ఎంపీ మిథున్‌రెడ్డిపై సిట్ ప్రశ్నల వర్షం
శనివారం సిట్ విచారణకు రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి హాజరయ్యారు.;
By : The Federal
Update: 2025-04-19 13:17 GMT
మాజీ మంత్రి పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు, రాజంపేట ఎంపీ, వైసీపీ కీలక నేత, జగన్‌కు అత్యంత సన్నిహిడు అయిన పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి సిట్ విచారణ పూర్తి అయ్యింది. శనివారం ఉదయం విజయవాడ పోలీసు కమిషనర్ కార్యాలయానికి చేరుకున్న మిథున్‌రెడ్డిని సాయంత్రం వరకు సిట్ అధికారులు విచారించారు. దాదాపు 8 గంటల పాటు మిథున్‌రెడ్డిని సిట్ అధికారుల బృందం విచారించింది. సుదీర్ఘ సమయం విచారించిన సిట్ అధికారులు మిథున్‌రెడ్డి చెప్పిన విషయాలను, స్టేట్‌మెంట్స్‌ను రికార్డు చేయడంతో పాటు మిథున్‌రెడ్డితో సంతకాలు చేయించుకున్నారు. సుప్రీం కోర్టు ఇచ్చి ఆదేశాల ప్రకారం న్యాయవాది సమక్షంలోనే సిట్ అధికారులు మిథున్‌రెడ్డిని విచారించారు.
మద్యం కుంభకోణంకు సంబంధించిన పలు కీలక అంశాల మీద మిథున్‌రెడ్డిని విచారించారు. మద్యం పాలసీ రూపకల్పన దగ్గర నుంచి అనేక అంశాల మీద ప్రశ్నల వర్షం కురిపించారు. లిక్కర్ పాలసీలో మిథున్‌రెడ్డి పాత్రం, మద్యం తయారీ, డిస్టలరీ నుంచి ఆంధ్రప్రదేశ బేజరేజెస్ కార్పొరేషన్‌కు మద్యం కొనుగోళ్లు, విక్రయాలు వంటి కీలక అంశాలపై మిథున్‌రెడ్డి ద్వారా సమాచారం రాబట్టేందుకు సిట్ అనేక ప్రశ్నలు సంధించింది. మరి ముఖ్యంగా మద్యం తయారీలోను, మద్యం విక్రయాల్లోను, మద్యం పాలసీ రూపకల్పనలోను రాజ్ కసిరెడ్డి పాత్ర గురించి ప్రశ్నలు సంధించినట్లు సమాచారం.
రాజ్ కసిరెడ్డి, ఆయన అనుచరులు చాణక్య రాజ్, అవినాష్‌రెడ్డిలతో మిథున్‌రెడ్డికి ఎలాంటి సబంధాలు ఉన్నాయి, వారి మధ్య ఏమైనా ఆర్థిక లావాదేవీలు జరిగాయా అనే విషయా గురించి కూడా సిట్ అధికారులు ఆరా తీశారు. మధ్యాహ్నం కాస్త భోజన విరామం సమయం ఇచ్చిన సిట్ అధికారులు ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్వరామంగా మిథున్‌రెడ్డిని విచారించగా, సిట్ అధికారులు అడిగిన ప్రశ్నల్లో కొన్నింటికి జవాబు చెప్పిన మిథున్‌రెడ్డి మరి కొన్నింటికి దాటవతే ధరోణిలో సమాధానాలు చెప్పినట్లు తెలిసింది. అయితే మరో సారి మిథున్‌రెడ్డిని విచారణకు పిలిచే అవకాశం ఉన్నట్లు తెలిసింది.