ఎక్కువ కాలం బతకం.. శ్రీవారి దర్శనం కల్పించండి..
'డయల్ యువర్ ఈఓ'లో వికలాంగుల, వృద్ధుల ఘోష.
Byline : SSV Bhaskar Rao
Update: 2025-12-05 06:47 GMT
జీవిత చరమాంకంలో ఉన్నాం. ఆన్ లైన్ లో టికెట్ దొరకడం లేదు. కాటికి కాళ్లు చాపుకుని ఉన్నాం. చనిపోయే ముందు ఒకసారి శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనం కల్పించండని వికలాంగులు వేడుకున్నారు. వృద్ధులు, వికలాంగులకు ఒకే టైంస్లాట్ కోటా (Time Slot Darsan Kota) వల్ల ఇబ్బంది పడుతున్నామని కూడా వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శించుకోవడానికి గతంలో మాదిరే వృద్ధులు, వికలాంగులు, చంటి బిడ్డ తల్లులకు వేర్వేగా ఆఫ్లైన్ (Off Line) దర్శనం కల్పించాలని సీనియర్ సిటిజన్స్ వేడుకున్నారు. వైకుంఠ ద్వార దర్శనాలు రెండు తెలుగు రాష్ట్రాలు, తమిళనాడు ప్రాంతానికి చెందిన యాత్రికులకే పరిమితం చేశారనే అపవాదును టీటీడీ మూటగట్టుకుంది.
తిరుమల అన్నమయ్య భవన్ లో శుక్రవారం ఉదయం నిర్వహించిన డయల్ యువర్ ఈఓ కార్యక్రమంలో TTD Eo అనిల్ కుమార్ సింఘాల్ స్వయంగా ఈ విషయం వెల్లడించారు.
టీటీడీ ప్రధానంగా తిరుమల శ్రీవారి ఆలయం, అన్నదానం, దర్శన టికెట్ల విషయంలో సమస్యలు తెలుసుకునేందుకు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ డయల్ యువర్ ఈఓ కార్యక్రమం నిర్వహించారు. అనేక రాష్ట్రాల నుంచి 23 మంది కాలర్లు ఈఓకు ఫోన్ చేసి, మాట్లాడారు.
రెండు, మూడేళ్లలో చనిపోతా..
తిరుపతి జిల్లా వెంకటగిరి ప్రాంతానికి చెందిన మహేశ్వరయ్య డయల్ యువర్ ఈఓ కార్యక్రమానికి ఫోన్ చేసి ఈఓ సింఘాల్ తో మాట్లాడారు.
"అయ్యా, నేను వృద్ధుడిని, అందులో కూడా వికలాంగుడిని. మీరిచ్చిన టీటీడీ వెబ్సైట్లో దర్శనం కోటా టికెట్ మూడు నెలలుగా దొరకలేదు. నేను రెండు మూడు సంవత్సరాల కంటే ఎక్కువ కాలం బతకను. సచ్చిపోయేముందు ఒక్కసారి వెంకటేశ్వర స్వామి దర్శనం కల్పించండి" అని ప్రాధేయపడ్డారు. ఆయన మాటలు విన్న డయల్ యువర్ కార్యక్రమానికి హాజరైన వివిధ శాఖల టిటిడి అధికారులు అవక్కయ్యారు.
ఆ వృద్ధ వికలాంగుడి బాధను అర్థం చేసుకున్న టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మనసుకు హత్తుకునే మాటలతో సాంత్వన చెప్పారు. రోజుకు 60 వేల నుంచి 65 వేల యాత్రికులకు శ్రీవారి దర్శనం కల్పించడానికి అవకాశం ఉందని ఈవో అనిల్ కుమార్ సింఘాల్ గుర్తు చేశారు. వీఐపీల దర్శనం తర్వాత వివిధ వర్గాలకు అందుబాటులో ఉన్న సైన్స్ లోకంలో కోటా వివరాలను చెప్పారు. తప్పకుండా మీకు దేవదేవుని ఆశీర్వచనాలు ఉంటాయి మా అధికారులు మీతో మాట్లాడతారు అని అనిల్ కుమార్ సింఘాల్ ఆ వృద్ధుడిని ఓదార్చారు.
"దర్శనం కోసం ప్రతి భక్తుడు కోరుకోవడంలో తప్పులేదు అయితే అందుబాటులోని గంటలు యాత్రికుల సంఖ్యను కూడా దృష్టిలో ఉంచుకొని సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం" అని ఈవో అనిల్ కుమార్ సింగల్ చెప్పారు. అధికారులు మీకు ఫోన్ చేసి ఎలా చేయాలనేది చెబుతారంటూ మహేశ్వరయ్యను ఈఓ సముదాయించారు
కోటా పెంచండి..
