ఉత్కంఠగా ఫలితాలు.. ఆరంభంలోనే ఆధిక్యం దిశగా కూటమి

ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉత్కంఠగా సాగుతోంది. ఇప్పటివరకు వెల్లడైన ఫలితాల్లో టిడిపి కూటమి భారీ ఆధిక్యత దిశగా సాగుతోంది.

Update: 2024-06-04 05:19 GMT

రాష్ట్రంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు. తీవ్ర ఉత్కంఠకు తెరతీశాయి. కౌంటింగ్ ప్రక్రియ మంగళవారం ఉదయం నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రారంభమైంది. ఇప్పటివరకు జరిగిన మొదటి రెండు ఫలితాల్లో 48 స్థానాల్లో టిడిపి కూటమి అభ్యర్థులు ఉండగా, వైఎస్ఆర్సీపీ 23 స్థానాల్లో మాత్రమే ముందంజలో ఉన్నట్లు ఫలితాలు చెబుతున్నాయి. ఆరంభంలోనే ఈ మెజార్టీ ఉంటే మిగతా రౌండ్లలో ఎలా ఉంటుందనేది వేచి చూడాలి. కడపలో వైఎస్సార్సీపీ అభ్యర్థి వైయస్ అవినాష్ రెడ్డి, రాజంపేటలో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, ఒంగోలులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అరకులో అధికార పార్టీ అభ్యర్థులు లీడ్లో ఉంటే, మిగతా 21 పార్లమెంటు స్థానాల్లో టిడిపి కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

 

రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంటు స్థానాలకు గత నెల 13వ తేదీ పోలింగ్ జరిగింది. ఈవీఎంలలో నిక్షిప్తమైన ప్రధాన పార్టీ అభ్యర్థుల జాతకాలను వెల్లడించే, ఓట్ల లెక్కింపు ప్రక్రియ మంగళవారం ఉదయం ప్రారంభమైంది. ఇందులో మొదట సర్వీస్ ఓట్లను లెక్కించారు. ఇందులో టిడిపి కూటమికి ఆధిక్యత ప్రస్ఫుటంగా కనిపించింది. కాగా,

" గత ఎన్నికలతో పోలిస్తే దేశం మొత్తం రాష్ట్రం వైపు చూసేలా ఫలితాలు ఉంటాయని" సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి పదేపదే ప్రకటిస్తూ వస్తున్నారు. బిజెపి- జనసేన తో కలిసి టీడీపీ కూటమిగా రాష్ట్రంలో పోటీ చేసింది. క్షేత్రస్థాయిలను కాకుండా పరిశీలకుల సైతం టిడిపి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది అని అంచనాలు వేశాయి. ఎగ్జిట్ పల్స్ పోల్ సర్వేలో కూడా దాదాపు 40 జాతీయ స్థానిక మీడియా సంస్థలు, సర్వే ఏజెన్సీలు కూడా మూడు రోజుల క్రితం తమ అంచనాలను వెల్లడించాయి.

అయితే, ఆ పల్స్ పోల్ సర్వేలో ఐదు సంస్థల మినహా మిగతా 35 సంస్థలు టిడిపి కూటమి అధికారంలోకి వస్తుందని తేల్చి చెప్పాయి. అయినప్పటికీ సంక్షేమ పథకాలు, నగదు బదిలీ వంటి అనేక కార్యక్రమాలు తమకు లభిస్తాయని సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి తో పాటు మంత్రులు కీలక నాయకులకు కూడా గంభీరమైన ప్రకటనలు చేశారు. ఓట్ల లెక్కింపు ద్వారా అధికార వైయస్సార్సీపి అంచనాలు తారుమారైనట్లు కనిపిస్తోంది.

 

ఆధిక్యం దిశగా కూటమి అడుగులు

రాష్ట్రంలోని 175 శాసనసభ స్థానాల్లో మంగళవారం ఉదయం మొదటగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. ఇందులోనే టిడిపి కూటమికి ఓటర్లు ఏకపక్షంగా అండగా నిలిచినట్లు ఫలితాలు వెలడయ్యాయి. మొదటి రౌండు ప్రారంభమయ్యాక కూడా టిడిపి కూటమి ఆధిక్యతతో బోణి కొట్టింది. అధికార వైయస్ఆర్సీపీ అభ్యర్థులు ప్రధానంగా మంత్రులు కూడా వెనుకంజలో ఉన్నారు. మొదటి రౌండ్ ముగిసే సరికి టిడిపి, బిజెపి, జనసేన కూటమి అంచనాలకు మించిన స్థాయిలో స్థానాల్లో ఆధిక్యతలో ఉన్నట్లు ఓట్ల లెక్కింపు ప్రక్రియ స్పష్టం చేస్తుంది. ఆ సీట్ల సాధనలో మొదటి రెండు రౌండ్లలో కూడా వైఎస్ఆర్సిపి అభ్యర్థుల పరుగు ఏమాత్రం కనిపించలేదు.

