డీజీపీకి నివేదికను అందించిన సిట్
ఆంధ్రలో ఎన్నికల పోలింగ్ రోజు నుంచి ప్రతిరోజూ ఎక్కడో ఒక చోటు జరుగుతున్న హింసాత్మక ఘటనలపై సిట్ దర్యాప్తు పూర్తి చేసి నివేదికను సిద్ధం చేసింది.
By : S Subrahmanyam
Update: 2024-05-20 12:21 GMT
ఆంధ్రలో ఎన్నికల పోలింగ్ రోజు నుంచి ప్రతిరోజూ ఎక్కడో ఒక చోటు హింసాత్మక ఘటనలు చెలరేగుతూనే ఉన్నాయి. ఇటీవల టీడీపీ అభ్యర్థి పులవర్తి నానిపై జరిగిన దాడితో ఈ అల్లర్లపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. వెంటనే ఈ హింసాత్మక ఘటనలపై దర్యాప్తు ప్రారంభించాలంటూ ప్రత్యేక సిట్‌ను నియమించింది. దీంతో రంగంలోకి దిగిన సిట్ తన దర్యాప్తును ముగించుకుని వాటిపై 150 పేజీలతో సుదీర్ఘ నివేదికను సిద్దం చేసింది. ఆ నివేదికను కొద్దిసేపటి క్రితమే డీజీపీ హరీష్ కుమార్‌కు సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్ లాల్ భేటి అందించారు. అంతకుముందే దాదాపుగా 30 ప్రాంతాల్లో జరిగిన హింసాత్మక ఘటనలపై వారివురూ చర్చించుకున్నారు. వాటిని నియంత్రించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై పరస్పరం తమ అభిప్రాయాలను పంచుకున్నారు.