తిరుమల శ్రీవారి దర్శనానికి సీనియర్ సిటిజన్ల కోట పెంచాలని ఏలూరుకు చెందిన వెంకటేశ్వరరావు టీటీడీ ఈవోను కోరారు. ప్రస్తుతం ఇస్తున్న ఆన్లైన్ కోటా వల్ల ఆరు నెలలుగా ప్రయత్నిస్తున్న టికెట్లు దొరకడం లేదని కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
సాధ్యం కాదు..
తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి ఆన్లైన్లో వెయ్యి మందికి కోట కేటాయించాం అని టిటిడి ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ సమాధానం చెప్పారు. వీలైనంతవరకు న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తానని కూడా ఆయన హామీ ఇచ్చారు.
ఆఫ్లైన్ కోట ఇవ్వండి
వృద్ధులు వికలాంగులకు కలిపి ఒకే రకం కోట ఇవ్వడం వల్ల టోకెన్లు దొరకడం లేదని భీమవరం ప్రాంతానికి చెందిన దుర్గాప్రసాద్ అనే వికలాంగుడు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో మాదిరి ఉన్న ఆఫ్లైన్ పద్ధతిని పునరుద్ధరించాలని కూడా ఆయన కోరారు. ఐదు నెలలుగా రోకన్ కోసం ఆన్లైన్లో ప్రయత్నిస్తుంటే దొరకడం లేదు అని కూడా దుర్గాప్రసాద్ కలప చెందారు.
సమయాభావం
శ్రీవారి దర్శనానికి ఉన్న సమయం తక్కువ ఉంటుంది. డిమాండ్ ఎక్కువ ఉందనే విషయాన్ని ఈవో అనిల్ కుమార్ సింగల్ గుర్తు చేశారు. దర్శనం చేసుకోవాలని అభిప్రాయం ఉండడం సహజమని, ఏ కేటగిరి అయిన టైం తక్కువ ఉంటుందని విషయం అనిల్ కుమార్ సింగల్ ప్రస్తావించారు. అన్ని అభిప్రాయాలు తీసుకున్న తర్వాత సముచిత నిర్ణయం తీసుకునే విధంగా ఆలోచన చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
300 రూపాయల టికెట్ ఇవ్వండి
శ్రీవారి దర్శనానికి ప్రస్తుతం ఇస్తున్న 300 రూపాయల కోట టికెట్ మాదిరే వికలాంగులకు కూడా ప్రత్యేకంగా కోట ఇవ్వాలని చెన్నై నగరానికి చెందిన శ్రీనివాస్ కోరారు.
"నేను వికలాంగుడిని. మూడు నెలల నుంచి ప్రయత్నం చేస్తున్న. ఆన్లైన్లో టికెట్ దొరకడం లేదు. వృద్ధులు వికలాంగుల వేతన అర్థం చేసుకోండి" అని శ్రీనివాస్ అభ్యర్థించారు.
సాధ్యమా ..?
తిరుమల శ్రీవారి ఆలయంలో రోజుకు రెండున్నర గంటలు వీఐపీల దర్శనానికి సరిపోతుందనీ టిటిడి ఈవో అనిల్ కుమార్ సింగల్ గుర్తు చేశారు. రోజుకు 60 వేల నుంచి 80 వేల మంది యాత్రికులకు మంచి దర్శనం చేయించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం అని ఆయన చెప్పారు. ఇదే సమయంలో శీఘ్ర దర్శనం టోకెన్లు, చంటి పిల్లలు, ఎస్ ఎస్ డి టోకెన్లు జారీ చేసి దర్శనం కల్పిస్తున్నాము అని ఆయన చెప్పారు. ఎస్ ఎస్ డి టోకెన్లు విడుదల చేసిన క్షణాల్లోనే బుక్ చేసుకుంటున్నారు దీనివల్ల నెలకు 4.5 జీరో లక్షల మందికి కేటాయిస్తున్నట్లు ఈవో సింగాల్ వివరించారు. ప్రస్తుతం ఉన్న కోటాకు తోడు సబ్ కోటాలు కూడా ఇస్తే శ్రీవారి దర్శనం చేయించడం సాధ్యం కాదు. చాలా ఇబ్బందులు ఎదురవుతాయని కూడా ఈవో సింహాల ప్రస్తావించారు. ఎక్కువ మందికి దర్శనం కల్పించడానికి ఎలాంటి ఇబ్బంది లేని వాతావరణంలో ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు.
