ఎమ్మెల్యే ఆదిమూలంపై లైంగిక ఆరోపణలు.. చెల్లి అంటూనే అత్యాచారం..!

టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై లైంగిక వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చెల్లి అంటూనే తనపై లైంగిక దాడికి పాల్పడ్డారంటూ ఓ మహిళ ఆరోపణలు చేశారు.

Update: 2024-09-05 07:47 GMT

టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై లైంగిక వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చెల్లి అంటూనే తనపై లైంగిక దాడికి పాల్పడ్డారంటూ ఓ మహిళ ఆరోపణలు చేశారు. అంతేకాకుండా కొన్ని వీడియోలను కూడా ఆమె విడుదల చేశారు. హైదరాబాద్‌లోని సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో బాధితురాలు ఈ వివరాలు తన భర్తతో కలిసి వచ్చి వెల్లడించారు. తిరుపతిలోని బీమాస్ హోటల్‌లో తనపై లైంగిన దాడికి పాల్పడ్డినట్లు ఆమె తెలిపారు. ఈ విషయంపై ఇప్పటికే సీఎం చంద్రబాబు సహా మంత్రి నారా లోకేష్‌కు లేఖలు రాశానని, తనకు న్యాయం జరిగేలా చూడాలని ఆమె కోరారు. కాగా ఈ విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తానని కూడా ఆదిమూలం బెదిరించారని, తనకు రక్షణ కూడా కల్పించాలని ఆమె కోరారు.

కోరిక తీర్చకుంటే కుటుంబం సఫా

‘‘మేము కూడా టీడీపీకి చెందిన వాళ్లమే. దీంతో పలు పార్టీ కార్యక్రమాల్లో ఆదిమూలం, మేము కలిశాం. అలా పరిచమైన తర్వాత నా ఫోన్ నెంబర్ తీసుకున్నారు. పదేపదే కాల్ చేయడం ప్రారంభించాడు. తిరుపతిలోని బీమాస్ హోటల్ రూమ్ నెం.109లోకి రమ్మని ఒకసారి కాల్ చేసి చెప్పాడు. అక్కడకు వెళ్లిన తర్వాత బెదిరించి నాపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఎవరికైనా చెబితే నాతో పాటు కుటుంబం మొత్తాన్ని చంపేస్తానని బెదిరించాడు. చెల్లి అంటూనే నాపై మూడు సార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ సమయంలో నేను కొన్ని వీడియోలు కూడా తీశాను. వాటినే విడుదల చేశాను’’ అని ఆమె వివరించారు.

రోజుకో అమ్మాయితో ఎమ్మెల్యే ఎంజాయ్

‘‘టీడీపీలో ఉండటానికి ఆదిమూలంకు అర్హత లేదు. ఆయన గురించి అందరికీ తెలియాలనే నాపై జరిగిన దాడిని పెన్ కెమెరాలో చిత్రీకరించి వీడియోలు విడుదల చేశాను. నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయని ఆదిమూలం వందసార్లు కాల్ చేశాడు. రాత్రి సమయాల్లో కూడా మెసేజ్‌లు చేసి వేధించేవాడు. రోజుకో అమ్మాయితో ఎంజాయ్ చేస్తాడు ఈ ఎమ్మెల్యే. అందమైన అమ్మాయి కనిపిస్తే చాలు.. ఆ అమ్మాయిన తనతో ఉండాలని కోరుకుంటాడు. అలా ఎంతో మందిని టార్చర్ చేశాడు. తిరుపతిలోని బీమాస్ హోటల్.. ఎమ్మెల్యే ఆదిమూలం నీచ కార్యాలకు అడ్డా. ఇలాంటి వాళ్లను పార్టీ నుంచి తొలగించాలి. అయనను ఎలాంటి కార్యక్రమాలకు పిలవకూడదు. ఆదిమూలం మీ ఇంటికి వచ్చాడని ఎవరూ సంబరపడొద్దు. అతడు అలా వచ్చాడంటే మీ భార్య, పిల్లలపై కన్నేస్తాడని గ్రహించండి. ఆదిమూలం అనే వ్యక్తి ఓ కామాందుడు, రాక్షసుడు, అతని నుంచి సత్యవేడులోని టీడీపీ మహిళా కార్యకర్తలను కాపాడలని పార్టీ పెద్దలను కోరుతున్నా’’ అని చెప్పుకొచ్చారు.

Tags:    

Similar News