TDP v/s Ycp | భూమనకు కౌంట్ డౌన్ మొదలైంది..

క్రిమినల్ కేసులు తప్పవంటున్న టిడిపి నేత పట్టాభి.;

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-08-10 12:32 GMT

తిరుపతిలో మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆయన కొడుకు అభినయరెడ్డి అక్రమాలకు అంతులేకుండా పోయిందని టిడిపి అధికార ప్రతినిధి, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి హెచ్చరించారు.

"ఆధ్యాత్మిక కేంద్రంలో భూమన కుటుంబం అనేక అక్రమాలకు పాల్పడింది" అని పట్టాభి తిరుపతిలో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆరోపించారు.  తిరుపతి నగరంలో అన్ని వర్గాల ప్రజలను వేధించడమే కాకుండా, భయాందోళనకు గురి చేస్తున్నారని కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వైసిపి అంటేనే దళితులను చిత్రహింసలు పెట్టి చంపే పార్టీగా మారిందని పట్టాభి వ్యాఖ్యానించారు.
తిరుపతి నగరంలో ఇటీవల వైసిపి సోషల్ మీడియా ప్రతినిధులు, మాజీ ఎమ్మెల్యే భూమున కారు డ్రైవర్ అనిల్ రెడ్డి ఓ దళిత యువకుడు పవన్ ను పెట్టిన సంఘటనను ఆయన గుర్తు చేశారు. వైసీపీ నేతలు మానవ మృగాలుగా ప్రవర్తిస్తున్నారని ఆయన ఘాటు పదజాలాన్ని ఉపయోగించారు.
క్రిమినల్ కేసు తప్పదు..
వైసిపి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి పై క్రిమినల్ కేసు తప్పదని టిడిపి అధికార ప్రతినిధి పట్టాభి హెచ్చరించారు. "స్వర్ణముఖి నది సమీపంలోని సర్వే నెంబర్ 479లో 9 ఎకరాలు స్థలాన్ని భూమన ఆక్రమించారు" అని పట్టాభి ఆరోపించారు. ఈ భూఆక్రమణకు సంబంధించి రెవెన్యూ మంత్రికి నివేదిక కూడా అందిన విషయాన్ని ఆయన వెల్లడించారు. ఈ సంఘటనపై మాజీ ఎమ్మెల్యే భూమనకు క్రిమినల్ తప్పదు అని ఆయన స్పష్టం చేశారు. ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని కూడా పట్టాభి స్పష్టం చేశారు.
ఎన్ని కోట్లు ఎలా వచ్చాయి?
"తిరుపతిలో మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఓ జిరాక్స్ షాపు ఓనర్ మాత్రమే. ఏ వ్యాపారం కూడా చేయని ఆయనకు ఇన్ని కోట్లు ఎలా వచ్చాయి" స్వచ్ఛ్ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి ప్రశ్నించారు. టీటీడీ చైర్మన్గా ఉన్న సమయంలో కూడా భూమన "కరుణాకర్ రెడ్డి శ్రీవారి నిధులనే కాజేయాలని ప్రయత్నించారు" అని పట్టాభి ఆరోపించారు.
తిరుపతి నగరంలో రోడ్లు విస్తరణకు సంబంధించి జారీ చేసిన టిడిఆర్ బాండలో కూడా భూమన కుటుంబం పై విజిలెన్స్ విచారణ పూర్తయిందని పట్టాభి చెప్పారు. ఈ వ్యవహారంలో మాజీ ఎమ్మెల్యే భువన కరుణాకర్ రెడ్డి ఆయన కొడుకు అభినయ రెడ్డిని అవినీతిపరుడుగా మార్చాలని కూడా ఆయన నిందించారు.
తిరుపతి పార్లమెంటు స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో 35,1 చేర్పించింది కూడా భువన అభినయ రెడ్డి వల్లే జరిగిందని పట్టాభి వ్యాఖ్యానించారు. ఇంతటి అవినీతి అక్రమాలకు, పాల్పడిన మాజీ ఎమ్మెల్యే భూమన మాట్లాడడం చూస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు గా ఉందని పట్టాభి ఎద్దేవా చేశారు.
Tags:    

Similar News