ఫోన్లకు స్పందించరా? డోనర్ల ఆగ్రహం
శ్రీవారి ట్రస్ట్ కు విరాళాలు అందించిన దాతలు అనేక సందేహాలు వ్యక్తం చేశారు. వారి సమస్యలు కూడా అనేకం ఉన్నాయనే విషయం డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో వెల్లడయ్యాయి. టిటిడి అధికారులకు సమాచారం లేదా ఫిర్యాదులు చేయడానికి ఫోన్ చేస్తే స్పందన ఉండదు అనేది ప్రధాన ఆరోపణ.
ఢిల్లీకి చెందిన శర్మ అనే టిటిడి డోనర్ డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో తీవ్ర ఆరోపణలు చేశారు.
"శ్రీవారి ట్రస్ట్ కు లక్ష రూపాయలు విరాళం ఇచ్చాను సార్. ఆన్లైన్లో బుక్ చేసుకుందామంటే దర్శనం దొరకడం లేదు. కాల్ సెంటర్ కు ఫోన్ చేస్తే సమాధానం లేదు. డోనర్ సెల్ నెంబర్ కు ఫోన్ చేసిన అదే పరిస్థితి. ఒకరిపై మరొకరు చెప్పుకుంటూ మా సహనాన్ని పరీక్షిస్తున్నారు" అని ఢిల్లీ భక్తుడు శర్మ చేసిన వ్యాఖ్యలతో అధికారులు అవాక్కయ్యారు.
మీరు సమాధానం చెప్పండి..
ఢిల్లీ యాత్రికుడు శర్మ చేసిన ఆరోపణల నేపథ్యంలో దీనిపై సమాధానం చెప్పాలంటే అనిల్ కుమార్ సింగల్ అదనపు సిహెచ్ వెంకయ్య చౌదరికి సూచించారు. టీటీడీకి 1.46 లక్షల మంది డోనర్స్ ఉన్నారు. వారికి ఆన్లైన్లో కోట టికెట్లు కూడా విడుదల చేస్తున్నాం అని వెంకయ్య చౌదరి చెప్పారు.
"ప్రతి సంవత్సరం నవంబర్, డిసెంబర్ నెలలో డోనర్లకోట టికెట్లు పెంచుతాం. అప్పుడు బుక్ చేసుకోండి. మీకు దర్శనం తప్పక లభిస్తుంది" అని ఢిల్లీ యాత్రికుడు శర్మకు టిటిడి అదనపు ఈవో వెంకయ్య చౌదరి సమాధానం ఇచ్చారు.
శ్రీవారి దర్శనానికి వచ్చే యాత్రికుల్లో గోవింద మాల ధరించి వచ్చే వారు కూడా ఎక్కువ ఉంటారు. వీరికి ప్రత్యేకంగా కోట ఇవ్వాలని నంద్యాలకు చెందిన నాగార్జున కోరారు. ఆన్లైన్ విధానం అమలుచేరే గోవిందమాల భక్తులకు మంచి జరుగుతుందని కూడా ఆయన సూచించారు. ఇప్పటికే టీటీడీలో యాత్రికుల కోసం అనేక రకాల కోటాలో అమలు చేస్తున్నాం అని గుర్తుచేసిన ఈవో సింఘాల్.. గోవింద మాల భక్తులకు కోటా ఇవ్వడం సాధ్యం కాదని స్పష్టం చేశారు
హైదరాబాదుకు చెందిన సువర్ణ అనే దాత మాట్లాడుతూ, శ్రీవారికి విరాళాలు ఇచ్చిన తర్వాత నామినీ తోపాటు, కుటుంబంలోని అదనపు వ్యక్తుల పేర్లు కూడా నమోదు చేస్తారు. వారికి ఇష్టం లేకుంటే కొంతమంది పేర్లు తొలగించుకునే ఆప్షన్ దాతకే ఉండేది. ఆన్లైన్లో ఇలా చేయడం సాధ్యం కావడం లేదు అని హైదరాబాద్ చెందిన సువర్ణ ఫిర్యాదు చేశారు. అదనపు పేర్లు తొలగించే ఆప్షన్ తమకే మళ్లీ ఇవ్వాలని ఆమె కోరారు. ఈ సమస్యపై స్పందించిన ఈవో సింగల్ వారంలోపు ఈ విధానంపై నిర్ణయం తీసుకుని వెల్లడిస్తామని సమాధానం చెప్పారు.
