మొబైల్‌ ఫోన్లకు మెస్సేజ్‌లు పంపండి.. ప్రజలను అలెర్ట్‌ చేయండి

తుపాను, వర్షాల, ప్రమాదాలపై ప్రజలను అప్రమత్తం చేయండి. మెస్సేజ్‌లు పంపి అలెర్ట్‌ చేయండని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు.

Update: 2024-10-14 08:46 GMT

అల్పపీడనం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కురుసున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేయాలని, మొబైల్‌ ఫోన్లకు మెస్సేజ్‌లు పంపుతూ అలెర్ట్‌ చేయాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు రోజులు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ తెలిపిందని సీఎం చంద్రబాబు అధికారులకు చెప్పారు. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గురువారం వరకు వర్షాలు కురుస్తాయి. ఈ నేపథయలో చెరువులు, కాలువలు, నీటి వనరుల వద్ద ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు.

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, దాని ప్రభావంతో కురుస్తున్న వర్షాలు, తీసుకొవలసి ముందస్తు జాగ్రత్తలు తదితర అంశాలపై సీఎం చంద్రబాబు మంత్రులు, జిల్లా కలెక్టర్లు, అధికారులతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వర్షాల పట్ల అప్రమత్తతపై ఆయన అధికారులకు దిశా నిర్థేశం చేశారు. చెరువులు, కట్టలు, కాలువ కట్టల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. వాగులు, కాలువల వద్ద అవసరమైన ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అధికారులు అప్రమత్తంగా ఉంటూ ప్రజలను అప్రమత్తం చేస్తూ ప్రాణ, ఆస్తి నష్టం జరక్కుండా చూడాలని ఆదేశించారు. అన్ని ప్రాంతాల్లో కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేసి ప్రజల వినతులపై వేగంగా స్పందించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఉమ్మడి అనంతపురం, కడప, చిత్తూరు. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయని, ఆ జిల్లాల్లో ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను అందుబాటులో ఉంచినట్లు అధికారులు సీఎంకు వివరించారు.
Tags:    

Similar News