ఉదయం 11 గంటల సమయానికి టిడిపి కూటమి 142 స్థానాల్లో ఆధిక్యతలో కొనసాగుతోంది. ఈ పరుగును ఏమాత్రం అందుకోలేని స్థితిలో వైయస్ఆర్సీపీ అభ్యర్థులు 24 అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే తడవడే స్థాయిలో మెజారిటీలో ఉన్నారు. అలాగే బిజెపి అభ్యర్థులు రాష్ట్రంలోని ఐదు నియోజకవర్గాల్లో ఆధిక్యతలో కొనసాగుతుండగా, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ తో పాటు మిగతా 17 శాసనసభ స్థానాల్లో ఆధిక్యతలో కొనసాగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ మూడు స్థానాల్లో ప్రభావం చూపిస్తుందని భావించినప్పటికీ ఆ వాతావరణం కనిపించడం లేదు.

 

ఓటమి బాటలో మంత్రులు

సీనియర్ మంత్రులుగా రాష్ట్రంలో రాజకీయ చక్రం తిప్పిన చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గ అభ్యర్థి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నగిరి నుంచి ప్రాతినిధ్యం వహించిన ఆర్కే రోజా, మంత్రులు కొడాలి నాని, అనంతపురం జిల్లాలో ఉషశ్రీ చరణ్, అంబటి రాంబాబు, విడుదల రజిని తో పాటు అనేక మంది సీనియర్ మంత్రులు ఓటమి బాటలో పయనిస్తున్నట్లు ఓట్ల లెక్కింపు ప్రక్రియ స్పష్టం చేస్తోంది.

సీమలో కూటమి ప్రభావం

రాయలసీమ జిల్లాలు కడప, కర్నూల్, అనంతపురం, చిత్తూరు తోపాటు నెల్లూరు జిల్లాలో కూడా అధికార వైఎస్ఆర్సిపి చతిగలబడినట్లు మొదటి రెండు ఫలితాల్లో వెలడవుతున్నాయి. 2019 ఎన్నికల్లో రాయలసీమలోని 52 అసెంబ్లీ స్థానాల్లో మూడు చోట్ల మాత్రమే టిడిపి అభ్యర్థులు గెలుపొందారు. వారిలో కుప్పం నుంచి ఎన్ చంద్రబాబు నాయుడు, అనంతపురం జిల్లా హిందూపురం నుంచి నందమూరి బాలకృష్ణ, ఉరవకొండ నియోజకవర్గం నుంచి పయ్యావుల కేశవ్ గెలుపొందిన వారిలో ఉన్నారు. మిగతా 49 స్థానాలను వైఎస్ఆర్సిపి నే దక్కించుకుంది.

 

2024 సార్వత్రిక ఎన్నికల్లో జరిగిన పోలింగ్లో ఈ పరిస్థితి మొత్తం తిరగబడి కూటమి అభ్యర్థులు విజయం దిశగా పయనించేందుకు అడుగులు వేస్తున్నారు. ఓట్ల లెక్కింపులో ఈ విషయం తెలుస్తోంది. నెల్లూరు జిల్లాలో పది స్థానాలను గత ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్సిపి అభ్యర్థులే గెలపొందారు. 2024 ఎన్నికల ఓట్ల లెక్కింపులో అధిక స్థానాల్లో టిడిపి అభ్యర్థులు ఆదిత్యంలో కొనసాగుతున్నారు. ఫలితాలను వెల్లడయ్యే సందర్భంలో ఆరా మస్తాన్ ఇంకా ధీమా వ్యక్తం చేస్తున్నారు. " పోస్టల్ ఓట్లు అధికార పార్టీకి వ్యతిరేకంగా పడి ఉండవచ్చు. ఇక ప్రారంభమయ్యే అన్ని రౌండర్లో వైఎస్ఆర్సిపి అభ్యర్థులు ఆదిత్యంలోకి వస్తారు" అని ఇంకా ధీమాగానే చెబుతున్నారు.

Tags:    

Similar News