మా పరిస్థితి ఏమిటి
శ్రీవారి ట్రస్టుకు 74 లక్షల రూపాయలు నా భర్త విశ్వనాథరావు విరాళాలు అందించారని తిరుపతికి చెందిన దీప గుర్తు చేశారు. తొమ్మిది నెలల కిందట తన భర్త చనిపోయాడని, డోనార్ సెల్ లో తన పేరు నమోదు చేసుకోవడానికి ఏమి చేయాలీ, గతంలో మాదిరి డోనర్ కోటాలో దర్శనాలు ఉంటాయా అని కూడా దీప సందేహం వ్యక్తం చేశారు. ఈ సమస్యను శుక్రవారం సాయంత్రం లోపల పరిష్కారం చేస్తామని సమాధానం చెప్పారు. మాకు దర్శనాలు లభిస్తాయి
కఠినంగా వ్యవహరిస్తున్నారు..
శ్రీవారి దర్శనానికి వెళ్లేటప్పుడు, విమాన ప్రాకారం నుంచి తిరిగి వచ్చే సమయంలో ఉద్యోగులు కటువైన పదజాలంతో అభ్యంతరకరంగా వ్యవహరిస్తున్నారు అని విశాఖపట్నం చెందిన శివశంకర్ ఫిర్యాదు చేశారు. ఆలయంలో టిటిడి ఉద్యోగుల వల్ల యాత్రికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని కూడా ఆయన ఆరోపించారు. బలవంతపు చర్యలకు దిగే బదులు గోవిందా నామస్మరణతో యాత్రికులను ముందుకు నడిపించే విధంగా సిబ్బందికి అవగాహన కల్పించాలని శివశంకర్ టిటిడి అధికారులకు సూచన చేశారు.
తిరుమలలో యాత్రికులతో గౌరవప్రదంగా మెలగాలని టీటీడీ ఉద్యోగులు, శ్రీవారి సేవకులకు స్పష్టమైన సూచనలు ఇచ్చామని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింగల్ సమాధానం చెప్పారు.
" ఆలయంలో కూడా గోవింద నామ స్మరణలతో యాత్రికులను ముందుకు నడిపించడానికి అవసరమైన శిక్షణ కూడా ఇచ్చాం"అని గుర్తుచేసిన ఈవో సింఘాలు ఇకపై మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
శ్రీవారి దర్శనం తర్వాత హుండీ, యోగ నరసింహస్వామి ఆలయం వద్ద బయటికి రావడానికి ఇబ్బందికరంగా ఉందని హైదరాబాద్ చెందిన వెంకటరమణమూర్తి ఫిర్యాదు చేశారు.
" 300 రూపాయల టికెట్లు తీసుకున్న తర్వాత అందులోని యాత్రికులు దర్శనానికి రాకుంటే లడ్లు ఇవ్వడం లేదు. స్కానింగ్ కావడం లేదని తిరస్కరిస్తున్నారు" అని కూడా వెంకటరమణమూర్తి గుర్తు చేశారు.
ఆలయంలో శ్రీవారి హుండీ, వెండి వాకిలి వద్ద తోపుడుకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకుంటామని ఈవో అనిల్ కుమార్ సింగల్ హామీ ఇచ్చారు. ఎస్ఇడీ టికెట్లు తీసుకున్నవారు దర్శనాన్ని రాకుంటే రెడ్లు ఎలా ఇవ్వాలి అనే విషయంలో అధ్యయనం చేస్తున్నాం అని కూడా ఆయన స్పష్టత ఇచ్చారు.
వైకుంఠ ద్వార దర్శనాలు ఆన్ లైన్ చేసి, మంచి పని చేశారని కామారెడ్డి ప్రాంతం గాంధారికి చెందిన రామ్మోహన్ రాథోడ్ అన్నారు. అలిపిరి కాలిబాటలో పెద్దల వెంట పిల్లలను మధ్యాహ్నం తరువాత అనుమతించడం లేదు. ప్రమాదకర ప్రదేశాల్లో కంచె ఏర్పాటు చేయడం ద్వారా భద్రత కల్పించాలని సూచించారు.
వైకుంఠ ద్వార దర్శనానికి టికెట్ రాకున్నా టీటీడీకి మద్దతు తెలిపిన మాకు ధన్యవాదాలు అని రాథోడ్ ను ఈఓ సింఘాల్ అభినందించారు. కాలిబాటలో అటవీశాఖాధికారులు పరిశీలన చేసి, వన్యప్రాణులకు ఇబ్బంది లేని విధంగా చర్యలు తీసుకుంటారని సమాధానం చెప్పారు.