‘ఏనాడూ చేయి చాచలేదు’.. ప్రెస్‌మీట్లో ఏడ్చేసిన షర్మిల

కడపలో మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు ఏపీసీసీ చీఫ్ షర్మిల. తాను ఏనాడు జగన్‌ను ముందు చేయిచాచి సాయం కోరలేదన్నారు.

Update: 2024-05-10 12:55 GMT

ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల.. మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. తనను ఉద్దేశించిన జగన్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ఆమె కంటతడి పెట్టుకున్నారు. తనకు, తన సోదరుడు వైఎస్ జగన్‌కు మధ్య రాజకీయపరంగా ఎటువంటి గొడవ లేదని, పదవులు ఇవ్వలేదనే విభేదించానని జగన్ చెప్తున్న మాటలు పచ్చి అబద్దాలంటూ కెమెరా మందే బోరుమన్నారు. తనకు ఎటువంటి రాజకీయ కాంక్ష లేదని, బైబిల్‌పైన ప్రమాణం చేసి చెప్తున్నానని కీలక వ్యాఖ్యలు చేశారు.

పైసా సాయం కోరలేదు

తాను కానీ తన భర్త అనిల్ కానీ ఇప్పటివరకు ఎన్నడూ జగన్‌ను ఒక్క పైసా కూడా సాయం కోరలేదని ఆమె స్పష్టం చేశారు. అంతేకాకుండా జగన్ నుంచి తాము ఎలాంటి సహాయం పొందలేదని, ఎంతటి కష్టమైనా తామే పోరాడి చక్కదిద్దుకున్నామని వివరించారామే. తండ్రి పేరును ఛార్జ్‌షీట్లో చేర్చిన వారిని వెంటబెట్టుకుని తిరుగుతున్న మీకు, సాక్షిలో తండ్రి ఫొటో పెట్టుకుని ఆయన తమ్ముడు వివేకా వ్యక్తిత్వాన్ని కించపరిచేలా కథనాలు ప్రసారం చేసిన మీలాంటి వాళ్లు విశ్వసనీయత గురించి ఎలా మాట్లాడతారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు షర్మిల.

Tags:    

Similar News