‘రాయలసీమ జనం మీద ప్రయోగాలు మానండి, ప్రయోజనం చూపండి’

ఎస్ కె యూనివర్శిటీ లో సీమ నేతల పిలుపు;

Update: 2025-04-21 10:39 GMT
అనంతపురం ఎస్ కె యూనివర్శిటీలో రాయలసీమ కరువు మీద జరిగిన సదస్సులో ప్రసంగిస్తున్న తిప్పిరెడ్డి నాగార్జున రెడ్డి


రాయలసీమ ప్రాంతంలో కరవుకు పాలకులు, ప్రశ్నంచలేని ప్రజలే ప్రధాన కారకులు అని రాయలసీమ యునైటెడ్ ఫోర్స్ రాష్ట్ర అధ్యక్షుడు తిప్పి రెడ్డి నాగార్జున రెడ్డి అన్నారు. ప్రశ్నించడం తెలియకపోతే, ప్రజలు  పాలకుల పనికిమాలిన ప్రయోగాలకు బలికావలసి వస్తుందని, ఇపుడు రాయలసీమ ఈ బాధకరమయిన దశలో ఉందని అన్నారు. ప్రజలు ప్రశ్నించడం నేర్చుకోవాలి, విద్యార్థులు ఉద్యమాలు నిర్వహించాలి, లేకపోతే, రాయలసీమ అమరావతి కోసం సర్వం కోల్పోతుందని  ఆయన అన్నారు.

సోమవారం నాడు AISA(ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్) ఆద్వర్యంలో అనంతపురం శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలోని "ఫార్మసీ సెమినార్" హాల్ లో "రాయలసీమ కరవు-నీటి సవాల్లు మరియు పరిష్కార మార్గాల సాద్యాసాద్యాల"పై జరిగిన విద్యార్థుల సదస్సుకు ఆయన విశిష్ట అతిధిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన రాయలసీమ ప్రాంత కరవు కారణాలను విశ్లేషించారు.

రాయలసీమ కరువని, రాయలసీమ ఎడారి అవుతూ ఉందని, అనునిత్యం మెుసలికన్నీరు కార్చే రాయలసీమ ప్రాంత నాయకులు రాని వర్షాలు కురిపిస్తామని ‘మేఘమధనం’ చేయడం, నీళ్లే లేని సీమలో రెయిన్ గన్నులతోను , ట్యాంకర్లతోను రాయలసీమ ప్రాంత రైతుల పంటలకు నీళ్లు అందించి పంటలు పండిస్తామని చేసిన పథకాలన్నీ పనికిమాలినవే. పాలకులు సీమ ప్రజల మీద ప్రయోగాలు చేశారు తప్ప ప్రయోజనం చేకూర్చలేదు. దురదృష్టమేమంటే రాయలసీమ ప్రాంత ప్రజలుగా మనము ఏ రోజు ఈ బోగస్ ప్రయోగాలను ప్రశ్నించడం లేదు. అలా రాయలసీమ ప్రాంత ప్రజలు ప్రశ్నించడం లేదు కాబట్టి మన రాయలసీమ ప్రాంతానికి తీరని ద్రోహాలు నేటికి చేస్తూనే ఉన్నారు, అని అన్నారు.

సిద్దేశ్వరం దగ్గర క్రిష్ణా నదిపై కేంద్రం నిర్మిస్తున్న నేషనల్ హైవే లో బాగంగా తీగెల వంతెన నిర్మాణం బదులుగా బ్రిడ్జ్ కమ్ బ్యారేజీ నిర్మించాలని ముఖ్యమంత్రులెవరూ ఈ రోజు వరకు కోరక లేదని చెబుతూ కనీసం కర్ణాటక రాష్ట్రంలో నిర్మిస్తున్న అప్పర్ భద్ర నిర్మాణాన్ని మన పాలకులు ఆపలేక పోయారని నాగార్జున రెడ్డి అన్నారు.

“దీనితో రాయలసీమ పశ్చిమ ప్రాంతానికి జీవనాధారమైన హెచ్ ఎల్ సి (HLC), ఎల్ ఎల్ సి (LLC) ఆయకట్టు పూర్తిగా ఎడారి కాబోతోంది. ఇప్పుడు వచ్చిన ఈ ప్రభుత్వం 53 వేల ఎకరాల అమరావతి రాజధాని ప్రాంతంలో మరో 44వేల ఎకరాలకు విస్తరింప చేసి మరోసారి నిర్భంధ అభివృద్ధి కేంద్రీకరణ కోసం రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రాంతాలకు తీవ్రమైన అన్యాయము చేస్తున్నారు. గోదావరి-బనకచర్ల అనుసంధానం చేస్తామ్ రాయలసీమ శశ్యసామలం చేస్తామని చెప్పే ఈ ప్రభుత్వం కేంద్రంలో కీలకమైన భాగస్వామ్యం ఉన్నప్పుడు రాయలసీమ ప్రాంతంలో ఉన్న తుంగభద్ర కృష్ణా నదులపైనే ప్రాజెక్టులను చంద్రబాబు నాయుడు గారు నిర్మించవచ్చు కదా. ఈ రోజు విద్యార్థుల శక్తి మేల్కొనకపోతే మన రాయలసీమ ప్రాంతంలో ఉన్న రైతాంగం సర్వనాశము అవుతుంది,” నాగార్జున రెడ్డి హెచ్చరించారు.

సోషియల్ మీడియా పవర్ ను రాయలసీమ ఉద్యమానికి ఉపయోగించండిని ఆయన పిలుపు నిచ్చారు.

“ఈ మద్య కాశినాయన జ్యోతి క్షేత్రాన్ని ఈ ప్రభుత్వ అధికారులు కూల్చి వేసినప్పుడు నేను వెంటనే సోషియల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఎంత భూములలో కాశినాయన జ్యోతి ఆశ్రమం ఉందో అంత అటవీశాఖ భూమికి బదులుగా నా స్వంత భూమిని ఇవ్వడానికి సిద్దం అని పెట్టిన పోష్టు ఏకంగా 698 వేలమంది షేర్ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చాలామంది నాకు ఫోన్లు చేసి ఏ రాజకీయ నాయకుడు కూడా మీ మాదిరిగా స్పందించలేదు కాబట్టి మీ వెనుక మేము కూడా ఉన్నామ్ అని హామీ ఇచ్చారు. పోస్టును విపరీతంగా వైరల్ చేశారు. దానితో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగివచ్చి కాశినాయన జ్యోతి ఆశ్రమాన్నిదాడి తప్పు అన్నారు.క్షమాపణలు చెప్పారు. ఇపుడు పునర్నిర్మా చేయడం జరుగుతోంది,” అని విద్యార్థులకు వివరించారు.

ఈ సమావేశంలో సాగునీటి సమితి జిల్లా అధ్యక్షుడు రామ్ కుమార్,, కళాకారులు డాక్టర్ రామాంజనేయులు, ఐసా అధ్యక్షుడు వేమన,రఫ్ విద్యార్థి సంఘం నాయకులు వరుణ్, శ్రీకృష్ణదేవరాయల యూనివర్సిటీ విద్యార్థి సంఘాలు మరియు విద్యార్థులు పాల్గొన్నారు


Tags:    

Similar News