకలాలనే మిగులుస్తుందని ప్రొఫెసర్ ఇపుడు కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఆ విషయం ప్రతి ఒక్కరికీ తెలుసు. అయితే మనదేశం సరిహద్దుల మీద, దేశంలోని పలుప్రాంతాల్లో తరచూ దాడులు చేస్తు మారణహోమం చేస్తున్న పాకిస్తాన్ సైన్యాన్ని అలాగే వదిలేయాలన్నది ప్రొఫెసర్ ఆలోచనా ? లేకపోతే పహల్గాంలో కాల్పులు జరిపి 26 మంది అమాయక పర్యాటకుల ప్రాణాలు తీసిన ఉగ్రవాదులను క్షమించి వదిలేయాలన్నది ప్రొఫెసర్ ఉద్దేశ్యమా ? అర్ధంకావటంలేదు.

చదువుకుని డిగ్రీలు తెచ్చుకుంటే విద్యార్హతలు లభిస్తాయేమోకాని మేథావులు కాలేరని ఈమహిళా ప్రొఫెసర్ వ్యాఖ్యలను బట్టి అర్ధమవుతోంది. త్రివిధ దళాలు ఆపరేషన్ సింధూర్ చేపట్టిన సమయం, నేపధ్యం ఏమిటో కూడా తెలీకుండానే ప్రొఫెసర్ బుర్రకు తోచిన కామెంట్ పెట్టారా ? అనే సందేహాలు పెరిగిపోతున్నాయి. సుజాత కామెంట్లు చూసిన వారంతా సోషల్ మీడియాలో తీవ్రస్ధాయిలో మండిపోతున్నారు. పాకిస్ధాన్ వాళ్ళంటే మేడమ కు ఎందుకంత ప్రేమంటు నిలదీస్తున్నారు. సుజాతను ప్రొఫెసర్ ముసుగులో ఉన్న అర్బన్ నక్సలైట్ అని మరికొందరు ఆరోపిస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ ను ఎగతాళిచేసిన ఈ ప్రొఫెసర్ ను వెంటనే ఉద్యోగంలో నుండి తొలగించాలని డిమాండ్లు చేస్తున్నారు. సూరేపల్లి గతచరత్రను వెంటనే విచారణ జరిపించి తగిన యాక్షన్ తీసుకోవాలని విద్యార్ధి సంఘాలు కూడా డిమాండ్లు మొదలుపెట్టాయి.

సుజాత కామెంట్ పై బీజేపీ ఎంఎల్ఏలు రాజాసింగ్(BJP MLA Raja Singh), పాయల్ శంకర్, ధన్ పాల్ సూర్యనారాయణ కూడా మండిపోతున్నారు. ఆపరేషన్ సింధూర్ పై సుజాత వ్యాఖ్యలను ప్రభుత్వం సమర్ధిస్తోందా అని రాజాసింగ్ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఆపరేషన్ సింధూర్ ను దేశమంతా కీర్తిస్తుంటే సుజాత మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారంటు ధన్ పాల్ మండిపడ్డారు. ప్రొఫెసర్ ముసుగులో ఉన్న సుజాత అర్బన్ నక్సల్ అంటు ఆరోపించారు. ఆమెను విద్యాకమిషన్ నుండి వెంటనే తొలగించాలని ఎంఎల్ఏలు డిమండ్ చేశారు. ఇది మహిళా ప్రొఫెసర్ వ్యవహారం. అన్నీ వైపుల నుండి ప్రొఫెసర్ కు వ్యతిరేకంగా పెరిగిపోతున్న వ్యతిరేకత, ఆందోళనకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

క్షమాపణ చెప్పిన ప్రొఫెసర్


‘అడుసుతొక్కనేల కాలు కడగనేల’ అన్న సామెత ఈ ప్రొఫెసర్ కు సరిగ్గా సరిపోతుంది. సోషల్ మీడియాలో తన కామెంట్లపై తెలంగాణ సమాజంలో పెరుగుతున్న వ్యతిరేకత, ఆందోళనను ప్రొఫెసర్ గమనించినట్లున్నారు. అందుకనే క్షమాపణలు చెప్పుకున్నారు. తాను ఉదయం రాసిన కామెంట్ గురించి బీజేపీ అన్న, తమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు చాలా హర్టయ్యారని తెలుస్తోందన్నారు. పహల్గావ్ లో భర్తలను కోల్పోయిన స్త్రీలకు సంఘీభావంగా రాసిందే కాని సైన్యంపైన గాని, ప్రభుత్వ చర్యలపై వ్యతిరేకంగా రాసినవి కావని ఫేస్ బుక్ వేదికగా ప్రకటిస్తున్నట్లు చెప్పారు. యుద్ధానంతర పరిస్ధితులమీద కొద్దిగా పరిశోధనలు, ప్రత్యక్షంగా చూసిన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని బాధతో, రాసిన కామెంట్ తప్పితే ఎవరినీ అవమానించాలని కాని దేశభద్రతపైన కాని కామెంట్ చేయలేదనే పిచ్చి సమర్ధన చేసుకున్నారు.

Tags:    

Similar News